ఒక్క లుక్‌తోనే అలజడి..తెల్లచీరలో వైష్ణవి గ్లామర్ వైరల్
తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. మల్లెపూవు లాంటి తెల్లటి చీరలో వైష్ణవి దేవకన్యలా కనిపిస్తోంది.
By: Madhu Reddy | 22 May 2026 11:02 PM IST'బేబీ' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన మన తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య, ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. మల్లెపూవు లాంటి తెల్లటి చీరలో వైష్ణవి దేవకన్యలా కనిపిస్తోంది. కేవలం హార్ట్ ఎమోజీలతో ఆమె పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ ట్రెడిషనల్ లుక్‌లో వైష్ణవి అందం చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
దేవకన్యలా మార్చేసిన ఆ డిజైన్:
వైష్ణవి కట్టుకున్న ఈ అందమైన వైట్ కలర్ కాస్ట్యూమ్‌ను 'అనూష రెడ్డి కోట్యూర్' ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దానికి తగ్గట్టుగా 'ది జ్యువెలరీ గ్యాలరీ' అందించిన చోకర్ నెక్లెస్, గాజులు ఆమెకు మరింత రాయల్ లుక్‌ను తీసకువచ్చాయి. ఇక సెలబ్రిటీ స్టైలిస్ట్లు సంధ్య, షెఫాలి, పల్లవి కలిసి వైష్ణవిని ఎంతో పద్ధతిగా, అందంగా ముస్తాబు చేశారు. ఫోటోగ్రాఫర్ సుజనా తన కెమెరాతో ఈ అందాన్ని అద్భుతంగా బంధించారు.
షార్ట్ ఫిలిమ్స్ నుండి స్టార్ హీరోయిన్ వరకు:
యూట్యూబ్‌లో 'సాఫ్ట్‌వేర్ డెవలపర్' వంటి షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన వైష్ణవి, ఆ తర్వాత 'అల వైకుంఠపురములో' వంటి పెద్ద సినిమాల్లో చిన్న క్యారెక్టర్స్ చేసింది. కానీ, 'బేబీ' సినిమా ఆమె తలరాతను మార్చేసింది. ఇక గతేడాది సిద్ధు జొన్నలగడ్డతో కలిసి 'జాక్' సినిమాలో నటించి అలరించిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది.
'ఎపిక్' సినిమాతో రాబోతున్న కడలి:
ప్రస్తుతం ఆనంద్ దేవరకొండతో కలిసి వైష్ణవి నటిస్తున్న రొమాంటిక్ డ్రామా 'ఎపిక్'. ఆదిత్య హాసన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సమ్మర్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమాలో వైష్ణవి 'కడలి' అనే ఒక బోల్డ్ అండ్ ఇండిపెండెంట్ అమ్మాయి పాత్రలో నటిస్తోంది.
సొంత నిర్ణయాలు తీసుకునే అమ్మాయి కథ:
'కడలి' క్యారెక్టర్ గురించి వైష్ణవి మాట్లాడుతూ.. కథ వినగానే తనకు బాగా నచ్చేసిందని చెప్పింది. ఇక తన ఎమోషన్స్ ఏంటో, తన నిర్ణయాలు ఏంటో స్పష్టత ఉన్న ఒక ప్రాక్టికల్ అమ్మాయి పాత్ర ఇదని, ఈ తరం అమ్మాయిలందరికీ ఈ క్యారెక్టర్ బాగా కనెక్ట్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేసింది. ఇక షూటింగ్ అంతా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో జరిగిందని ఆమె చెప్పుకొచ్చింది.
గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ వైష్ణవి చైతన్య దూసుకుపోతోంది. ఇక అటు వైట్ శారీ ఫోటోలతో కుర్రకారు మనసులు దోచుకుంటూనే, ఇటు 'ఎపిక్' సినిమాతో థియేటర్లలో అలరించడానికి సిద్ధమవుతోంది. మన తెలుగు అమ్మాయి ఇలాంటి మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిద్దాం.
