లేటైనా సరే.. స్టార్ కావాల్సిందే!
ఎవరైనా సరే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత గ్యాప్ తీసుకోకుండా వరుస పెట్టి సినిమాలు చేయాలనే అనుకుంటారు.
By: Sravani Lakshmi Srungarapu | 15 Oct 2025 10:56 AM ISTఎవరైనా సరే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత గ్యాప్ తీసుకోకుండా వరుస పెట్టి సినిమాలు చేయాలనే అనుకుంటారు. హీరోల దగ్గర నుంచి డైరెక్టర్ల వరకు, నిర్మాతల నుంచి సైడ్ ఆర్టిస్ట్ వరకు అందరూ ఇదే ఆలోచనతో ఉంటారు. కానీ చాలా కొందరు మాత్రమే లేటైనా పర్లేదు చేస్తే భారీ ప్రాజెక్టే చేయాలనుకుని అది సెట్ అయ్యే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు.
కెరీర్ స్టార్టింగ్ నుంచి స్టార్ హీరోలతోనే..
టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా ఇదే లిస్ట్ లోకి వస్తారు. ఆయన కెరీర్ ను చూసుకుంటే ఇప్పటివరకు స్టార్ హీరోలతోనే సినిమాలు చేసుకుంటూ వచ్చారు. మున్నాతో కెరీర్ ను మొదలుపెట్టిన వంశీ, ఆ సినిమా ఫ్లాపైనా సరే తర్వాత కూడా స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు. ఇక్కడ హీరోలకు టైమ్ లేకపోవడమో, డేట్స్ అడ్జస్ట్ అవకపోవడమో జరిగితే వేరే ఇండస్ట్రీలకు వెళ్లి అక్కడి స్టార్ హీరోల దగ్గరకు వెళ్తున్నారు తప్పించి కాంప్రమైజ్ అయి చిన్న హీరోలతో మాత్రం సినిమాలు చేయడం లేదు.
అందుకే వంశీ కెరీర్లో గ్యాప్ ఎక్కువగా వస్తుంది. ఎప్పుడో ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ వంశీ చాలా తక్కువ సినిమాలు చేయడానికి గల కారణాల్లో ఇది మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా పెద్ద స్టార్లపై ఫోకస్ పెట్టి వారితోనే సినిమాలు చేయాలని చూస్తూ వస్తున్నారు. మహేష్ బాబు తో మహర్షి చేసిన తర్వాత మరో సినిమా కూడా చేస్తారన్నారు.
కోలీవుడ్ స్టార్ విజయ్ తో వారిసు
కానీ ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. అయినప్పటికీ కాన్ఫిడెన్స్ ను కోల్పోకుండా కొంతకాలం పాటూ వెయిట్ చేసి తమిళ స్టార్ హీరో విజయ్ తో వారిసు (తెలుగులో వారసుడు) తీశారు. వారిసు వచ్చి చాలా కాలమైంది. కానీ ఇప్పటివరకు వంశీ నుంచి మరో సినిమా రాలేదు. ఆల్రెడీ వారిసు మూవీతో కోలీవుడ్ లోకి ఎంటరైన వంశీ, ఆ తర్వాత బాలీవుడ్ పై కన్నేసి ఆమిర్ ఖాన్ తో సినిమా చేయాలనుకున్నారు.
ఆమిర్ కోసం ప్రయత్నించిన వంశీ
కానీ ఆమిర్ తో సినిమా వర్కవుట్ అవలేదు. ఆమిర్ తో కుదరకపోయినా ఈసారి బాలీవుడ్ లోనే సినిమా చేయాలని పట్టుబట్టి మరీ అక్కడే తిష్ట వేసుకుని కూర్చుని, మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో సినిమా చేయాలని ఆయనకు కథ చెప్పి, ఒప్పించారని తెలుస్తోంది. వంశీ చెప్పిన కథకు సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారట. ప్రస్తుతం సల్మాన్ మార్కెట్ భారీ స్థాయిలో లేకపోయినా అంతటి స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ వస్తే దాన్ని వదులుకోవాలని రాజు లాంటి నిర్మాత అనుకోరు. ఈ ప్రాజెక్టు గురించి మిగిలిన అప్డేట్స్ కోసం కొన్నాళ్ల పాటూ వెయిట్ చేయాల్సి ఉంటుంది. దిల్ రాజు కు ఒకప్పుడున్నంత సక్సెస్ రేట్ ఈ మధ్య ఉండటం లేదు. ఇలాంటి టైమ్ లో సల్మాన్ తో సినిమా చేసి రిస్క్ చేయడం అవసరమా అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
