దశాబ్దం తర్వాత సంచలన కాంబినేషన్!
దశాబ్దం క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన తమిళ అనువాద చిత్రం `బిచ్చగాడు` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.
By: Srikanth Kontham | 22 March 2026 10:00 PM ISTదశాబ్దం క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన తమిళ అనువాద చిత్రం `బిచ్చగాడు` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. కొడుకు-తల్లి కాన్సెప్ట్ కు తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఎంతో ఎఓషనల్ గా కనెక్ట్ అయిన చిత్రమిది. విజయ్ ఆంటోనీ నటన..శశి మేకింగ్ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయి. ఇలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇద్దరు మళ్లీ కలిసి పని చేసింది లేదు. ఈ కాంబినేషన్ లో మరో సినిమా కావాలని అభిమానులు ఎంతో కాలంగా అడుగుతున్నా? ఇద్దరు సైలెంట్ గానే ఉన్నారు. తాజాగా ఆ కోరిక దశాబ్ద కాలానికి తీరబోతుంది. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే..
`బిచ్చగాడు` తర్వాత విజయ్ ఆంటోనీ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా రకరకాల ప్రయోగాలు చేశారు. `కిల్లర్`, `కొలై`, `బిచ్చగాడు 2` వంటి చిత్రాలతో పలకరించినప్పటికీ `బిచ్చగాడు` మొదటి భాగం అందించిన స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయారు. కొన్ని ప్రయోగాలు విమర్శకుల ప్రశంసలు పొందినా కమర్షియల్‌గా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో ఆయన మళ్ళీ ఫామ్‌లోకి రావాలంటే బలమైన కథ, పక్కా మేకింగ్ అవసరమని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు దర్శకుడు శశి కూడా `బిచ్చగాడు` తర్వాత మరో భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.
ఆయన చేసిన ప్రయత్నాలు బాగున్నప్పటికీ ఆ మ్యాజిక్ మాత్రం మళ్ళీ రిపీట్ కాలేదు. విలక్షణమైన ఎమోషన్‌ను పట్టుకోవడంలో దిట్ట అయిన శశి విజయ్ ఆంటోనీ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా అద్భుతమైన కథలను సిద్ధం చేయగలరు. ఈ క్రమంలోనే దశాబ్ద కాలం తర్వాత ఇద్దరు మళ్లీ చేతులు కలిపారు. ప్రస్తుతం ఇద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రానికి తెలుగు వెర్షన్ టైటిల్ గా `వంద దేవుళ్లు` అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసారు. పేరులోనే ఒక రకమైన ఆధ్యాత్మిక , సామాజిక కోణం కనిపిస్తుండటంతో ఈ సినిమా కూడా `బిచ్చగాడు` తరహాలోనే బలమైన ఎమోషనల్ అండ్ సోషల్ డ్రామాగా ఉండబోతోందని అర్థమవుతోంది.
విజయ్ ఆంటోనీ మార్క్ నటనకు, శశి మార్క్ హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలు తోడైతే ఈ సినిమా మరో సెన్సేషన్ అవ్వడం ఖాయం. దశాబ్దం తర్వాత ఈ సంచలన కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ప్రస్తుతం సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. తాజాగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. పోస్టర్ లో ఆద్యంతం సహజత్వం హైలైట్ అవుతుంది. చెరుకు తోట మధ్యలో హీరో-హీరోయిన్ నేచురల్ లుక్ ఇంట్రెస్టింగ్. దర్శక, హీరో కెరీర్ ఈ చిత్రం ఎంతో కీలకమైంది. విజయంతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని కసి పట్టుదలతో పనిచేస్తున్నారు. `బిచ్చగాడు` మ్యాజిక్ రిపీట్ చేయానలి ప్రయత్నిస్తున్నారు. మరేం జరుగుతుందన్నది చూడాలి.
