Begin typing your search above and press return to search.

మధరాసి వరధల్లే సాంగ్.. మరోసారి అనిరుధ్ - శివకార్తికేయన్ మ్యాజిక్

టాలీవుడ్ ఆడియన్స్‌లో సౌత్ సినిమాలపై క్రేజ్ పెరిగిపోతున్న ఈ సమయంలో, హీరో శివకార్తికేయన్ కొత్తగా చేస్తున్న మధరాసి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

By:  M Prashanth   |   24 Aug 2025 12:05 PM IST
మధరాసి వరధల్లే సాంగ్.. మరోసారి అనిరుధ్ - శివకార్తికేయన్ మ్యాజిక్
X

టాలీవుడ్ ఆడియన్స్‌లో సౌత్ సినిమాలపై క్రేజ్ పెరిగిపోతున్న ఈ సమయంలో, హీరో శివకార్తికేయన్ కొత్తగా చేస్తున్న మధరాసి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీకి మొదటి నుంచే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. యాక్షన్, ఎమోషన్ కలబోతగా ఉండబోతుందన్న టాక్ వచ్చింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ఫస్ట్ సాంగ్ సినిమాపై హైప్ ని పెంచాయి.

ఇప్పుడు ఆ క్రేజ్‌ని మరింత పెంచుతూ వరధల్లే అనే రెండో సింగిల్ ని రిలీజ్ చేశారు. ఈ పాటను అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేయగా, లేటెస్ట్ యూత్ టేస్ట్‌కి తగ్గట్టు కంప్లీట్ ట్రెండీగా తీశారు. అనిరుధ్ శివకార్తికేయన్ కాంబినేషన్ ఎప్పుడూ మ్యాజికల్ హిట్స్ ఇచ్చింది. ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ రిపీట్ అయింది.

సాంగ్ స్పెషల్‌గా ఉండటానికి కారణం వీడియోలో అనిరుధ్ స్వయంగా కనిపించడం. శివకార్తికేయన్‌తో కలిసి చేసిన డాన్స్ స్టెప్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇద్దరి ఎనర్జీ ఫుల్ స్క్రీన్ పై కనిపిస్తూ, యూత్ కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. శివకార్తికేయన్ తన స్టైలిష్ లుక్స్, స్వాగ్‌తో ఫ్రెష్ వైబ్ తీసుకొచ్చాడు. ఈ పాట ద్వారా సినిమా యూత్ ఆడియన్స్ లో మరింత బజ్ తెచ్చుకుంది.

మధరాసి సినిమాకి హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. విలన్ పాత్రలో యాక్షన్ స్టార్ విద్యుత్ జామ్వాల్ కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ఎన్. శ్రీలక్ష్మి ప్రసాద్ నిర్మిస్తున్నారు. మాస్, క్లాస్ కలిపిన యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఉండబోతుందన్న టాక్ తో అంచనాలు రెట్టింపయ్యాయి.

మురుగదాస్ కెరీర్ లో ఈ మూవీ చాలా కీలకమని చెప్పాలి. గతంలో బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెస్ ఇవ్వకపోయినా, ఇప్పుడు మళ్లీ కమర్షియల్ బ్లాక్ బస్టర్ కొట్టాలన్న దృష్టితో మధరాసిని ప్లాన్ చేశారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రతి అప్‌డేట్‌కి సూపర్ రెస్పాన్స్ రావడం కూడా అదే చెప్పేస్తోంది. సెప్టెంబర్ 5న ఈ మూవీ తెలుగు సహా ఐదు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.