Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ - అల్లు అర్జున్ కోసం స్టోరీ రెడీ చేసిన స్టార్ రైటర్... కానీ ఆ ఒక్క కారణంతో మూవీ ఆగిపోయిందా?

రామ్ చరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వక్కంతం వంశీ ఓ భారీ మల్టీస్టారర్ కథ సిద్ధం చేశారనే వార్త అప్పట్లో వినిపించింది. అయితే ఇద్దరు హీరోలు తమ సినిమాలతో బిజీగా ఉండటంతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ప్రస్తుతం ఇద్దరూ పాన్ ఇండియా స్టార్లుగా ఎదగడంతో, ఈ కాంబోలో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఈ కలయిక సాధ్యమవుతుందనే ఆసక్తి కూడా ఉంది.

By:  Gopi Velupala   |   16 Nov 2026 5:00 AM IST
రామ్ చరణ్ - అల్లు అర్జున్ కోసం స్టోరీ రెడీ చేసిన స్టార్ రైటర్... కానీ ఆ ఒక్క కారణంతో మూవీ ఆగిపోయిందా?
X

సినిమా ఇండస్ట్రీ లో ప్రస్టీజియస్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉంటాయి. వాటిని తెర మీద చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ లను కలిపి తీసిన 'ఆర్ఆర్ఆర్' మూవీ పెను సంచలనాలను క్రియేట్ చేసింది. ప్రస్తుతం చాలా మంది మేకర్స్ మల్టీ స్టారర్స్ మూవీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

రామ్ చరణ్ - అల్లు అర్జున్ కాంబో...

రామ్ చరణ్ కెరీర్ స్టార్టింగ్ లోనే చిరుత,మగధీర సినిమాలతో టాప్ హీరోగా ఎదిగాడు. అల్లు అర్జున్ సైతం డిఫరెంట్ మూవీస్ చేస్తూ టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఈ సందర్భం లోనే వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో రామ్ చరణ్ చేసిన 'ఎవడు' మూవీలో అల్లు అర్జున్ ఒక క్యారెక్టర్లో నటించాడు. కానీ అది స్క్రీన్ మీద కొద్దిసేపే కనిపిస్తుంది. అయినప్పటికీ అల్లుఅర్జున తన నటనతో మెప్పించాడు. వాళ్లిద్దరి పర్ఫామెన్స్ కి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభించింది. అదే సమయంలో రైటర్ వక్కంతం వంశీ వాళ్లిద్దరి ఇమేజ్ కి సరిపడ ఒక భారీ మల్టీ స్టారర్ కథను రెడీ చేశాడట. కానీ అప్పుడు రామ్ చరణ్ అల్లు అర్జున్ ఇద్దరు బిజీగా ఉండటంతో ఆ ప్రాజెక్ట్ పట్టలెక్కలేదు. మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య చాలా చక్కని సంబంధాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళ కాంబో స్క్రీన్ మీద కనిపిస్తే వల్ల మధ్య ఉన్న బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అయ్యేది. అలాగే ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేదని అప్పట్లో చాలా మంది దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ హీరోలు ఎవరి ప్రాజెక్ట్ లో వాళ్ళు బిజీగా ఉండటం వల్ల అది వర్కౌట్ కాలేదు...

ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్...

ఈ మధ్య కాలంలో వీళ్లిద్దరూ పాన్ ఇండియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. వీళ్ళ సినిమాలు 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొడుతున్నాయి. అందుకే ఇండియాలో ఉన్న ప్రతి డైరెక్టర్ వీళ్ళతో సినిమా చేయడానికి ట్రై చేస్తున్నారు. వీళ్లిద్దరు కలిసి మల్టీ స్టారర్ సినిమాలో నటించడం అనేది ఇప్పుడప్పుడే వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ ఇద్దరి ఇమేజ్ ను బ్యాలన్స్ చేస్తూ కథ రాయించి సినిమా చేస్తే చెప్పలేం. కానీ ఇప్పుడున్న మిగతా స్టార్ డైరెక్టర్లను నమ్మి ఈ ఇద్దరు డేట్స్ ఇచ్చే అవకాశం లేనట్టుగా తెలుస్తుంది. ఫ్యూచర్ లో అయిన వీళ్ళ కాంబో సెట్ అయితే చూడాలని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు...