రెండేళ్ల తర్వాత మెగా హీరో ఆ డైరెక్టర్ కు ఓకే చెప్పాడా?
మొదటి సినిమా ఉప్పెన తోనే హీరోగా బ్లాక్ బస్టర్ అందుకుని అందరి దృష్టిని ఆకర్షించిన హీరో వైష్ణవ్ తేజ్.
By: Sravani Lakshmi Srungarapu | 14 Nov 2025 5:00 PM ISTమొదటి సినిమా ఉప్పెన తోనే హీరోగా బ్లాక్ బస్టర్ అందుకుని అందరి దృష్టిని ఆకర్షించిన హీరో వైష్ణవ్ తేజ్. ఈ సినిమాతో వైష్ణవ్ ఏకంగా రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించి మంచి డెబ్యూ అందుకున్నాడు. మొదటి సినిమాతో మంచి హిట్ అందుకోవడంతో పాటూ తన యాక్టింగ్ తో ఆడియన్స్ ను అలరించిన వైష్ణవ్ తో సినిమాలు చేయడానికి మేకర్స్ బాగా ఆసక్తి చూపించారు. వైష్ణవ్ కూడా వచ్చిన ఆఫర్లను అందుకుని వరుస సినిమాలు చేశాడు.
రెండేళ్లుగా ఖాళీగానే..
కానీ ఉప్పెన తర్వాత వచ్చిన కొండపొలం, రంగ రంగ వైభవంగా, ఆదికేశవ.. వీటిలో ఏ సినిమా వైష్ణవ్ కు మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. కెరీర్లో వరుస ఫ్లాపులు పడటంతో వైష్ణవ్ కెరీర్ పై ఫోకస్ ను పెంచి సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వహిస్తున్నాడు. అందులో భాగంగానే వైష్ణవ్ తేజ్ గత రెండేళ్లుగా ఖాళీగా ఉన్నాడు. వైష్ణవ్ నెక్ట్స్ మూవీ అనౌన్స్‌మెంట్ ఎప్పుడొస్తుందా అని అందరూ ఎంతో ఎదురుచూస్తున్నారు.
రెండేళ్లలో ఎన్నో కథలు విన్న వైష్ణవ్
సినిమాల ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్న వైష్ణవ్ దగ్గరకు గత రెండేళ్లలో ఎన్నో కథలు రాగా, వాటిని ఈ యంగ్ హీరో రిజెక్ట్ చేశాడు. కొంతమంది ప్రముఖ నిర్మాతలు కూడా వైష్ణవ్ వద్దకు కొన్ని కథలను పంపగా, వాటికి కూడా అతను నో చెప్పాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే వైష్ణవ్ తేజ్ రీసెంట్ గా మనం, 24ఫేమ్ విక్రమ్ కె. కుమార్ చెప్పిన ఓ స్క్రిప్ట్ ను విన్నాడని తెలుస్తోంది.
విజయ్ కోసం కూడా ఓ స్క్రిప్ట్
ప్రస్తుతం స్క్రిప్ట్ డిస్కషన్స్ జరుగుతున్నాయని, విక్రమ్ ఫైనల్ స్క్రిప్ట్ ను రెడీ చేసి త్వరలోనే వైష్ణవ్ కు వినిపించనున్నారని, ప్రస్తుతానికైతే చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇదిలా ఉంటే వైష్ణవ్ తేజ్ తో పాటూ విజయ్ దేవరకొండ కోసం కూడా విక్రమ్ కుమార్ ఓ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారని, ప్రస్తుతానికైతే డిస్కషన్స్ ఇంకా అడ్వాన్డ్స్ స్టేజ్ లోనే ఉన్నాయని అంటున్నారు. యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుందని, నెక్ట్స్ ఇయర్ దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వీలుందని సమాచారం. విక్రమ్ తో కాకుండా ఇతర డైరెక్టర్లతో కూడా వైష్ణవ్ చర్చలు జరుపుతున్నాడని కాకపోతే ఇంకా ఏ ప్రాజెక్టూ ఫిక్స్ అవలేదని, ఏదేమైనా నెక్ట్స్ ఇయర్ లో వైష్ణవ్ తేజ్ తర్వాతి సినిమా షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది.
