Begin typing your search above and press return to search.

'వారణాసి' ఈవెంట్ వెనుక అంత డ్రామా జరిగిందా?

'వారణాసి' వేడుక రోజున ఫంక్షన్ హాల్ బయట ఉన్న టెంట్‌లో పరిస్థితి ఎలా ఉందో వివరించారు. ఊహించని విధంగా సాంకేతిక లోపం ఎదురైనప్పుడు వేదిక వెనుక వాతావరణం యుద్ధరంగాన్ని తలపించిందని తెలిపారు.

By:  Srikanth Kontham   |   27 Sept 2026 4:53 PM IST
వారణాసి ఈవెంట్ వెనుక అంత డ్రామా జరిగిందా?
X

సూపర్‌స్టార్ మహేష్ - రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం `వారణాసి`. ఈ సినిమాకు సంబంధించి టైటిల్ వేడుక జ‌రిగి కొన్ని నెల‌లు గ‌డుస్తోంది. ఆ ఈవెంట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తి తీవ్ర కలకలం సృష్టించాయి. అయితే అంత పెద్ద ఈవెంట్ వెనుక అస‌లెందుకు అలా జ‌రిగింద‌న్న‌ది ఇంత వ‌ర‌కూ స‌రైన క్లారిటీ లేదు. తాజాగా ఈ విష‌యాల‌ను కార్తికేయ రివీల్ చేసాడు. `వారణాసి` వేడుక రోజున ఫంక్షన్ హాల్ బయట ఉన్న టెంట్‌లో పరిస్థితి ఎలా ఉందో వివరించారు. ఊహించని విధంగా సాంకేతిక లోపం ఎదురైనప్పుడు వేదిక వెనుక వాతావరణం యుద్ధరంగాన్ని తలపించిందని తెలిపారు.

ఆ సమయంలో తనకు ఏడుపొచ్చిందని, తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యానన్నారు. ఈ సాంకేతిక తప్పిదం ఎవరి వల్ల జరగలేదని.. ఈవెంట్‌కు ముందు పూర్తిస్థాయిలో పరికరాలను టెస్టింగ్ చేయడానికి సమయం దొరక్కపోవడమే కారణమని కార్తికేయ వెల్లడించారు. రాత్రంతా డ్రోన్లు తిరుగుతుండటం వల్ల ముందస్తుగా చెక్ చేయడం సాధ్యపడలేదన్నారు. అయితే రెండుసార్లు విఫలమైన తర్వాత మూడోసారి టైటిల్ వీడియో విజయవంతంగా స్క్రీన్‌పై ప్లే కాగానే `జెర్సీ` సినిమాలో నాని తరహాలో గట్టిగా అరిచి తన సంతోషాన్ని వ్యక్తపరిచానని కార్తికేయ పేర్కొన్నారు.

ఈ వేడుక సమయంలో కార్తికేయ మాత్రమే కాకుండా చిత్ర యూనిట్‌లోని చాలామంది ఎమోషనల్ అయ్యారని యాంకర్ సుమ గుర్తు చేసుకున్నారు. రాజమౌళి సతీమణి రమ తో పాటు అక్కడ ఉన్న చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారని తెలిపారు. చివరికి మూడో ప్రయత్నంలో వీడియో గ్రాండ్‌గా ప్లే అయినప్పుడు ఏదో ఇస్రో రాకెట్ ప్రయోగం సక్సెస్ అయినంత ఆనందం కలిగిందని ఈ అనుభవాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని సుమ వ్యాఖ్యానించారు.

తెరవెనుక నెలకొన్న ఈ ఉద్రిక్తత ప్రభావం వేదికపై ఉన్నవారిలోనూ స్పష్టంగా కనిపించింది. రాజమౌళి మైక్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు గొంతు కాస్త తడబడటం, భావోద్వేగానికి గురికావడం గమనించవచ్చని కార్తికేయ గుర్తు చేసుకున్నారు. అలాగే ఈవెంట్ ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తవ్వాలని మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్ ఎంతో భక్తిశ్రద్ధలతో దేవుడిని ప్రార్థిస్తూ కనిపించారని వివరించారు.

ఇక `వారణాసి` అప్ డేట్ చూస్తే? ప్ర‌స్తుతం షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. ఇప్ప‌టికే మ‌హేష్ పోర్ష‌న్ షూటింగ్ం పూర్త‌యింది. దీంతో ఆయ‌న కుటుంబంతో వెకేష‌న్ కు వెళ్లిపోయారు. ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి మాత్రం పెండింగ్ షూటింగ్ పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. ఆ భాగం కూడా మ‌రో నెల రెండు నెల‌ల్లో పూర్త‌వుతుంద‌ని స‌మాచారం. అనం త‌రం టీమ్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌పై దృష్టి పెడుతుంది. అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్ కావ‌డంతో? టెక్నిక‌ల్ గా సినిమా హైలైట్ అవుతుంది.