వారణాసి కోసం రాజమౌళి అవతార్ స్కెచ్..?
మహేష్ రాజమౌళి ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న వారణాసి సినిమా రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ అదిరిపోయింది.
By: Ramesh Boddu | 5 Dec 2025 2:12 PM ISTమహేష్ రాజమౌళి ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న వారణాసి సినిమా రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ అదిరిపోయింది. సినిమా గ్లింప్స్ కోసమే రాజమౌళి ఫ్యాన్స్ కి పాస్ పోర్ట్ లు ఇచ్చి ఒక రేంజ్ లో హంగామా చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో హుశారెత్తేలా చేశారు. ఐతే వారణాసి గ్లింప్స్ చూసిన ఆడియన్స్ సినిమాపై మరింత అంచనాలు ఏర్పరచుకున్నారు. ఐతే జక్కన్న ప్రతి సినిమా ప్లానింగ్ ఒక రేంజ్ లో ఉంటుంది. సినిమా తీయడం కాదు దాన్ని ఎలా ప్రమోట్ చేయాలో కూడా రాజమౌళికి బాగా తెలుసు.
సెన్సేషన్ గా అవతార్ సీరీస్ లు..
ఈ క్రమంలో రాజమౌళి వారణాసి కోసం అవతార్ ని వాడుకోవాలని చూస్తున్నాడు. జేమ్స్ క్యామెరూన్ డైరెక్షన్ లో అవతార్ సీరీస్ లు సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. అవతార్ 3వ ఫ్రాంచైజ్ అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ ఈ నెల 19న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రదర్శనలో వారణాసి గ్లింప్స్ కూడా రిలీజ్ చేసేలా ప్లానింగ్ ఉందట. ఇప్పటికే హాలీవుడ్ మీడియా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ కథనాలు రాస్తుంది.
అవతార్ 3లో వారణాసి గ్లింప్స్ వదులుతున్నారట. దాంతో జేమ్స్ క్యామెరూన్ సినిమాతో పాటు రాజమౌళి వారణాసికి వరల్డ్ వైడ్ గా పబ్లిసిటీ దక్కుతుంది. అవతార్ 3 ప్రదర్శించే ప్రతి స్క్రీన్ లో వారణాసి గ్లింప్స్ వేస్తారా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనా వారణాసికి ఈ రేంజ్ పబ్లిసిటీ అది కూడా టీజర్ కే ఇంత భారీ ప్లానింగ్ ఉందంటే ఇక సినిమాకు రాజమౌళి ఎలాంటి ప్లాన్స్ వేస్తాడన్నది ఊహించడానికే క్రేజీగా ఉంది.
2027 సమ్మర్ రిలీజ్ టార్గెట్ తో
రాజమౌళి అండ్ టీం ఈ సినిమాను అనుకున్న విధంగా పూర్తి చేయాలని చూస్తున్నారు. 2027 సమ్మర్ రిలీజ్ టార్గెట్ తో వారణాసి వస్తుంది. మహేష్ రుద్ర పాత్రలో కనిపిస్తున్న వారణాసి సినిమాలో రాముడిగా కూడా సర్ ప్రైజ్ చేస్తాడని తెలుస్తుంది. వారణాసి సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.
వారణాసి సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన సంచారి సాంగ్ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా.. కుంభా పరిచయంగా రిలీజ్ చేసిన సాంగ్ కూడా అదిరిపోయింది. RRR తో ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని మెప్పించిన రాజమౌళి ఈసారి వారణాసి సినిమాతో హాలీవుడ్ ని షేక్ చేయాలని చూస్తున్నాడు. RRR తో ఒక సాంగ్ కే అకాడమీ అవార్డ్ రాగా ఈసారి వారణాసి కోసం చాలా పెద్ద స్కెచ్ తోనే వెళ్తున్నారని తెలుస్తుంది.
