జపాన్ లో మన స్టార్స్ కి హార్డ్ కోర్ ఫ్యాన్స్.. ఎందుకింత క్రేజ్?
గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు జపాన్, మలేషియా వంటి దేశాల్లో భారీ డిమాండ్ ఉండేది. అయితే మలేషియాలో తమిళ జనాభా ఎక్కువ ఉండటం వల్ల అది సాధ్యపడింది. కానీ జపాన్ పరిస్థితి వేరు.
By: M Prashanth | 20 Dec 2025 11:15 PM ISTఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్టార్స్ కు జపాన్ సెకండ్ హోమ్ లా మారిపోయింది. మన హీరోలు సినిమా ప్రమోషన్ల కోసం అక్కడికి వెళ్లడమే కాదు, అక్కడి నుంచి అభిమానులు మన హీరోలను చూడటానికి ఇండియాకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొన్నటికి మొన్న రామ్ చరణ్ కోసం జపాన్ లేడీ ఫ్యాన్స్ హైదరాబాద్ వచ్చి సందడి చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు కేవలం బాలీవుడ్ సినిమాలకే పరిమితమైన ఓవర్సీస్ క్రేజ్, ఇప్పుడు టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలతో జపాన్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు జపాన్, మలేషియా వంటి దేశాల్లో భారీ డిమాండ్ ఉండేది. అయితే మలేషియాలో తమిళ జనాభా ఎక్కువ ఉండటం వల్ల అది సాధ్యపడింది. కానీ జపాన్ పరిస్థితి వేరు. అక్కడ పూర్తిగా జపనీస్ ప్రజలే ఉంటారు. భాష, సంస్కృతి వేరైనా మన తెలుగు హీరోల మేనరిజమ్స్ ను, ఎమోషన్స్ ను వారు విపరీతంగా ప్రేమించడం నిజంగా విశేషం. మన మాస్ ఎలిమెంట్స్ అక్కడి ప్రేక్షకులకు కొత్త కిక్ ఇస్తున్నాయి.
ఈ క్రేజ్ వెనుక ఉన్న ప్రధాన కారణం మాత్రం దర్శకధీరుడు రాజమౌళి అనే చెప్పాలి. బాహుబలి సిరీస్ తో జపాన్ బాక్సాఫీస్ తలుపులు బద్దలు కొట్టిన జక్కన్న, అక్కడి ప్రేక్షకులకు మన సినిమా రుచి చూపించారు. రీసెంట్ గా 'బాహుబలి: ఎపిక్' పేరుతో రెండు భాగాలను కలిపి రిలీజ్ చేసినప్పుడు, ప్రమోషన్ కోసం ప్రభాస్ స్వయంగా జపాన్ వెళ్లారు. అక్కడ రెబల్ స్టార్ కు లభించిన స్వాగతం చూస్తే టాలీవుడ్ రేంజ్ ఏంటో అర్థమవుతుంది. 'ఈగ' సినిమా లేట్ గా రిలీజ్ అయినా సరే, అది కూడా అక్కడ మంచి విజయం సాధించింది.
ఇక 'RRR' సినిమాతో ఈ మేనియా పీక్స్ కు వెళ్లింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు అక్కడ ఇప్పుడు హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్ ఉంది. నాటు నాటు స్టెప్పులు, వారి ఎమోషనల్ బాండింగ్ జపనీస్ ఆడియెన్స్ ను కట్టిపడేసింది. ఈ ఇంపాక్ట్ ఎంతలా ఉందంటే, ఎన్టీఆర్ నటించిన 'దేవర', 'వార్ 2' సినిమాలు కూడా అక్కడ మంచి కలెక్షన్స్ రాబట్టి, జనాలను ఎట్రాక్ట్ చేశాయి. కేవలం వీరిద్దరే కాకుండా, 'పుష్ప' సిరీస్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా జపాన్ లో తనదైన ముద్ర వేశారు. బన్నీ స్వాగ్ కు అక్కడి యూత్ ఫిదా అయిపోయారు.
రాజమౌళి వేసిన బాటలో ఇప్పుడు మన స్టార్స్ అందరూ నడుస్తున్నారు. ఆయన తీసిన గ్రాండ్ స్కేల్ సినిమాల వల్లే ఈరోజు మన హీరోలకు అక్కడ మార్కెట్ ఓపెన్ అయ్యింది. జపాన్ ప్రేక్షకులు కేవలం యాక్షన్ మాత్రమే కాదు, మన సినిమాల్లోని డ్రామాను కూడా ఎంజాయ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో అక్కడ మన సినిమాల రిలీజ్ ఇంకా గ్రాండ్ గా ఉండబోతోంది.
ముఖ్యంగా రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న గ్లోబల్ అడ్వెంచర్ 'వారణాసి' సినిమా కోసం జపాన్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో ఉండబోయే ఈ సినిమాతో జపాన్ లో టాలీవుడ్ మార్కెట్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లడం ఖాయం. మొత్తానికి మనోళ్లు లోకల్ బాక్సాఫీస్ నే కాదు, గ్లోబల్ ఆడియెన్స్ ను కూడా తమ అదుపులోకి తెచ్చుకుంటున్నారు.
