Begin typing your search above and press return to search.

వారణాసి కథ ఏంటి.. బాహుబలి కట్టప్పని మించి సస్పెన్స్..?

ఇది కదా జక్కన్న అంటే అని అనిపించేలా ప్రతి సినిమాతో సినిమా స్థాయిని పెంచుతూ వచ్చిన ఆయన గ్లోబ్ త్రొట్టర్ అంటూ మహేష్ తో ఒక భారీ సినిమాన్నే తెరకెక్కిస్తున్నారు.

By:  Ramesh Boddu   |   16 Nov 2025 11:18 AM IST
వారణాసి కథ ఏంటి.. బాహుబలి కట్టప్పని మించి సస్పెన్స్..?
X

మహేష్ తో వారణాసి చేస్తున్న రాజమౌళి ఫస్ట్ గ్లింప్స్ తోనే గూస్ బంప్స్ స్టఫ్ ఇచ్చాడు. ఇది కదా జక్కన్న అంటే అని అనిపించేలా ప్రతి సినిమాతో సినిమా స్థాయిని పెంచుతూ వచ్చిన ఆయన గ్లోబ్ త్రొట్టర్ అంటూ మహేష్ తో ఒక భారీ సినిమాన్నే తెరకెక్కిస్తున్నారు. ఐతే ఈ సినిమా కథ ఏంటి.. ఎలా ఉండబోతుంది అనే హింట్ ఇస్తూ ఒక గ్లింప్స్ వదిలారు. ఇక ఈ గ్లింప్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ తో ఎవరికి నచ్చినట్టుగా వాళ్లు కథలు అల్లేసుకుంటున్నారు.

వీల్ చెయిర్ నుంచే విలనిజాన్ని..

ముందుగా రాజమౌళి తన సినిమాలో విలన్ గా చేస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ రిలీజ్ చేశాడు. కుంభ పాత్రలో ఆయన వీల్ చెయిర్ లో ఉన్న లుక్ రిలీజ్ చేశారు. ఐతే దాన్ని చూసి వీల్ చెయిర్ నుంచే అతని విలనిజాన్ని.. క్రూరత్వాన్ని చూపించేస్తారు అన్నట్టుగా ఫిక్స్ అయ్యారు. ఇక ఆ నెక్స్ట్ సినిమా హీరోయిన్ వారణాసి లుక్ రివీల్ చేశారు. ఐతే మందాకిని గా యెల్లో శారీలో ప్రియాంకా చోప్రా సర్ ప్రైజ్ చేసింది.

ఐతే ఇక గ్లింప్స్ లో మహేష్ రుద్ర అంటూ ఎద్దు మీద త్రిశూలంతో దర్శనం ఇచ్చాడు. అంతేకాదు గ్లింప్స్ లో చూపించిన ప్రతి ఫ్రేం అందులో ఉన్న మహేష్ హింట్స్ చూస్తుంటే.. ఇది టైం ట్రావెల్ అంటే కాలాలు సైతం మారే కథగా వస్తుందని అనిపిస్తుంది. అంతేకాదు కుంభ తను తిరిగి మామూలు వాడు అయ్యేందుకు.. అత్యంత శక్తివంతమైన సంజీవిని పొందేందుకు రుద్రని వాడుకుంటాడని తెలుస్తుంది. మందాకిని ద్వారా రుద్రతో సంజీవినిని పొందాలనుకునే ప్లాన్ చేసిన కుంభ అది పొందాక మందాకిని, కుంభ ఒకే జట్టు అని తెలియడంతో మన రుద్ర ఏం చేశాడన్నది వారణాసి కథ అని కొందరు గెస్ చేస్తున్నారు.

వారణాసిలో రాముడిగా మహేష్..

ఇక టీజర్ రిలీజ్ టైం లోనే రాజమౌళి మహేష్ రాముడిగా కనిపిస్తాడని.. రామాయణంలో ముఖ్య ఘట్టమని లీక్ ఇచ్చాడు. సో రామాయణంలో ముఖ్య ఘట్టంగా రావన సం హారం విజువల్స్.. రాముడిగా మహేష్ విశ్వరూపం చూపిస్తాడని మరికొందరు చెబుతున్నారు. వారణాసి జస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయడంతోనే ఎవరి కథ వారు అల్లేసుకుంటున్నారు.

ఐతే ఇదంతా రాజమౌళి ప్రమోషన్స్ లో భాగమే అని తెలుస్తుంది. ఎందుకంటే బాహుబలి టైంలో ఎలా ఐతే రెండో పార్ట్ కోసం కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నది ట్రెండ్ అయ్యిందో తెలిసిందే. ఐతే ఆ టైంలో అందరు ఏదేదో ఊహించేసుకున్నారు.. ఇలానే సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. కానీ వారందరి అంచనాలను తప్పించి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్నది చూపించి సర్ ప్రైజ్ చేశాడు రాజమౌళి.

వారణాసి గురించి చూపించిన విజువల్స్..

ఇప్పుడు వారణాసి గురించి చూపించిన విజువల్స్ తో పాటు చెప్పీ చెప్పకనే చెప్పిన కథతో ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు కథ అల్లేస్తున్నారు. వీరిలో ఎవరి గెస్సింగ్ కరెక్ట్ అవుతుంది అన్నది సినిమా వస్తేనే తెలుస్తుంది. ప్రతి సినిమాకు ఆడియన్స్ లో కథ పరంగా.. కంటెంట్ పరంగా.. విజువల్ పరంగా ఇలా ప్రతి యాస్పెక్ట్ లో ఎంగేజ్ చేసేందుకు రాజమౌళి నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వస్తాడు. అందుకే ఆయన ఓటమి ఎరగని ధీరుడు దర్శక ధీరుడు రాజమౌళి అంటారని ప్రేక్షకులు భావిస్తున్నారు.