Begin typing your search above and press return to search.

'సర‌స్వ‌తి' స్టోరీ వివాదంపై వ‌ర‌ల‌క్ష్మీ కౌంట‌ర్‌!

దీంతో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ న‌టించి, స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన 'స‌ర‌స్వ‌తి' టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది.

By:  Ravindar Gorantla   |   7 March 2026 1:32 PM IST
సర‌స్వ‌తి స్టోరీ వివాదంపై వ‌ర‌ల‌క్ష్మీ కౌంట‌ర్‌!
X

త‌మిళంలో ప‌వ‌ర్ ఫుల్ క్యారెక్ట‌ర్లతో హీరోయిన్‌గా, న‌టిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త‌క్ కుమార్‌. తొలి సారి ఆమె మెగా ఫోన్ ప‌ట్టి, నిర్మాత‌గా మారి రూపొందించిన మూవీ `సర‌స్వ‌తి`. రీసెంట్‌గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ మూవీ ప్రేక్ష‌కుల్ని ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక యావ‌రేజ్ మూవీ అనిపించుకుంది. ఈ చిత్రానికి టాలీవుడ్ స్టార్ రైట‌ర్ సాయి మాధ‌వ్ బుర్రా క‌థ అందించారు. అయితే ప్ర‌మోష‌న్స్‌లో ఆయ‌న పేరు ఎక్క‌డా వాడ‌లేద‌ని, త‌న క‌థ‌ని `రే*ప్` చేశార‌ని, త‌ను ఇచ్చిన క‌థ‌తో సినిమా ప్రారంభించి చివ‌ర్లో కొత్త క‌థ‌ని యాడ్ చేసి ఖూనీ చేశార‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న ఫైర్ అయ్యారు.

దీంతో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ న‌టించి, స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన `స‌ర‌స్వ‌తి` టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం శ‌నివారం స‌క్సెస్ మీట్ ని నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా సాయి మాధ‌వ్ బుర్రా చేసిన ఆరోప‌ణ‌ల‌పై వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ స్పందించింది. సాయి మాధ‌వ్ బుర్ర నా స్టోరీని రేప్ చేశారంటూ కామెంట్ చేశారు. అస‌లు ఆయ‌న అంత‌గా రియాక్ట్ కావ‌డం వెనుక ఏం జ‌రింది? అని అడిగితే వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ఆస‌క్తిక‌రంగా స్పందించింది. సాయిగారి మీద నాకు చాలా మర్యాద‌, గౌర‌వం ఉన్నాయి అన్నారు.

ఆయ‌నొక సీనియ‌ర్ రైట‌ర్‌. త‌నంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. అయితే ప్ర‌పంచంలో ఓ క‌థ‌ని అలాగే చెబితే ప్రేక్ష‌కులు యాక్సెప్ట్ చేయ‌రు. వాళ్ల‌కు న‌చ్చ‌దు. అది నిజం. సో నేను ఎవ‌రి క‌థ‌ని దొంగిలించ‌లేదు.. కాంట్రాక్ట్ చేసుకున్నాం. డ‌బ్బులిచ్చాం. అన్నీ ఇచ్చిన త‌రువాత ఆ క‌థ నాదైంది. ఆ క‌థ సాయి మాధ‌వ్ బుర్రగారి వద్ద గ‌త ఆరేళ్లుగా ఉంది. అంత బాగుంటే ఆయ‌నే ఎందుకు చేయ‌లేదు. అంటే అందులో ఏదో ల్యాగ్ ఉంది. నేను క‌థ చెప్పిన ప్ర‌తీ చోట నాకొచ్చిన ఫీడ్ బ్యాక్ ఏంటంటే సెకండ్ హాఫ్ బాగాలేదు. ఓకే జ‌న‌ర‌ల్‌గా రైట‌ర్స్ మీతో పాటు కూర్చుని వ‌ర్క్ చేయాల‌ని చెబుతారు.

అయితే ఆయ‌న చాలా బిజీ..ఆయ‌న ఇప్పుడు అన్నీ పెద్ద సినిమాల‌కు వెళ్లిపోయారు. న‌న్నొచ్చి క‌ల‌వ‌ను కూడా లేదు. మొత్తం క‌థ‌ని ఓ ఆడియో నోట్‌లో పంపించారు. సో ఆడియో నోట్ లోంచి నేను ఎంత తీసుకోవాలి. నేను దానిపై వ‌ర్క్ చేశాను. నేను ఇచ్చిన ప్ర‌తి ఇంట‌ర్వ్యూలోనూ నేను ఏం చెప్పానంటే ఆ క‌థ లైన్ నేను తీసుకున్నాను. స్క్రిన్‌ప్లేని నేను మార్చుకుని మ‌ళ్లీ చేశాను. ఎందుకంటే నేటి త‌రంలో జ‌నాలు సినిమా ఎలా చూడాలి అని ఫీలవ్వాలి. నేను ఏం చేశానంటే సాయి మాధ‌వ్ బుర్రాగారిపై ఉన్న మ‌ర్యాద వ‌ల్ల స్టోరీ అని ఆయ‌న పేరే వేశాను.

కావాలంటే నా పేరు రాసుకోవ‌చ్చు. నా పేరు రాయ‌కుండా ఆయ‌న పేరుని ఆయ‌న‌పై ఉన్న మ‌ర్యాద‌తో మాత్ర‌మే ఆయ‌న పేరు వేశాను. ఇప్పుడు కామెడీ ఏంటంటే క‌థ ఆయ‌న‌ది చాలా బాగుంద‌ని ట్యాగ్ చేస్తున్నారు. అది ఆయ‌న‌కు ద‌క్కిన గౌర‌వ‌మా? నాకు ద‌క్కిన గౌర‌వ‌మా? మీరే చెప్పాలి.. అదే నా లాజిక్‌` అన్నారు. అయితే ఆయ‌న స్టోరీ తీసుకున్న‌ప్పుడు ఆయ‌న‌కు చెప్ప‌కుండా మార్చ‌కూడ‌దు కాదా? అని అడిగితే .. ఆయ‌న ఫోన్‌లో దొరికితే కాదా అని ఎదురు ప్ర‌శ్నించారు వ‌ర‌ల‌క్ష్మీ. మ‌రి ఆయ‌న క‌థ లేదు అన్న‌ప్పుడు ఇది వేరే అవుతుంది కాదా? అని మీడియా అడిగితే.. ఆయ‌న‌పై ఉన్న గౌరవంతో స్టోరీ సాయి మాధ‌వ్ బుర్రా అని వేశాన‌ని తెలిపింది.

అంతే కాకుండా నేను క‌థ చెప్పిన ప్ర‌తీ ఒక్క‌రూ సెకండ్ హాఫ్ చాలా ల్యాగ్ ఉంద‌ని, పెద్ద స్టార్‌ని పెట్టుకుని ఇలాంటి క‌థ‌తో సినిమా చేస్తే ఫ‌ర‌వాలేదు. మేమంతా గుడ్ యాక్ట‌ర్స్‌..నాట్ స్టార్స్‌. కాబ‌ట్టి అలాంటి క‌థ‌ని మేం జ‌నాల మ‌ధ్య‌కు ఎలా తీసుకువెళ్లాలి? అనే దానిమీద మేం వ‌ర్క్ చేశాం. చాలా వ‌ర్క్ చేశాం. ఆ స‌మ‌యంలో ఎప్పుడూ ఆయ‌న రానేలేదు. కార‌ణం నాకు పెద్ద సినిమాలు ఉన్నాయ‌న్నారు. ఓకేసారి మీరు బిజీగా ఉన్నారు నేను చూసుకుంటాను అని ఒప్పుకున్నాను. అలా నేను సెన్సిటీవ్ ఇష్యూమీద సినిమా తీస్తే క‌థ‌ని `రేప్‌` చేశారంటూ కామెంట్ చేయ‌డం ఏమీ బాగాలేదు. చాలా ఇన్‌సెన్సిటీవ్‌గా ఉంది.

ఆయ‌న ప్ర‌వ‌ర్తించిన తీరు ఎక్స్‌ట్రీమ్‌లీ రూడ్‌..ఎలాంటి ప‌దాన్ని ఆయ‌న వాడేడో ఆయ‌న‌కు తెలియ‌డం లేదు. ఎలాంటి టాపిక్‌ని ఎత్తుకుని సినిమా చేశామో అలాంటి దాని గురించి అలాంటి వ‌ర్డ్ మాట్లాడ‌టం క‌రెక్ట్‌గా లేదు. నాకు కావాలంటే చాలా క‌థ‌ల‌ని తీసేదాన్ని..చెప్పేదాన్ని..కానీ నేను అలాంటి మ‌నిషిని కాదు. నేను ప్ర‌తి ఒక్క‌రికీ గౌర‌విస్తున్నాను. మ‌ర్యాద ఇస్తున్నాను. నేను దీనికి మించి దిగ‌జార‌ద‌ల్చుకోలేదు. నేను ఇంత పెద్ద నిర్ణ‌యం తీసుకున్నానంటే దాని వెనుక ఎంత పెద్ద విష‌యం న‌డిచి ఉంటుంది?. అదంతా న‌డిచిన త‌రువాతే ఇదంతా వ‌చ్చింది. నేను మాత్రం అంత త‌క్కువ స్థాయిలో మాట్లాడే వ్య‌క్తిని కాదు` అంటే అస‌లు విషయం బ‌య‌ట‌పెట్టారు. వ‌ర‌ల‌క్ష్మీ వెర్ష‌న్ చూస్తుంటే సాయి మాధ‌వ్ బుర్రా సైడ్ వేళ్లు చూపిస్తున్నాయి. మరి ఈ స్టేట్‌మెంట్‌పై ఆయ‌న ఏం వెర్ష‌న్ వినిపిస్తారో.. ఎలాంటి స‌మాధానం చెబుతారో చూడాలి.