దేవరకొండ ఫ్యామిలీలోకి కోడలిగా మరో హీరోయిన్?
మరికొన్ని క్రేజీ ప్రశ్నలకు వైష్ణవి ఇచ్చిన సమాధానాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఐకానిక్ సినిమాలు ‘బేబీ’ లేదా ‘అర్జున్ రెడ్డి’లలో ఏది ఇష్టం అనగ్గా.. తన కెరీర్‌ను మలుపు తిప్పిన ‘బేబీ’ మూవీనే ఎంచుకుంది.
By: Madhu Reddy | 1 Sept 2026 4:15 PM ISTయూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్ ప్రారంభించి 'బేబీ' సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిన వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండతో కలిసి నటించిన ‘ఎపిక్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రమోషనల్ రాపిడ్ ఫైర్ సెషన్‌లో వైష్ణవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సిద్ధు జొన్నలగడ్డను లవ్ చేస్తానని, ఆనంద్ దేవరకొండను పెళ్లి చేసుకుంటానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఆ విశేషాలు చూద్దాం..
రాపిడ్ ఫైర్‌లో వైష్ణవి సంచలన సమాధానాలు:
‘ఎపిక్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా యాంకర్ వైష్ణవికి ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. సిద్ధు జొన్నలగడ్డ, విరాజ్, ఆనంద్ దేవరకొండ.. ఈ ముగ్గురిలో ఎవరితో లవ్, ఎవరితో పెళ్లి, ఎవరికి బ్రేకప్ చెప్తారని అడిగారు. ఇక దీనికి వైష్ణవి ఏమాత్రం తడబడకుండా విరాజ్‌కి బ్రేకప్ చెప్పేస్తానని, సిద్ధు జొన్నలగడ్డతో లవ్ అని, ఆనంద్ దేవరకొండను మాత్రం పెళ్లి చేసుకుంటానని సరదాగా సమాధానమిచ్చింది. దీంతో ఈ కామెంట్స్ నెట్టింట ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.
ఫన్నీ క్వశ్చన్స్ – వైష్ణవి ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్:
ఈ రాపిడ్ ఫైర్ సెషన్‌లో యాంకర్ అడిగిన మరికొన్ని పర్సనల్ ప్రశ్నలకు వైష్ణవి చాలా బోల్డ్‌గా, ఫన్నీగా సమాధానాలు ఇచ్చారు. డే ఆర్ నైట్ అంటే రెండూ ఇష్టమేనని, మేకప్ కంటే వితౌట్ మేకప్‌లోనే ఉండటానికి ప్రాధాన్యమిస్తానని చెప్పారు. ఇక వెజ్ అండ్ నాన్ వెజ్ రెండూ తింటానని, లవ్ మ్యారేజ్ లేదా అరేంజ్డ్ మ్యారేజ్ అంటే కన్ఫర్మ్‌గా లవ్ మ్యారేజ్ చేసుకోడానికే మొగ్గు చూపుతానని మనసులోని మాట బయటపెట్టారు.
బేబీ vs అర్జున్ రెడ్డి, బెడ్‌రూమ్ vs బాల్కనీ:
మరికొన్ని క్రేజీ ప్రశ్నలకు వైష్ణవి ఇచ్చిన సమాధానాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఐకానిక్ సినిమాలు ‘బేబీ’ లేదా ‘అర్జున్ రెడ్డి’లలో ఏది ఇష్టం అనగ్గా.. తన కెరీర్‌ను మలుపు తిప్పిన ‘బేబీ’ మూవీనే ఎంచుకుంది. ఇక ‘బెడ్‌రూమ్ లేదా బాల్కనీ’ అనే ఫన్నీ ప్రశ్నకు ఏమాత్రం సంకోచించకుండా ‘బాల్కనీ’ అని నవ్వుతూ ఆన్సర్ ఇచ్చి అలరించింది.
'ఎపిక్' సినిమా ప్రమోషన్స్ అండ్ రిలీజ్ డేట్:
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘ఎపిక్’ చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'బేబీ' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ అంచనాలను పెట్టుకుంది. ఇక ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేయడంతో మూవీ టీమ్ ఎంతో నమ్మకంగా ఉంది.
ప్రమోషన్ల వేళ వైష్ణవి చైతన్య ఇచ్చిన ఈ సరదా సమాధానాలు యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తనదైన చమత్కారంతో, ఓపెన్ టాక్‌తో నెటిజన్లను అలరించిన వైష్ణవి, రాబోయే ‘ఎపిక్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.
