వారణాసి కోసం జక్కన్న ప్రతీదీ చాలా ప్లాన్డ్‌గా!
వారణాసిలో మహేష్ కు జోడీగా బాలీవుడ్ స్టార్, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మందాకినిగా కనిపించనుండగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో విలన్ గా నటించనున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 25 Nov 2025 2:08 PM ISTదర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సినిమా వారణాసి. ఎస్ఎస్ఎంబీ29 గా వస్తోన్న ఈ సినిమాపై ముందు నుంచే భారీ అంచనాలుండగా, జక్కన్న వారణాసిని పాన్ వరల్డ్ లెవెల్ లో రూపొందిస్తున్నారు. రీసెంట్ గా ఓ భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేసి అందులో చిత్ర టైటిల్ తో పాటూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి సినిమాపై విపరీతమైన హైప్ ను క్రియేట్ చేశారు మేకర్స్.
హనుమంతుడి పాత్ర కోసం స్టార్ హీరో
వారణాసిలో మహేష్ కు జోడీగా బాలీవుడ్ స్టార్, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మందాకినిగా కనిపించనుండగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో విలన్ గా నటించనున్నారు. అయితే జక్కన్న మొదటి నుంచి తన సినిమాల్లో కీలక పాత్రలన్నింటికీ స్టార్లనే తీసుకుంటారనే విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ మూవీలో హనుమంతుడి పాత్రలో ఓ స్టార్ హీరో కనిపించనున్నారని వార్తలొస్తున్నాయి.
2027 సమ్మర్ లో వారణాసి రిలీజ్
అయితే రాజమౌళి ఈ సినిమా షూటింగ్ ను తన గత సినిమాల్లాగా కాకుండా ఎంతో వేగంగా పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది. షూటింగ్ ను చాలా త్వరగా పూర్తి చేస్తున్నారు కాబట్టే సినిమాను 2027 సమ్మర్ కు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే పలు షెడ్యూళ్ల షూటింగ్ ను పూర్తి చేసుకున్న వారణాసి షూటింగ్ పై ఇప్పుడో క్రేజీ అప్డేట్ తెలుస్తోంది.
వారణాసి షూటింగ్ శరవేగంగా జరుగుతుందని, ప్రస్తుతం సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి సీన్స్ ను మేకర్స్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ చైల్డ్‌హుడ్ సీన్స్ సినిమాలో చాలా కీలకంగా ఉండనున్నాయని, నిమిషం కనిపించే సీన్ ను అయినా ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించే రాజమౌళి, ఈ సీన్స్ ను మరింత పకడ్బందీగా తెరకెక్కిస్తున్నారని యూనిట్ సభ్యులంటున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను కె.ఎల్ నారాయణ, ఎస్.ఎస్ కార్తికేయ నిర్మిస్తుండగా, ఆస్కార్ విజేత ఎం.ఎం కీరవాణి వారణాసికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
