'క' బోయ్స్ తో మెగా మేనల్లుడా?
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నుంచి సినిమా రిలీజ్ అయి రెండేళ్లు అవుతుంది. `ఆదికేశవ` తర్వాత ఇంత వరకూ కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టలేదు.
By: Srikanth Kontham | 4 Oct 2025 10:00 PM ISTమెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నుంచి సినిమా రిలీజ్ అయి రెండేళ్లు అవుతుంది. `ఆదికేశవ` తర్వాత ఇంత వరకూ కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టలేదు. వస్తే హిట్ కంటెంట్ తోనే రావాలి అన్న కసితో రెండేళ్లగా కథ కోసమే వెయిట్ చేస్తున్నాడు. ఈ గ్యాప్ లో చాలా కథలు విన్నాడు. కానీ ఏవీ నచ్చలేదు. ఈ నేపథ్యంలో `క` ద్వయం వైష్ణవ్ ని మెప్పించినట్లు ఫిలిం సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. సుజిత్-సుదీప్ ద్వయం `క`తో దర్శకులుగా పరిచయమైన సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ లోనే `క` రిలీజ్ అయింది.
ఆ తర్వాత మళ్లీ దర్శక ద్వయం ఇంత వరకూ మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కించలేదు. పలువురు యువ హీరోలకు కథలు చెప్పినట్లు ప్రచారం జరిగింది గానీ, ఏదీ ఒకే అయిన్లట్లు లేదు. తాజాగా వైష్ణవ్ తేజ్ మాత్రం సుజిత్- సుదీప్ కథను ఒకే చేసినట్లు వినిపిస్తోంది. ఇది ఓ సస్పెన్స్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సబ్జెక్ట్ అని తెలిసింది. నెల రోజుల క్రితమే వైష్ణవ్ తేజ్ కి స్టోరీ చెప్పడం..ఆయన ఒకే చెప్పడం జరిగిందంటున్నారు. మరి ఈ ప్రచారంలో నిజా నిజాలు తేలాల్సి ఉంది. `క` తో సుజిత్-సుదీప్ లకు మంచి పేరొచ్చింది. ఆ సినిమాకు వాళ్లే రచయితలగానూ పని చేసారు.
తొలి సినిమాతోనే దర్శక-రచన విభాగంలో అదరగొట్టారు. కుర్రాళ్లైనా ఎంతో సీనియర్స్ లో ఆ సినిమాను డైరెక్ట్ చేసారు. చివరి వరకూ సస్పెన్స్ మెయింటెన్ చేస్తూ ఓకే టెంపోలో చిత్రాన్ని తీసుకెళ్లి సీట్ లోప్రేక్షకుడిని ఎడ్జ్ న కూర్చోబెట్టారు. దీంతో సుజిత్-సుదీప్ ల సక్సెస్ ఆనాడే డిసైడ్ అయింది. ఆ విజయం అనంతరం చాలా మంది యంగ్ హీరోలు కథలు చెప్పమని ఆఫర్ చేసారు. నిర్మాతలు అడ్వాన్సులు ఇచ్చే ప్రయత్నం చేసారు. కానీ ఎక్కడా కమిట్ అవ్వకుండా సరైన కథ సిద్దమైన తర్వాతే ముందుకు రావాలని ఇంతకాలం వెయిట్ చేసారు.
ఇప్పుడా సమయం ఆసన్నమైంది. మెగా ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారికంగా విషయం తెలియాల్సి ఉంది. వైష్ణవ్ తేజ్ ఈ మధ్య మీడియా కంటబడిన సంగతి తెలిసిందే. `ఓజీ` రిలీజ్..సక్సెస్ లో భాగంగా మెగా ఫ్యామిలీ అంతా హాజరవ్వడంతో వైష్ణవ్ కూడా అటెండ్ అయ్యాడు. ఆ సమయంలో సినిమా ఎప్పుడు చేస్తున్నారు? అనే ప్రశ్న ఉత్పన్నమైంది . కానీ విషయాన్ని గోప్యంగా ఉంచాడు. అదీ సంగతి.
