సినిమా మిస్ అయితే హార్డ్ బ్రేక్ లా ఉంటుంది!
90స్ వెబ్సిరీస్ ఫేమ్ మౌళి తనూజ్- శివానీ నాగారం జంటగా నటింటిన తాజా చిత్రం లిటిల్ హార్ట్స్.
By: M Prashanth | 8 Aug 2025 5:03 PM IST90స్ వెబ్సిరీస్ ఫేమ్ మౌళి తనూజ్- శివానీ నాగారం జంటగా నటింటిన తాజా చిత్రం లిటిల్ హార్ట్స్. ఈ సినిమాను సాయి మార్తాండ్ తెరకెక్కించగా, ఆదిత్య హాసన్ నిర్మించారు. ప్రముఖ ప్రొడ్యూసర్లు బన్నీవాస్, వంశీ నందిపాటి సెప్టెంబరు 12న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు హైదరాబాద్ లో ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత వంశీ నందిపాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
ఈ సినిమా కంటెంట్ నచ్చి దీన్ని రిలీజ్ చేస్తున్నానమని వంశీ నందిపాటి అన్నారు. ఇది ఓ మంచి సినిమా అని, అస్సలు దీన్ని మిస్ అవ్వదని ఓ ఉదాహరణతో చెప్పారు. ఏదైనా మంచి మూవీ ఒకటి వచ్చినప్పుడు, ఆ మూవీ నేను చూసి మిస్ అయితే నాకు హార్ట్ బ్రేకింగ్ లా ఉంటుది. అంటే ఒక లవర్ కు ప్రపోజ్ చేసి, ఆ లవర్ వెళ్ళిపోయి ఇంకొకడిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటదో, మనకు అలా ఉంటుంది.
ఇంకా బ్యాడ్ థింగ్ ఏంటంటే.. ఆ పెళ్లికి మనమే వెళ్లాల్సి వస్తే అది ఇంకా పెద్ద బ్యాడ్ థింగ్ అవుతుంది. మన లిటిల్ హార్ట్స్ బ్రేక్ అవుతాయి. మేం ఈ సినిమా చేస్తున్నందుకు డిస్ట్రిబ్యూటర్ల లిటిల్ హార్ట్స్ హార్ట్స్ బ్రేక్ అవ్వాలని కోరుకుంటున్నాం. సెప్టెంబర్ 12న గట్టిగా కొడుతున్నాం. అని వంశీ అన్నారు.
కాగా, అంతకుముందు ఈ సినిమా నుంచి గురువారం రాజా గాడికి అనే సాంగ్ రిలీజ్ చేశారు. హైదరాబాద్లోనే చేసిన ఈ ఈవెంట్లో మరో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ఇది ఓ కాలేజ్ స్టూడెంట్స్ కోసం ఫ్రీ షో వేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ సినిమాను కాలేజీ విద్యార్థుల కోసం ఫ్రీ షో వేయాలనుకుంటున్నాం. అని బన్నీ వాసు పేర్కొన్నారు.
ఇక ఈ సినిమా చూస్తూ థియేటర్లో ప్రేక్షకులు పొట్ట పగిలిపోయేలా నవ్వుకోవడం ఖాయమని నిర్మాత ఆదిత్య హసన్ అన్నారు. టైటిల్ కు తగ్గట్లే ఈ సినిమా మనసును హత్తుకుంటుందని, టికెట్ కు పెట్టే ప్రతీ పైసాకు ఇది ఎంటర్టైన్ చేస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
