ఇద్దరు భామలతో రవితేజ మాస్ స్టెప్పులు
మాస్ మహారాజా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తోన్న తాజా సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి.
By: Sravani Lakshmi Srungarapu | 31 Dec 2025 7:25 PM ISTమాస్ మహారాజా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తోన్న తాజా సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయింది. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కిషోర్ తిరుమలకు ఫ్యామిలీ సినిమాలపై మంచి గ్రిప్ ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్
అలాంటి కిషోర్ తిరుమల దర్శకత్వంలో సంక్రాంతికి ఓ సినిమా వస్తుండటంతో అందరికీ ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలున్నాయి. దానికి తోడు ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన టీజర్, సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో మూవీపై మంచి హైపే నెలకొంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మేకర్స్ నెక్ట్స్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు.
వామ్మో వాయ్యో ప్రోమో
ఇద్దరు హీరోయిన్లతో పాటూ రవితేజ కలిసి ఈ మాస్ సాంగ్ లో స్టెప్పులేయనున్నారు. వామ్మో వాయ్యో అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమో చూస్తుంటే పాట మంచి డ్యాన్స్ నెంబర్ లానే అనిపిస్తుంది. సాంగ్ లో రవితేజ, ఆషిక, డింపుల్ ముగ్గురూ పోటీ పడి డ్యాన్స్ చేసినట్టు అనిపిస్తుంది. ఈ సాంగ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేస్తూ ఫుల్ సాంగ్ ను జనవరి 2న రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు.
ఈ సాంగ్ కు భీమ్స్ సిసిరోలియో మంచి క్యాచీ ట్యూన్ ను అందించినట్టు ప్రోమో చూస్తేనే అర్థమవుతుంది. దేవ్ పవార్ సాహిత్యం అందించిన ఈ పాటను స్వాతి రెడ్డి ఆలపించగా, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. కాగా ఈ సినిమాలో మ్యారీడ్ మ్యాన్ గా కనిపించనున్నారు. ఓ వైపు భార్య, మరోవైపు ప్రియురాలి మధ్య నలిగిపోయే వ్యక్తిగా రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీతో ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి.
