ఇద్దరు రిజెక్ట్ చేసింది.. పవన్ ఒప్పుకుంటాడా?
ఇండస్ట్రీలో కొన్ని స్క్రిప్టుల జర్నీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఒక హీరో కోసం రాసిన కథ, ఎన్నో మలుపులు తిరిగి, ఫైనల్‌గా మరో హీరో దగ్గర లాక్ అవుతుంది.
By: M Prashanth | 27 Oct 2025 3:33 PM ISTఇండస్ట్రీలో కొన్ని స్క్రిప్టుల జర్నీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఒక హీరో కోసం రాసిన కథ, ఎన్నో మలుపులు తిరిగి, ఫైనల్‌గా మరో హీరో దగ్గర లాక్ అవుతుంది. ఇప్పుడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి చేతిలో అలాంటి స్క్రిప్ట్ ఒకటి ఉందని, అది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 'మహర్షి', 'వారసుడు' లాంటి పెద్ద సినిమాల తర్వాత, వంశీ చాలా గ్యాప్ తీసుకున్నారు.
గత రెండు, మూడేళ్లుగా ఆయన ఒక పవర్ ఫుల్ 'సోషల్ డ్రామా' కథపై పనిచేస్తున్నారని టాక్. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదని, సమాజాన్ని కదిలించే పాయింట్‌తో ఉంటుందని అంటున్నారు. నిజానికి వంశీ ఈ స్క్రిప్ట్‌ను ముందుగా టాలీవుడ్ హీరోల కోసం రాయలేదట. ఆయన ప్లానింగ్ మొత్తం బాలీవుడ్ మీదే ఉందని సమాచారం.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న క్రేజీ బజ్ ప్రకారం, వంశీ పైడిపల్లి మొదట ఈ కథను మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్‌కు వినిపించారట. ఆమిర్‌కు కథ బాగా నచ్చిందని, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ప్రొడ్యూసర్ దిల్ రాజు అడ్వాన్స్ కూడా పే చేశారని, అనౌన్స్‌మెంట్ డేట్ కూడా లాక్ చేశారని టాక్ వచ్చింది. కానీ, చివరి నిమిషంలో ఏమైందో ఏమో, ఆమిర్ ఖాన్ ఆ ప్రాజెక్ట్ నుంచి సైలెంట్‌గా తప్పుకున్నారట.
ఆమిర్ ఖాన్ హ్యాండ్ ఇవ్వడంతో, వంశీ ఆశలు వదులుకోలేదు. అదే స్క్రిప్ట్‌ను తీసుకుని, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ దగ్గరికి వెళ్లారట. ఆమిర్ కాదన్న కథను సల్మాన్ ఓకే చేస్తాడని ఆశించారు. కానీ, అక్కడ కూడా ఆ డీల్ మెటీరియలైజ్ అవ్వలేదని, సల్మాన్ ఖాన్ కూడా ఈ సోషల్ డ్రామాకు ఇంట్రెస్ట్ చూపించలేదని అంటున్నారు.
ఇలా ఇద్దరు టాప్ ఖాన్స్ చేతులు మారిన ఆ స్క్రిప్ట్, ఇప్పుడు ఫైనల్‌గా తిరిగి టాలీవుడ్‌కు, అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చిందని గట్టిగా ప్రచారం జరుగుతోంది. వంశీ పైడిపల్లికి ఆస్థాన నిర్మాత అయిన దిల్ రాజు, ఇప్పుడు ఇదే సోషల్ డ్రామా కథను పవన్ కళ్యాణ్‌తో తీయాలని ప్లాన్ చేస్తున్నారట.
పవన్ కళ్యాణ్ ప్రస్తుత పొలిటికల్ ఇమేజ్‌కు, ఆయన ఐడియాలజీకి ఇలాంటి 'సోషల్ డ్రామా' పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని దిల్ రాజు భావిస్తున్నారట. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే, ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. కానీ, ఇద్దరు బాలీవుడ్ టాప్ స్టార్లు వద్దనుకున్న కథను పవన్ కళ్యాణ్ ఓకే చేస్తారా లేదా అనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.
