Begin typing your search above and press return to search.

వార‌ణాసి.. ఎవ‌రే పాత్ర‌లో అంటే?

టాలీవుడ్‌లో భారీ అంచనాల‌తో రూపొందుతున్న మోస్ట్ అవెయిటింగ్ మూవీ వార‌ణాసి. ప్రతిష్ఠాత్మకంగా తెర‌కెక్కుతున్న ఈ మూవీ గురించి అనౌన్స్‌మెంట్ నుంచే ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాలు వినిపిస్తున్నాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   18 Feb 2026 10:00 PM IST
వార‌ణాసి.. ఎవ‌రే పాత్ర‌లో అంటే?
X

టాలీవుడ్‌లో భారీ అంచనాల‌తో రూపొందుతున్న మోస్ట్ అవెయిటింగ్ మూవీ వార‌ణాసి. ప్రతిష్ఠాత్మకంగా తెర‌కెక్కుతున్న ఈ మూవీ గురించి అనౌన్స్‌మెంట్ నుంచే ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాలు వినిపిస్తున్నాయి. సినిమా టైటిల్ ను రివీల్ చేసిన గ్లింప్స్ లో వార‌ణాసి సినిమాకు పురాణాల ట‌చ్ కూడా ఇస్తున్నట్టు క్లారిటీ ఇవ్వ‌డంతో ఈ సినిమాపై ఉన్న అంచ‌నాలు అమాంతం పెరిగాయి.

శ్రీ రాముడి పాత్ర‌లో మ‌హేష్ బాబు

సినిమాలో త్రేతాయుగానికి సంబంధించిన ఓ కీల‌క ఎపిసోడ్ అర‌గంట పాటూ ఉండ‌నుంద‌ట‌. ఈ ఎపిసోడ్ లో మ‌హేష్ బాబు శ్రీరాముడి పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే మేక‌ర్స్ గ్లింప్స్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో మ‌హేష్ క్యారెక్ట‌ర్ చాలా కొత్త‌గా ఉండ‌నుండ‌గా, సినిమా రిలీజ్ త‌ర్వాత మ‌హేష్ కెరీర్ వారణాసికి ముందు, వార‌ణాసికి త‌ర్వాత అనేలా మార‌నుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు.

శివ భ‌క్తునిగా ప్ర‌కాష్ రాజ్

మామూలుగా రాజ‌మౌళి ఏదైనా సినిమా చేసేట‌ప్పుడు ముందే ఎవ‌రు ఏ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారనేది వెల్ల‌డిస్తారు కానీ వార‌ణాసి విష‌యంలో అలాంటివేమీ లేకుండా డైరెక్ట్ గా సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు. దీంతో ఎవ‌రు ఏ పాత్ర‌లో న‌టిస్తున్నార‌నేది ఇన్నాళ్లూ క్లారిటీ రాలేదు. అయితే తాజాగా ఈ సినిమాలో తానొక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ చెప్పారు. తాను రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసిలో న‌టిస్తున్నాన‌ని, ఆ మూవీలో శివ భ‌క్తునిగా క‌నిపించ‌నున్న‌ట్టు క్లారిటీ ఇచ్చారు. మ‌రోవైపు వార‌ణాసిలో ప్ర‌కాష్ రాజ్, మ‌హేష్ బాబుకి తండ్రి పాత్ర‌లో క‌నిపిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.

హ‌నుమంతుడి పాత్ర‌లో టాలెంటెడ్ న‌టుడు

రామాయ‌ణంలో రాముడి త‌ర్వాత ఎంతో ముఖ్య‌మైన పాత్ర ఆంజ‌నేయుడిదే. ఈ పాత్ర‌లో టాలెంటెడ్ యాక్ట‌ర్ ఆర్. మాధ‌వ‌న్ న‌టించ‌నున్నార‌ని అంటున్నారు. మాధ‌వ‌న్ వార‌ణాసి సినిమాలో న‌టిస్తున్నార‌నే విష‌యంపై ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాన‌ప్ప‌టికీ ఈ విష‌యం ఆడియ‌న్స్ లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. వీరితో పాటూ మందాకిని అనే పాత్ర‌లో ప్రియాంక చోప్రా, కుంభ పాత్ర‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ న‌టిస్తున్నారు.

ఏప్రిల్ 7, 2027న వార‌ణాసి రిలీజ్

గ్లోబ‌ల్ ఆడియ‌న్స్ ను టార్గెట్ గా పెట్టుకుని ఈ ప్రాజెక్టుని రూపొందిస్తున్నారు రాజ‌మౌళి. ఈ సినిమాకు కీర‌వాణి సంగీతం అందిస్తుండ‌గా, కె.ఎల్ నారాయ‌ణ‌, కార్తికేయ ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. విజువ‌ల్ ఎఫెక్ట్స్, సెట్ డిజైన్లు, యాక్ష‌న్ సీన్స్ కోసం వార‌ణాసి అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌ను అనుస‌రిస్తున్న‌ట్టు తెలుస్తోంది. 2027, ఏప్రిల్ 7న వార‌ణాసి ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.