మే విరామంలో వారణాసి!
సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా `వారణాసి` చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 18 April 2026 10:47 AM ISTసూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా `వారణాసి` చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. షూటింగ్ మొదలైన నాటి నుంచి రాజమౌళి అండ్ కో నిర్విరామంగా పని చేస్తోంది. మధ్యలో చిన్న చిన్న విరామాలు తప్ప చిత్రీకరణకు లాంగ్ బ్రేక్ ఇంతవరకూ ఇవ్వలేదు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ భారీ సెట్ లో ఓ పాట చిత్రీకరిస్తున్నారు. ఈ పాట కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేసి సెట్‌ను నిర్మించినట్లు తెలుస్తోంది. రాజమౌళి మార్క్ గ్రాండియర్ సాంగ్‌లో కనిపిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ ప్రత్యేక గీతానికి ప్రముఖ కొరియోగ్రాఫర్స్ బాస్కో-మార్టిన్ నేతృత్వం వహిస్తున్నారు.
బాలీవుడ్ - సౌత్ సినిమాల్లో తనదైన శైలిలో స్టెప్పులు సమకూర్చే బాస్కో ఈ పాటను ఎంతో వినూత్నంగా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. నటీనటుల ఎనర్జీ - బాస్కో కొరియోగ్రఫీ పాటను సినిమాకే హైలైట్‌గా మారుస్తుందని టాక్. హైదరాబాద్ షెడ్యూల్ ముగిసిన తర్వాత చిత్ర బృందం మే నెలలో షూటింగ్‌కు లాంగ్ బ్రేక్ ఇవ్వాలని నిర్ణయిం చుకుందని తెలిసింది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం సహా సాంకేతిక నిపుణులకు కొంత విశ్రాంతి అవస రమని భావించిన జక్కన్న సమ్మర్ బ్రేక్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విరామ సమయంలో రాజమౌళి తదుపరి షెడ్యూల్ ప్లానింగ్ , గ్రాఫిక్స్ పనులపై దృష్టి సారించే అవకాశం ఉంది. మే విరామం తర్వాత తిరిగి తదుపరి షెడ్యూల్ జూన్‌లో ప్రారంభం కానుంది.
జూన్ నుండి చిత్ర యూనిట్ మళ్ళీ పూర్తి స్థాయిలో షూటింగ్‌లో నిమగ్నం అవుతుంది. అప్పటికి వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది ఇకాబట్టి కీలకమైన అవుట్‌డోర్ సీన్లను చిత్రీకరించేందుకు దర్శకుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ లాంగ్ షెడ్యూల్‌తో సినిమాలోని ప్రధాన భాగాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలు స్తోంది. పశ్చిమాసియాలో యుద్ద వాతావరణం కూడా తగ్గు ముఖం పట్టడంతో? విదేశాల్లో షూట్ చేయాల్సిన సన్నివేశాలకు సంబంధించి కూడా రాజమౌళి అండ్ కో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.
సినిమాలో విదేశీ షెడ్యూల్స్ అత్యంత కీలకమైనవి. నెలల తరబడి షూట్ చేయాల్సిన సన్నివేశాలు కాబట్టి ప్లానింగ్ కూడా అంతే పక్కాగా ఉండాలి. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక సిద్దం చేయాలి. దీనికి సంబంధించి బ్యాకెండ్ లో మరో టీమ్ పని చేస్తుంది. భారీ బడ్జెట్ - భారీ తారాగణంతో రూపొందుతున్న చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి గత చిత్రాల మాదిరిగానే `వారణాసి` కూడా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
