Begin typing your search above and press return to search.

వారణాసి.. ప్రకాష్ రాజ్ ఇలాంటి మాట అన్నాడంటే..

ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఇందులో మహేష్ బాబు పోషిస్తున్న 'రుద్ర' పాత్రకు తండ్రిగా ప్రకాష్ రాజ్ కనిపించబోతున్నారట.

By:  M Prashanth   |   23 Dec 2025 11:42 PM IST
వారణాసి.. ప్రకాష్ రాజ్ ఇలాంటి మాట అన్నాడంటే..
X

సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' పై పైప్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే రిలీజైన టైటిల్ గ్లింప్స్, పోస్టర్స్ తో ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటనేది ఆడియెన్స్ కు ఒక క్లారిటీ వచ్చేసింది. రామాయణ ఇతిహాసాల స్ఫూర్తితో, టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో 2027లో రాబోతున్న ఈ విజువల్ వండర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే లేటెస్ట్ గా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు దారితీసింది.

ప్రకాష్ రాజ్ తన ట్వీట్ లో "వారణాసి సినిమా షూటింగ్ లో ఒక అద్భుతమైన షెడ్యూల్ పూర్తి చేశాను. నాలోని ఆకలితో ఉన్న నటుడికి ఇదొక సంతోషం అని పేర్కొన్నారు. సాధారణంగా ఎన్నో వందల సినిమాలు, వైవిధ్యమైన పాత్రలు చేసిన ప్రకాష్ రాజ్ లాంటి లెజెండరీ యాక్టర్.. ఇలాంటి మాట అన్నాడంటే, రాజమౌళి ఆయన కోసం రాసిన పాత్ర ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో కనిపించే రొటీన్ పాత్ర కాదని ఆయన మాటలే స్పష్టం చేస్తున్నాయి.

ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఇందులో మహేష్ బాబు పోషిస్తున్న 'రుద్ర' పాత్రకు తండ్రిగా ప్రకాష్ రాజ్ కనిపించబోతున్నారట. రుద్ర పాత్ర వరల్డ్ అడ్వెంచరస్ గా మొదలై శ్రీరాముడి కాలంలోకి వెళుతుందని ఇప్పటికే హింట్ ఇచ్చారు. మరి రాముడి లాంటి పాత్రకు తండ్రి అంటే.. ఆ క్యారెక్టర్ లో దశరథుడి తరహా ఎమోషన్స్, గాంభీర్యం కచ్చితంగా ఉండాలి. బహుశా ఆ ఎమోషనల్ డెప్త్ ఉండటం వల్లే ప్రకాష్ రాజ్ లాంటి నటుడు ఇంతలా సంతృప్తి చెంది ఉంటారని అనిపిస్తుంది.

మరోవైపు రాజమౌళి ప్రకాష్ రాజ్ కాంబినేషన్ దాదాపు దశాబ్దన్నర తర్వాత సెట్ అయ్యింది. 'విక్రమార్కుడు' తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేయలేదు. ఇన్నాళ్లకు వారణాసి కోసం జక్కన్న ఆయన్ని ఎంచుకున్నారంటే.. ఆ పాత్రను ప్రకాష్ రాజ్ మాత్రమే చేయగలరని డిసైడ్ అయ్యే తీసుకుని ఉంటారు. ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభగా భారీ తారాగణం ఉన్నా, ప్రకాష్ రాజ్ పాత్ర సినిమాకు ఎమోషనల్ పిల్లర్ గా నిలుస్తుందని ఆయన ట్వీట్ చూస్తుంటే అర్థమవుతోంది.

'వారణాసి' ఒక యాక్షన్ అడ్వెంచర్ మాత్రమే కాదు, డిఫరెంట్ టైమ్స్ లో సాగే కథ. ఇలాంటి కాంప్లెక్స్ నేరేషన్ లో నటులకు సవాలు విసిరే సన్నివేశాలు చాలానే ఉంటాయి. రాజమౌళి తన నటుల నుంచి వంద శాతం అవుట్ పుట్ రాబట్టుకునే వరకు వదలరు. ఆ ప్రాసెస్ ని, ఆ ఛాలెంజ్ ని ప్రకాష్ రాజ్ బాగా ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తోంది.

అందుకే "ఎగ్జైటింగ్ గా ఉంది, నెక్స్ట్ షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నా" అని ట్వీట్ లో పేర్కొన్నట్లు అర్ధమవుతుంది. మహేష్ బాబుతో ఇప్పటికే ఒక్కడు, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాల్లో మ్యాజిక్ క్రియేట్ చేసిన ప్రకాష్ రాజ్.. ఈసారి గ్లోబల్ స్థాయిలో ఆ మ్యాజిక్ రిపీట్ చేయడానికి రెడీ అయ్యారు. ఇక వారణాసి సినిమా 2027 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.