Begin typing your search above and press return to search.

వాలెంటైన్స్ వీక్.. బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉన్నాయంటే..

ఈ ఏడాది వాలెంటైన్స్ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా సౌండ్ వినిపించలేదు. ప్రేమికుల రోజును టార్గెట్ చేస్తూ విడుదలైన సినిమాలు అనుకున్నంత రేంజ్ లో సందడి చేయలేకపోయాయి.

By:  M Prashanth   |   17 Feb 2026 12:22 AM IST
వాలెంటైన్స్ వీక్.. బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉన్నాయంటే..
X

ఈ ఏడాది వాలెంటైన్స్ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా సౌండ్ వినిపించలేదు. ప్రేమికుల రోజును టార్గెట్ చేస్తూ విడుదలైన సినిమాలు అనుకున్నంత రేంజ్ లో సందడి చేయలేకపోయాయి. వారాంతం వరకు ఏదోలా నెట్టుకొచ్చినా, సోమవారం వచ్చేసరికి కలెక్షన్లలో భారీ డ్రాప్ కనిపించింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఆదివారం భారత్ పాక్ మధ్య జరిగిన హై వోల్టేజ్ టీ20 మ్యాచ్ వైపు మళ్ళడం కూడా ఈ సినిమాల వసూళ్లపై గట్టిగానే ప్రభావం చూపింది.

విశ్వక్ సేన్, అనుదీప్ కేవీ కాంబోలో వచ్చిన ‘ఫంకీ’ సినిమాపై మొదటి నుండి పెద్దగా అంచనలేమి లేవు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లాంటి పెద్ద బ్యానర్, దానికి తోడు అనుదీప్ మార్క్ కామెడీ తోడవ్వడంతో ఈ సినిమా కచ్చితంగా హిట్టవుతుందని బయ్యర్లలో కొంచెం హాప్ కనిపించింది. కానీ ల్ టాక్ తేడా కొట్టడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రగుల్ అవుతోంది. వీకెండ్ లో డీసెంట్ గానే ఉన్నా, వర్కింగ్ డేస్ మొదలవ్వగానే కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.

బాక్సాఫీస్ రిపోర్ట్స్ ప్రకారం ‘ఫంకీ’ సినిమా ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా సుమారు 4.55 కోట్ల షేర్ మాత్రమే రాబట్టినట్లు అంచనా. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ జోన్ లోకి వెళ్లాలంటే కనీసం 15 కోట్ల షేర్ రాబట్టాలని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అంటే ఇప్పటివరకు జరిగిన వసూళ్లు టార్గెట్ లో మూడో వంతు కూడా లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. సోమవారం నాడు వసూళ్లు కోటి లోపు పడిపోవడంతో ఈ టార్గెట్ రీచ్ అవ్వడం దాదాపు కష్టమే అనిపిస్తోంది.

ఇక యాక్షన్ కింగ్ అర్జున్ తన కుమార్తె ఐశ్వర్యను వెండితెరకు పరిచయం చేస్తూ తీసిన ‘సీత పయనం’ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. భారీ ప్రమోషన్లు చేసినా, సినిమా కంటెంట్ ప్రేక్షకులకు అస్సలు కనెక్ట్ కాలేదు. తొలిరోజే పూర్ ఆక్యుపెన్సీతో మొదలైన ఈ జర్నీ, సోమవారం నాటికి దాదాపు వాష్ అవుట్ అయ్యే స్థితికి చేరుకుంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా కనీసం కోటి రూపాయల గ్రాస్ కూడా రాబట్టలేకపోయింది. ఇది అర్జున్ సర్జా టీమ్‌కు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి.

ఈ సినిమాలతో పోలిస్తే సంతోష్ శోభన్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ కొంత బెటర్ గా పర్ఫార్మ్ చేస్తోంది. పాజిటివ్ టాక్ ఉండటం, ప్రమోషన్లు ఇంకా కొనసాగిస్తుండటంతో ఈ సినిమా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. 2వ రోజే లెక్క రెండున్నర కోట్లను దాటడం విశేషం. ఒకవేళ ఈ వీకెండ్ వరకు కలెక్షన్లు స్టడీగా ఉంటే, ఈ సినిమా మాత్రమే క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఉంది. మిగతా రెండు సినిమాలు మాత్రం బాక్సాఫీస్ రన్ ను దాదాపు ముగించినట్లే కనిపిస్తున్నాయి. ఇక ఈ వాలెంటైన్స్ వీక్ టాలీవుడ్‌కు పెద్దగా కలిసి రాలేదు. పెద్ద డైరెక్టర్లు, క్రేజీ హీరోలు ఉన్నా కంటెంట్ లో పస లేకపోతే ఆడియన్స్ అస్సలు కనికరించరని ‘ఫంకీ’ రిజల్ట్ మరోసారి నిరూపించింది. రాబోయే వారాల్లో విడుదలయ్యే సినిమాలైనా బాక్సాఫీస్ కు కొత్త ఊపిరి పోస్తాయో లేదో చూడాలి.