Begin typing your search above and press return to search.

మహేష్ రాజమౌళి.. నెక్స్ట్ టెన్షన్ గట్టిగానే..

కానీ తన నెక్స్ట్ భారీ విజన్ కు సరిగ్గా సెట్ అయ్యే హీరోను ఎంచుకోవడమే ఆయన ముందున్న ఏకైక టాస్క్. ప్రస్తుతానికి ఆ ఆలోచన కూడా లేకుండా వారణాసి మీదే ఫోకస్ పెట్టారు.

By:  M Prashanth   |   19 Jun 2026 9:17 AM IST
మహేష్ రాజమౌళి.. నెక్స్ట్ టెన్షన్ గట్టిగానే..
X

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న వారణాసి సినిమాపై అంచనాలు మామూలు స్థాయిలో లేవు. దాదాపు 1400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ టైమ్ ట్రావెల్, మాయన్ నాగరికత లాంటి సరికొత్త కాన్సెప్ట్ లతో రాబోతోంది. ఇందులో శివ భక్తుడు రుద్రగా మహేష్, కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 3000 నుంచి 4000 కోట్ల బిజినెస్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల్లో గట్టిగా టాక్ నడుస్తోంది.

2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ స్థాయిలో భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. వారణాసి గనక ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్లిక్ అయితే ఇక కలెక్షన్ల లెక్కలు ఎవరి ఊహకు కూడా అందవు. అయితే అసలైన టెన్షన్ అంతా ఈ సినిమా రిలీజ్ పూర్తయిన తర్వాతే మొదలవుతుంది. ఇంతటి భారీ గ్లోబల్ సక్సెస్ చూశాక మహేష్, రాజమౌళి ఇద్దరిదీ ఒకే రకమైన పరిస్థితి అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

వారణాసి తర్వాత వీరు తీయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ప్రపంచవ్యాప్తంగా భారీ ఫోకస్ ఉంటుంది. అందుకే ఆ తర్వాత ఎవరితో పని చేయాలి అనే విషయంలో ఈ ఇద్దరి ముందు ఒక అతిపెద్ద సవాల్ నిలబడబోతోంది. ముందుగా డైరెక్టర్ రాజమౌళి వరకు చూసుకుంటే ఆయనకు హీరోల పరంగా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఆయన దగ్గర పక్కా కథ లేకపోయినా సరే, కేవలం పిలిచి అడిగితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి దేశంలోని టాప్ స్టార్ హీరోలంతా క్యూలో రెడీగా ఉంటారు.

కానీ తన నెక్స్ట్ భారీ విజన్ కు సరిగ్గా సెట్ అయ్యే హీరోను ఎంచుకోవడమే ఆయన ముందున్న ఏకైక టాస్క్. ప్రస్తుతానికి ఆ ఆలోచన కూడా లేకుండా వారణాసి మీదే ఫోకస్ పెట్టారు. కానీ హీరో మహేష్ బాబు పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తిగా డిఫరెంట్ గా ఉండబోతోంది. వారణాసి లాంటి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ తర్వాత ఆయనకు సరైన డైరెక్టర్ దొరకడం అంటే అంత ఈజీ టాస్క్ కాదు. రాజమౌళి సెట్ చేసిన ఆ భారీ స్కేల్ ను, కొత్తగా వచ్చిన ఆ గ్లోబల్ ఇమేజ్ ను మ్యాచ్ చేయగల దర్శకులు మన ఇండియాలో చాలా తక్కువ మంది ఉన్నారు.

ప్రస్తుతం మహేష్ నెక్స్ట్ సినిమా ఫలానా డైరెక్టర్లతో ఉంటుందనే రూమర్స్ వస్తున్నా అవేవీ అంత తేలికగా సెట్ కావు. గతంలో లాగా కేవలం ఒక చిన్న స్టోరీ లైన్ విని మహేష్ బాబు ఎవరికీ అంత త్వరగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. ఏ డైరెక్టర్ అయినా సరే పక్కాగా ఫుల్ స్క్రిప్ట్ తో వస్తే తప్ప కొత్త ప్రాజెక్ట్ ఓకే అయ్యే ఛాన్స్ అస్సలు లేదు. కాబట్టి ఇప్పుడు వినిపిస్తున్న టాక్ అంతా కేవలం గాలివాటమే అని చెప్పొచ్చు. ఏదేమైనా వారణాసి మ్యాజిక్ తర్వాత ఈ ఇద్దరూ తమ తదుపరి సినిమాలతో ఎలా అడుగులు వేస్తారో చూడాలి.