ఏజ్ రూమర్స్‌కు చెక్.. నిజం చెప్పిన వైష్ణవి చైతన్య!
సినీ ఇండ్రస్ట్రీ లో కథానాయికల వయసుపై ఎప్పుడూ రకరకాల చర్చలు నడుస్తూనే ఉంటాయి.
By: Madhu Reddy | 21 Sept 2026 10:42 AM ISTసినీ ఇండ్రస్ట్రీ లో కథానాయికల వయసుపై ఎప్పుడూ రకరకాల చర్చలు నడుస్తూనే ఉంటాయి. కొందరికి ఏజ్ పెరిగితే అవకాశాలు తగ్గిపోతాయేమోననే భయంతో తమ అసలు వయసును దాచేస్తుంటారు అనే పుకారు వుంది. అయితే, ఇటీవల 'ఎపిక్' చిత్రంతో అలరించిన యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య మాత్రం తన ఏజ్ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలకు ఒక్క దెబ్బతో చెక్ పెట్టేసింది. వికీపీడియాలో ఉన్న తప్పుడు సమాచారంపై స్పందిస్తూ, తన అసలు వయసు ఎంతో బహిరంగంగా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ వివరాలు ఇలా వున్నాయి..
వికీపీడియాలో నా వయసు తప్పు:
ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న వైష్ణవిని యాంకర్ ఆమె ఏజ్ గురించి ప్రశ్నించారు. వికీపీడియా ప్రకారం మీకు 32 ఏళ్లు అని,ఇక ఇంస్టాగ్రామ్ లోకూడా ఇమెకన్నా ఈ హీరోయిన్ పెద్దదా అయినా కూడా 25 ఏళ్ల చిన్నపిల్లలా ఎలా కనిపిస్తున్నారని ఆమె బ్యూటీ సీక్రెట్ అడిగారు. దీనికి స్పందించిన వైష్ణవి.. వికీపీడియాలో ఉన్నది చూసి అందరూ పొరబడుతున్నారని, అందులో ఉన్న సమాచారం అసలు కరెక్ట్ కాదని తేల్చి చెప్పేసింది.
నా అసలు వయసు 25 ఏళ్లే:
తన గురించి వికీపీడియాలో వయసు మాత్రమే కాకుండా, పుట్టిన ప్రదేశం కూడా తప్పుగా రాశారని వైష్ణవి వెల్లడించింది. వికీపీడియాలో 1994లో పుట్టినట్లు, నేటివ్ ప్లేస్ కూడా తప్పు చూపిస్తుంది. కానీ, తన అసలు వయసు ప్రస్తుతం 25 ఏళ్లు మాత్రమేనని ఆమె స్పష్టం చేసింది. ఇకపై తన ఏజ్ గురించి ఎలాంటి తప్పుడు వార్తలు నమ్మవద్దని ప్రేక్షకులకు సున్నితంగా విజ్ఞప్తి చేసింది.
వైరల్ అవుతున్న పాడ్‌కాస్ట్ వీడియో:
వైష్ణవి తన వయసుపై ఇచ్చిన ఈ ఓపెన్ క్లారిటీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్లు వయసు దాచడానికి చూస్తుంటారు. కానీ వైష్ణవి మాత్రం నిజాయితీగా ఓపెన్ అయి తన అసలు ఏజ్ చెప్పేయడంతో నెటిజన్లు ఆమె బోల్డ్ నెస్ మరియు సింప్లిసిటీని తెగ మెచ్చుకుంటున్నారు.
ఇక ఏదేమైనా గ్లామర్ ఫీల్డ్‌లో వయసు కంటే నటన, ఆకర్షణే ముఖ్యం. 'బేబి' సినిమాతో తనలోని నటిని నిరూపించుకుని, వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న వైష్ణవి చైతన్యకు వయసుతో పనిలేకుండా మంచి ఫ్యూచర్ ఉందనడంలో సందేహం లేదు. ఈ రూమర్స్‌కు చెక్ పడటంతో ఆమె ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
