Begin typing your search above and press return to search.

రౌడీయిజం, రాజకీయాలు చేయడానికి రాలేదు: వంశీ నందిపాటి

ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటున్న వేళ.. తాజాగా స్టాండ్ ఫర్ అవర్ ఈషా పేరుతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

By:  M Prashanth   |   25 Dec 2025 6:15 PM IST
రౌడీయిజం, రాజకీయాలు చేయడానికి రాలేదు: వంశీ నందిపాటి
X

టాలీవుడ్ నటీనటులు త్రిగుణ్, అఖిల్‌ రాజ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు, పృథ్వీరాజ్ లీడ్ రోల్స్ లో రూపొందిన ఈషా మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఆ సినిమాను మంచి ఫామ్ లో ఉన్న నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి విడుదల చేశారు. నిన్న రాత్రి ప్రీమియర్స్ కూడా వేశారు.

ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటున్న వేళ.. తాజాగా స్టాండ్ ఫర్ అవర్ ఈషా పేరుతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అందులో సినిమాపై జరుగుతున్న పెయిడ్ నెగిటివ్ క్యాంపెయిన్ కోసం వంశీ నందిపాటి మాట్లాడారు. తాము ఎలాంటి రౌడీయిజం, రాజకీయాలు చేయడానికి ఇండస్ట్రీలోకి రాలేదని ఆయన స్పష్టం చేశారు.

"ఈషా మూవీకి 90 శాతం రివ్యూస్ బాగానే వచ్చాయి. 10 శాతం అటూ ఇటూ ఉంటాయి. దాన్ని ఎప్పుడూ యాక్సెప్ట్ చేయాలి. రివ్యూస్ ఏం ఇచ్చినా ఎప్పుడూ అంగీకరిస్తాం. ఆ విషయంలో హ్యాపీగా ఉన్నా. కానీ ఇప్పుడు జరుగుతున్న నెగిటివ్ క్యాంపెయిన్ విషయంలో అన్ హ్యాపీగా ఉన్నా. పెయిడ్ ట్వీట్, ఫేక్ రేటింగ్ సంస్కృతి.. ఇండస్ట్రీకి మంచిది కాదు" అని తెలిపారు.

"మనమంతా ఫ్యామిలీ. కాబట్టి ఎవరూ ఏం చేసినా కలిసి నిలబడాలి. ఇప్పటికే ఎన్నో సార్లు ఇలా జరిగింది. మిత్రమండలి మూవీ విషయంలో జరిగినా సైలెంట్ గా ఉన్నాం. ఇప్పుడు మంచి సినిమా ఈశాకు అలా జరుగుతుండడంతో ప్రొటెస్ట్ చేస్తాం. సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. నిన్న రాత్రి తెలుగు స్టేట్స్ లో ప్రీమియర్ షోస్ వేశాం" అని చెప్పారు.

"హైదరాబాద్ లో వేసిన 26 ప్రీమియర్ షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి. రాజమండ్రి, విజయవాడ సహా అనేక చోట్ల హౌస్ ఫుల్స్ కూడా అయ్యాయి. నైట్ చూసేసరికి 70 పర్సెంటేజ్ ఆక్యుపెన్సీతో మంచి అడ్వాన్స్ బుకింగ్స్ జరిగింది. చిన్న సినిమాకు అది అరుదైన ఫీట్. పొద్దున్నే లేచి చేస్తే బీఎంఎస్ రేటింగ్స్ లో 10కి 5 వచ్చింది. మరి అంత తక్కువ ఏంటి అని ఆలోచించా" అని తెలిపారు.

"దీంతో కచ్చితంగా పెయిడ్ క్యాంపెయిన్ అని ఫిక్స్ అయ్యా. 1000 కొట్టేస్తే నేను 2000 కొట్టేస్తా.. ఒక్కసారిగా పెంచేస్తా.. సోషల్ మీడియాలో ఇలాంటివి చూడనివా.. కానీ రౌడీయిజం, రాజకీయాలు చేయడానికి రాలేదు. మంచి సినిమాలు తీసి ఎంటర్టైన్ చేయడానికి వచ్చాం. మార్నింగ్ 7కి 5 పాయింట్స్ ఉండగా.. ఇప్పుడు 7.6 రేటింగ్ ఉంది" అని వెల్లడించారు వంశీ నందిపాటి.

"కానీ మేం రేటింగ్ వేయించుకుంటున్నారని కామెంట్లు పెడుతున్నారు. శంభాల తగ్గించి మాకు వేసుకున్నామని అంటున్నారు. కానీ ఆది నాకు ఒక బ్రదర్. ఆయన సినిమా ఆడాలని ముందు కోరుకునేది నేనే. ప్రతి చిన్న సినిమా ఆడాలని ఎప్పుడు కోరుకుంటాం. నెగిటివ్ చేయాలని థాట్స్ మాకు రావు. 100 శాతం డిఫెండ్ చేయడంలో భయం ఉండదు" అని తెలిపారు.