దిల్ రాజు బ్యానర్ నుంచి అతను ఎగ్జిట్..?
వంశీ పైడిపల్లి సినిమా అంటే అది ఎస్.వి.సి బ్యానర్ లోనే దిల్ రాజు, శిరీష్ నిర్మాతలే అని ఫిక్స్ అయ్యేలా చేసుకున్నారు.
By: Ramesh Boddu | 7 Jan 2026 12:26 PM ISTకొంతమంది డైరెక్టర్స్ కొన్ని నిర్మాణ సంస్థల దగ్గర ఏళ్లకు ఏళ్లు పనిచేస్తుంటారు. బయట వాళ్లతో సినిమాలు తీయలేక కాదు ఆ కంపెనీతో అలాంటి ఒక బాండింగ్ ఏర్పడుతుంది. అందుకే వాళ్లని ఫలనా బ్యానర్ కి ఆస్థాన దర్శకులు అంటుంటారు. అంతేకాదు ఆ బ్యానర్ లో వచ్చే సినిమాలకు ఈ డైరెక్టర్స్ ఇన్ డైరెక్ట్ సపోర్ట్ కూడా ఉంటుంది. టాలీవుడ్ లో అలాంటి నిర్మాతలు, దర్శకుల కాంబినేషన్స్ చాలానే ఉన్నాయి. అలాంటి వారిలో ఒకరు వంశీ పైడిపల్లి. ఆయన కెరీర్ తొలినాళ్ల నుంచి శ్రీ వెంకటేశ్వర బ్యానర్ ని విడిచిపెట్టలేదు.
వంశీ పైడిపల్లి బాలీవుడ్ హీరో సినిమా..
వంశీ పైడిపల్లి సినిమా అంటే అది ఎస్.వి.సి బ్యానర్ లోనే దిల్ రాజు, శిరీష్ నిర్మాతలే అని ఫిక్స్ అయ్యేలా చేసుకున్నారు. ఐతే త్వరలో దిల్ రాజు బ్యానర్ లో వంశీ పైడిపల్లి బాలీవుడ్ హీరో సినిమా ఉంటుందని అనుకోగా వంశీ బాలీవుడ్ హీరో సినిమా నిజమే కానీ బ్యానర్ మాత్రం ఎస్.వి.సి కాదని తెలుస్తుంది. దిల్ రాజు బ్యానర్ లో వంశీ పైడిపల్లి ఒక బాలీవుడ్ స్టార్ సినిమా అని ఆమధ్య వార్తలు రాగా దానికి ఎస్.వి.సి బ్యానర్ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజైంది.
తమ బ్యానర్ లో వచ్చే సినిమాల గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. వాటిల్లో ఏమాత్రం నిజం లేదు ఏదైనా ప్రాజెక్ట్ ఓకే అయితే మేమే ఎనౌన్స్ చేస్తామని అన్నారు. ఐతే ఇప్పుడు వంశీ పైడిపల్లి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా లాక్ అయ్యిందట. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారని తెలుస్తుంది. అదే నిజమైతే వంశీ పైడిపల్లి దిల్ రాజు బ్యానర్ నుంచి బయటకు వచ్చినట్టే అని చెప్పొచ్చు.
కెరీర్ లో ఫస్ట్ టైం వంశీ బయట బ్యానర్ కి..
సల్మాన్ తో సినిమా మైత్రి మేకర్స్ కు వంశీ పైడిపల్లి బెస్ట్ ఆప్షన్ అనిపించాడు. వంశీ పైడిపల్లి 3, 4 ఏళ్లకు ఒక సినిమా తీసినా అందులో విషయం ఉంటుంది. అందుకే ఆయన డైరెక్షన్ లో సినిమా అంటే హీరోలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. సల్మాన్ తో వంశీ పైడిపల్లి సినిమా కన్ఫర్మ్ అయినట్టే. ఐతే కెరీర్ లో ఫస్ట్ టైం వంశీ బయట బ్యానర్ కి సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో ఇన్నాళ్లు సినిమాలు చేసిన వంశీ మైత్రి మూవీస్ తో ఈ ప్రాజెక్ట్ చేయడం అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది.
మరి దిల్ రాజు బ్యానర్ నుంచి వంశీ పైడిపల్లి పూర్తిగా ఎగ్జిట్ అయ్యాడా లేదా ఈ సినిమా వరకు చేసి మళ్లీ నెక్స్ట్ ఎస్.వి.సి బ్యానర్ లోనే వంశీ సినిమా ఉంటుందా అన్నది చూడాలి. ఏది ఏమైనా సౌత్ డైరెక్టర్ తో బాలీవుడ్ హీరోల సినిమాలు ఇప్పుడు ట్రెండ్ సృష్టిస్తుండగా వంశీ లాంటి డైరెక్టర్ తో సల్మాన్ ఖాన్ సినిమా కూడా సంథింగ్ స్పెషల్ అనిపిస్తుంది.
