Epicలో అసలు గేమ్ వైష్ణవిదేనా? రిస్క్ కాదా?
సినిమాలో వైష్ణవి చైతన్య తన పార్టనర్ తో కలిసి జీవించేందుకు వెళ్లిన తర్వాత వారి రిలేషన్ లో ఎదురయ్యే పరిస్థితులు, సమస్యల చుట్టూ కథ సాగుతుందని ప్రచారం జరుగుతోంది.
By: M Prashanth | 10 Sept 2026 11:20 AM ISTవైష్ణవి చైతన్య.. బేబీ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న యంగ్ హీరోయిన్. ఆ సినిమాలో ఆమె పోషించిన రోల్ పై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. అయినా వాటిని పట్టించుకోకుండా వరుసగా డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇప్పుడు ఆనంద్ దేవరకొండతో కలిసి నటించిన Epicతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈసారి కూడా వైష్ణవి ఎంచుకున్న పాత్రే సినిమాకు మెయిన్ స్ట్రెంత్ కానుందా? లేక మరోసారి హాట్ టాపిక్ గా మారనుందా? అన్నది ఆసక్తిగా మారింది.
అయితే వైష్ణవి చైతన్య పేరు వినగానే బేబీలో ఆమె చేసిన రోల్ గుర్తుకు వస్తుంది. ఆ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అదే సమయంలో ఆ రోల్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. ఒక హీరోయిన్ గా సేఫ్ గా ఉండే రోల్ కాకుండా.. ప్రేక్షకుల్లో ప్రశ్నలు రేకెత్తించే క్యారెక్టర్ ను చేయడంతో వైష్ణవి పేరు మరింతగా వినిపించింది. ఇప్పుడు ఎపిక్ లో కూడా ఆమె రోల్ విషయంలో అదే హైప్ కనిపిస్తోంది.
సినిమాలో వైష్ణవి చైతన్య తన పార్టనర్ తో కలిసి జీవించేందుకు వెళ్లిన తర్వాత వారి రిలేషన్ లో ఎదురయ్యే పరిస్థితులు, సమస్యల చుట్టూ కథ సాగుతుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఎపిక్ మూవీ స్టోరీ లైన్ చూస్తే ఇది నార్మల్ లవ్ స్టోరీలా అనిపించడం లేదు. ఎమోషన్స్, రిలేషన్ షిప్ కు సంబంధించిన ఎలిమెంట్స్ కీలకంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అందుకే ఎపిక్ లో వైష్ణవి క్యారెక్టర్ పై ఇంత చర్చ జరుగుతోంది. హీరోయిన్ అంటే సాంగ్స్, రొమాన్స్ కు మాత్రమే పరిమితమయ్యే పాత్ర కాకుండా.. కథను ముందుకు తీసుకెళ్లే క్యారెక్టర్ ను ఆమె సెలెక్ట్ చేసుకున్నారా? అన్న క్వశ్చన్ వినిపిస్తోంది. అదే నిజమైతే.. సినిమాలో ఆనంద్ దేవరకొండ హీరో అయినా, అసలు గేమ్ వైష్ణవి రోల్ చుట్టూనే తిరిగే అవకాశం ఉంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు ఆదిత్య హాసన్ చేసిన కామెంట్స్ ఆ క్యూరియాసిటీని మరింత పెంచాయి.
వైష్ణవిని ఆన్ లైన్ ట్రోలింగ్ నుంచి తాను కాపాడతానని ఆయన చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఇలాంటి ప్రస్తావన రావడం రేర్. మరి వైష్ణవి పాత్రలో అంతగా చర్చకు దారితీసే అంశం ఏముంది? ప్రేక్షకులు ఆ క్యారెక్టర్ ను ఎలా తీసుకుంటారనే విషయం దర్శకుడికి ముందే తెలుసా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే వైష్ణవి మాత్రం ఇలాంటి పాత్రల విషయంలో వెనక్కి తగ్గడం లేదనే విషయం క్లియర్ గా కనిపిస్తోంది.
బేబీ తర్వాత తనకు వచ్చిన ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని సేఫ్ రోల్స్ ఎంచుకోవడం కంటే.. కథలో తన క్యారెక్టర్ కు ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూస్తున్నట్టుగా ఉంది. ఏదేమైనా ఇప్పుడు సినిమా రిలీజ్ కు ముందే ఎక్కువగా వినిపిస్తున్న పేరు మాత్రం వైష్ణవిదే. ఆమె రోల్ సినిమాకు హైలైట్ అవుతుందా? మరోసారి ప్రేక్షకులను మెప్పిస్తుందా? లేక ఈసారి ఆమె తీసుకున్న రిస్క్ బెడిసికొడుతుందా? అన్నది వేచి చూడాలి.
