Begin typing your search above and press return to search.

సందీప్ లైన్ లో సూపర్ స్టార్, మెగాస్టార్..?

యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ తో సినిమా అంటే చాలు అది నెక్స్ట్ లెవెల్ అనే రేంజ్ కి వెళ్లాడు.

By:  Ramesh Boddu   |   31 July 2025 9:14 AM IST
Vanga’s Vision: Next Level Filmmaking
X

యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ తో సినిమా అంటే చాలు అది నెక్స్ట్ లెవెల్ అనే రేంజ్ కి వెళ్లాడు. జస్ట్ మూడంటే మూడు సినిమాలతో తన డైరెక్షన్ రేంజ్ ఇది అని సెట్ చేసుకున్నాడు సందీప్ వంగ. అప్పుడు ఆర్జీవి వచ్చినప్పుడు ఎలా అయితే ఇండస్ట్రీలో సెన్సేషన్ అనిపించిందో ఇప్పుడు సందీప్ సినిమాల గురించి అతని డైరెక్షన్ గురించి అలా మాట్లాడుతున్నారు. అర్జున్ రెడ్డి టు యానిమల్ డైరెక్షన్ పీక్స్ అనిపించేలా చేశాడు.

ప్రభాస్ తో స్పిరిట్ కు రెడీ..

ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ కు రెడీ అవుతున్నాడు సందీప్ వంగ. సెప్టెంబర్ లో స్పిరిట్ సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత సందీప్ వంగ లిస్ట్ లో చాలామంది హీరోలు ఉన్నారు. అసలైతే అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ అల్లు అర్జున్ ప్లేస్ లో చరణ్ వచ్చాడని టాక్. ఇక విజయ్ దేవరకొండతో కూడా సందీప్ వంగ ఒక సినిమా చేస్తాడని తెలుస్తుంది.

ఐతే సందీప్ సినిమాటిక్ స్టైల్ కి బడా స్టార్స్ కూడా ఇంప్రెస్ అవుతున్నారు. యానిమల్ సినిమా ఈవెంట్ లోనే సూపర్ స్టార్ మహేష్ సందీప్ వంగ గురించి గొప్పగా చెప్పాడు. నెక్స్ట్ మహేష్ డైరెక్టర్స్ లిస్ట్ లో సందీప్ వంగ కచ్చితంగా ఉన్నాడని అనిపిస్తుంది. మహేష్, సందీప్ కాంబో సినిమా ఉంటుందని హడావిడి చేశారు. షుగర్ ఫ్యాక్టరీ టైటిల్ కూడా అప్పట్లో వినిపించింది. ఐతే లేట్ అయినా కూడా ఈ కాంబో అయితే కచ్చితంగా సెట్ అయ్యి తీరుతుందని అనిపిస్తుంది.

చిరంజీవికి హార్డ్ కోర్ ఫ్యాన్..

ఇక సందీప్ వంగ మెగాస్టార్ చిరంజీవికి హార్డ్ కోర్ ఫ్యాన్. చిరంజీవి సినిమాలు చూసే అతనికి ఈ ప్యాషన్ వచ్చిందని తెలుస్తుంది. చిరు సినిమా ఫోటోని ఆయన ఆఫీస్ లో పెట్టుకున్నారు. ఐతే మెగాస్టార్ చిరంజీవి క్యాలిబర్ తెలిసేలా సందీప్ వంగ ఒక సినిమా చేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. సో సందీప్ వంగ మంచి కథతో వస్తే చిరంజీవి కూడా కాదనే ఛాన్స్ లేదు.

సో సందీప్ వంగ హీరోల లిస్ట్ లో సూపర్ స్టార్, మెగాస్టార్ లు ఉన్నారు.. తప్పకుండా ఈ కాంబినేషన్స్ కుదిరితే మాత్రం ఇక బాక్సాఫీస్ షేక్ కాదు షివరింగ్ లే అవుతాయని చెప్పొచ్చు. సందీప్ వంగ స్పిరిట్ తర్వాత నెక్స్ట్ ఏ సినిమా చేస్తాడు.. ఎవరితో చేస్తాడన్నది కూడా క్లారిటీ రావాల్సి ఉంది.