Begin typing your search above and press return to search.

అఖిల్-ధృవ్ వైపు వంశీ చూపా?

స్టార్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి నుంచి సినిమా రిలీజ్ అయి మూడేళ్లు స‌మీపిస్తుంది. `వార‌సుడు` త‌ర్వాత ఖాళీగా ఉండ‌టం త‌ప్ప చేసేదేం? లేద‌న్న‌ట్లు స‌న్నివేశం మారింది.

By:  Srikanth Kontham   |   29 Oct 2025 1:00 AM IST
అఖిల్-ధృవ్ వైపు వంశీ చూపా?
X

స్టార్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి నుంచి సినిమా రిలీజ్ అయి మూడేళ్లు స‌మీపిస్తుంది. `వార‌సుడు` త‌ర్వాత ఖాళీగా ఉండ‌టం త‌ప్ప చేసేదేం? లేద‌న్న‌ట్లు స‌న్నివేశం మారింది. స్టార్ హీరోలంతా బిజీగా ఉండ‌టంతో? వాళ్ల‌నే కావాల‌ని కూర్చోవ‌డంతో ఖాళీగా ఉండాల్సిన ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ కి సైతం వెళ్లాడు. అమీర్ ఖాన్..స‌ల్మాన్ ఖాన్ ల‌కు స్టోరీ చెప్పాడు. ఒకే అయింద‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఆ త‌ర్వాత ఎందుక‌నో సెట్ అవ్వ‌లేద‌నే వార్త అంతే వేగంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. తాజాగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి స్టోరీ చెప్పి మెప్పించిన‌ట్లు వ‌చ్చే ఏడాది ఆ సినిమా మొద‌ల‌వుతుంది? అన్న‌ది వెలుగులోకి వ‌చ్చింది.

ఆయ‌న‌తో ప్రాజెక్ట్ కౌంటేనా?

అయితే ఇదీ ప్ర‌చార‌మే. ఇంకా అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. పైగా ప‌వ‌న్ తో సినిమా అంటే అంత తేలికైన వ్య‌వ‌హారం కూడా కాదు. మొద‌లు ఇప్పుడు పెట్టినా పూర్త‌య్యే స‌ర‌కి ఎన్నేళ్లు ప‌డుతుందో? అన్న భ‌యం చాలా మంది ద‌ర్శ‌కుల‌కు ఉంటుంది. కాబ‌ట్టి ప‌వ‌న్ తో ప్రాజెక్ట్ ఒక‌వేళ ఉన్నా? అది ఇప్ప‌టికిప్పుడు పూర్తి చేసే ప్రాజెక్ట్ అవ్వ‌దు. కాబ‌ట్టి అది లెక్క‌లో లేని ప్రాజెక్ట్ గా చాలా మంది భావిస్తుంటారు. ఇప్పుడు వంశీ కూడా అలాగే భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా వంశీ చూపు యువ సంచ‌ల‌నాలు అఖిల్..ధృవ్ వైపు మ‌ళ్లుతున్న‌ట్లు నెట్టింట ప్ర‌చారం మొద‌లైంది.

యూనిక్ కాన్సెప్ట్ అత‌డి ప్ర‌త్యేక‌త‌:

ఇద్ద‌రితో ఓ యూత్ పుల్ కంటెంట్ తో సినిమా చేస్తే బాగుంఉటంద‌నే ఆలోచ‌న మొదిలిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

ఈ విష‌యంలో వంశీ స‌మ‌ర్ద‌వంతుడే. ఇత‌డి కాన్సెప్ట్ లు యూనిక్ గా రెగ్యుల‌ర్ కి భిన్నంగా ఉంటాయి. కొత్త పాయింట్ ని ట‌చ్ చేసి సినిమాలు చేయ‌డం వంశీ ప్ర‌త్యేక‌త‌. నేటి జ‌న‌రేష‌న్ ఏఐలోకి వెళ్తుంద‌ని వంశీ `మ‌హ‌ర్షి` సినిమా టైమ్ లోనే ఎంతో అడ్వాన్స్ గా చెప్పాడు. కానీ అప్పుడు ఎవ‌రు? ప‌ట్టించుకోలేదు. `ఏఐ` వాడుక‌లోకి వ‌చ్చేస‌రికి జ‌నాలంతా వంశీ గురించే మాట్లాడుకుంటున్నారు. అలాంటి డైరెక్ట‌ర్ చూపు అఖిల్..ధృవ్ మీద ప‌డిందంటే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తోనే వ‌స్తాడు? అన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు.

అదే జ‌రిగితే ఇది రెండ‌వ‌సారి:

పైగా ఇద్ద‌రు ఖాళీగా ఉన్న న‌టులు. వంశీ స‌రైన స్టోరీతో అప్రోచ్ అయితే ఇనిస్టెంట్ గా డేట్లు ఇవ్వ‌గ‌ల‌రు. వంశీ అప్రోచ్ అవ్వ‌డ‌మే ఆల‌స్యం. ఇలా తెలుగు-త‌మిళ న‌టుల్ని ఒకేతాటిపైకి తీసుకొచ్చి సినిమా చేయ‌డం వంశీకి కొత్తేం కాదు. గ‌తంలో నాగార్జున‌-కార్తీల‌తో ఊపిరి తెర‌కెక్కించి హిట్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. అదే స్పూర్తితో మ‌రోసారి ముంద‌డుగు వేసే ప్లాన్ లో ఉన్న‌ట్లున్నాడు.