వారణాసి కోసం పాత ఫార్ములానే ఫాలో అవుతున్న జక్కన్న
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా వారణాసి.
By: Sravani Lakshmi Srungarapu | 19 Nov 2025 8:00 PM ISTదర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా వారణాసి. పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ రోల్ లో కనిపించనున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఓ 3 నిమిషాల వీడియోను రిలీజ్ చేసి ఆ వీడియోతో టాలీవుడ్ లోనే కాకుండా ప్రపంచం మొత్తం దాని గురించి మాట్లాడుకునేలా చేశారు రాజమౌళి.
3 నిమిషాల వీడియోతోనే వారణాసి రికార్డులు
2027 సమ్మర్ లో వారణాసి సినిమా రిలీజవుతుందని జక్కన్న చెప్పినప్పటికీ ఆ విషయం నమ్మేలా లేదని కొందరు అంటున్నారు. అయితే సినిమా ఎప్పుడు రిలీజైనా ప్రపంచం మొత్తం దాని కోసం తెలుగు సినిమా వైపు చూడటం ఖాయమని అందరూ నమ్ముతున్నారు. రిలీజ్ కు ఇంకో ఏడాదికి పైగానే టైమున్నప్పటికీ ఆ సినిమాపై 3 నిమిషాల వీడియో ఎంతో ఆసక్తిని, అంచనాలను పెంచేసింది.
నిర్మాతగా మారిన రాజమౌళి కొడుకు కార్తికేయ
వారణాసి సినిమాకు ముందు రూ.1000 కోట్ల బడ్జెట్ ను అనుకున్నారని, కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో దాన్ని రూ.1200 కోట్లకు పెంచినట్టు తెలుస్తోంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్లో కె.ఎల్ నారాయణతో పాటూ రాజమౌళి కొడుకు ఎస్.ఎస్ కార్తికేయ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వారణాసి సినిమాతోనే కార్తికేయ మొదటిసారి నిర్మాతగా మారుతున్నారు.
నాలుగేళ్ల నుంచి వారణాసి తోనే జక్కన్న
తన కొడుకు కార్తికేయ కూడా నిర్మాత కావడంతో రాజమౌళి సినిమా బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత నుంచి రాజమౌళి ఈ సినిమా కోసమే కష్టపడుతూ ఉన్నారు. ఎంతోకాలంగా ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేసి దాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లిన రాజమౌళి ఈ మూవీ కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
జక్కన్న ఏ సినిమా చేసినా సరే అందులో ఆయన ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయి వర్క్ చేస్తుంది. అందుకే ఫ్యామిలీ ప్యాకేజ్ కింద రాజమౌళి నెలకు ఇంత చొప్పున కనీస జీతం తీసుకుని, సినిమా రిలీజయ్యాక మాత్రం వచ్చే లాభాల్లో 50% తీసుకోవడం రాజమౌళికి అలవాటు. ఇప్పుడు వారణాసి సినిమాకు కూడా రాజమౌళి అదే ఫార్ములాని ఫాలో అవుతున్నారని తెలుస్తోంది. మహేష్ బాబు కూడా ఈ సినిమాకు ఏడాదికి ఇంత చొప్పున సినిమా పూర్తయ్యే వరకు తీసుకుని మిగిలింది రిలీజ్ తర్వాత లాభాల్లో షేర్ తీసుకుంటానని చెప్పారని తెలుస్తోంది.
