సరస్వతి కోసం వరలక్ష్మి కొత్త అవతారం..!
సరస్వతి టైటిల్ పోస్టర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు మేకర్స్. సరస్వతిలో ఐ అనే లెటర్ రెడ్ కలర్ గా చూపించారు. అంటే సినిమా థ్రిల్లర్ గా రాబోతుందని అర్ధమవుతుంది.
By: Ramesh Boddu | 27 Sept 2025 6:48 PM ISTవరలక్ష్మి శరత్ కుమార్ ఎలాంటి పాత్రనైనా చేస్తూ ఆడియన్స్ ని మెప్పిస్తూ వస్తున్నారు ఆమె. ఆల్రెడీ అంతకుముందు తమిళ్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఈమధ్య విలన్ గా కూడా మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. తెలుగులో కూడా క్రాక్, వీర సింహా రెడ్డి లాంటి సినిమాల్లో మెప్పించారు. హనుమాన్ లో కూడా ఒక మంచి రోల్ లో అదరగొట్టారు వరలక్ష్మి శరత్ కుమార్. ఐతే ఇప్పుడు ఆమె కెరీర్ లో కొత్త టర్న్ తీసుకున్నారు.
వరలక్ష్మి శరత్ కుమార్ డైరెక్షన్ లో..
యాక్టర్ గానే కాదు డైరెక్టర్ గా కూడా తన సత్తా చాటుతా అంటున్నారు వరలక్ష్మి శరత్ కుమార్. వరలక్ష్మి శరత్ కుమార్ తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోశ డైరీస్ అనే కొత్త ప్రొడక్షన్ ని మొదలు పెట్టారు. ఆ బ్యానర్ లోనే వరలక్ష్మి శరత్ కుమార్ డైరెక్షన్ లో ఈ సరస్వతి సినిమా వస్తుంది.
సరస్వతి టైటిల్ పోస్టర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు మేకర్స్. సరస్వతిలో ఐ అనే లెటర్ రెడ్ కలర్ గా చూపించారు. అంటే సినిమా థ్రిల్లర్ గా రాబోతుందని అర్ధమవుతుంది. అలాంటి సినిమాల్లో నటించి ఇప్పుడు అలాంటి ఒక థ్రిల్లింగ్ సినిమానే డైరెక్ట్ చేస్తుంది వరలక్ష్మి శరత్ కుమార్.
ఈమధ్య ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ కన్నా సీట్ ఎడ్ న కూర్చోబెట్టి థ్రిల్ చేసే సినిమాలే నచ్చుతున్నాయి. అలాంటి సినిమాలకు బడ్జెట్ కూడా మరీ అంత ఎక్కువ అవ్వదు. వరలక్ష్మి అందుకే తన మొదటి డైరెక్టోరియల్ ప్రాజెక్ట్ గా ఆ జోనర్ ఎంచుకుంది. టైటిల్ పోస్టర్ లో మిగతా డీటైల్స్ అయితే ఏమి ఇవ్వలేదు.
నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, ప్రియమణి..
ఈ సినిమాలో నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, ప్రియమణి ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు. మరి వరలక్ష్మి డైరెక్ట్ చేస్తున్న ఈ సరస్వతి ఎలా ఉంటుందో చూడాలి. సినీ పరిశ్రమలో లేడీ డైరెక్టర్స్ చాలా తక్కువ. ఉన్న వాళ్లు కూడా స్టార్ రేంజ్ కి వెళ్లిన వాళ్లు చాలా తక్కువ. మరి మెగా ఫోన్ పడుతున్న వరలక్ష్మి డైరెక్టర్ గా తన మార్క్ చూపిస్తుందేమో చూడాలి.
ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే సినిమాలతో పాటు అప్పుడప్పుడు ఇలా థ్రిల్ చేసే సినిమాలు కూడా సూపర్ ఎంటర్టైన్ చేస్తాయి. సినిమాల్లో నటిస్తూ డైరెక్టర్ గా మారడం అన్నది పెద్ద ఛాలెంజ్. వరలక్ష్మి ఏకంగా డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ గా కొత్త స్టెప్ తీసుకుంది. వరలక్ష్మి కమిట్మెంట్ యాక్టర్ గా చూసేశాం మరి డైరెక్టర్ గా ఎలా ఉండబోతుందో చూడాలి.
