మెగా 'హను-మాన్' సీక్వెల్ కొత్త అప్డేట్!
'హనుమాన్ 2'లో మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించనున్నారు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. భారీ వీఎఫ్‌ఎక్స్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2027లో మొదలై, 2028లో విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వానర జాతి ఉత్థానం నేపథ్యంలో కథ సాగనుంది.
By: Ramesh Palla | 28 Nov 2026 10:40 AM IST2024 సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'హను-మాన్' సినిమాకు ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్' ను రూపొందిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. వచ్చే ఏడాది ఏ సమయంలో అయినా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల హను-మాన్ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి మరో సీక్వెల్‌ను ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేశాడు. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో 'హను-మాన్ 2' సినిమాను నిర్మించబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. వైష్ణవ్ తేజ్ తో అనగానే అంచనాలు పెరిగాయి. మొదటి పార్ట్ కథతో సంబంధం లేకుండా రెండో పార్ట్ ఉంటుందని, హను-మాన్ 2 అనే టైటిల్‌తో రాబోతున్న నేపథ్యంలో కచ్చితంగా పాజిటివ్ రెస్పాన్స్ దక్కడం ఖాయం అని అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల వారు బలంగా నమ్ముతున్నారు.
హనుమాన్ సీక్వెల్ వర్క్...
హనుమాన్ సీక్వెల్‌ను ప్రకటించి వారం రోజులు అవుతున్న నేపథ్యంలో అసలేం జరుగుతుంది అనే చర్చ మొదలైంది. ప్రకటన వరకే పరిమితం అయ్యారా, నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ సీక్వెల్‌పై సీరియస్‌గానే ఉన్నారా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆఫీస్ ఓపెన్ చేసి సినిమా స్క్రిప్ట్ ఫైనల్ వర్క్‌ను మొదలు పెట్టారని తెలుస్తోంది. ఈ సినిమాలో భారీ వీఎఫ్‌ఎక్స్‌కు ఛాన్స్ ఉంటుందట. అందుకే ప్రీ విజువలైజేషన్ కోసం కనీసం మూడు నెలల సమయం పడుతుందని, అంతే కాకుండా సీన్స్ ను పెద్ద ఎత్తున స్కెచ్‌లుగా వేయాల్సి ఉంటుందని అంటున్నారు. దాదాపు ఇరవై మంది ఈ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో భాగస్వామ్యం అవుతున్నారని కూడా ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
వైష్ణవ్ తేజ్ హీరోగా...
వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాడనే విశ్వాసంను మెగా ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఉప్పెన తర్వాత ఆయన చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దాంతో కాస్త గ్యాప్ తీసుకున్నాడు. మూడు ఏళ్ల తర్వాత వైష్ణవ్ తేజ్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ మూడు ఏళ్ల కాలంలో వైష్ణవ్ తేజ్ చాలా కథలు విని ఉంటాడు. చివరకు ఈ కథకు ఓకే చెప్పాడు అంటే ఎంత బలమైన కథనో అర్థం చేసుకోవచ్చు. పైగా హిట్ మూవీ సీక్వెల్ కావడంతోనూ ఆయన ఓకే చెప్పి ఉంటాడు. వైష్ణవ్ తేజ్‌కు ఓ సూపర్ హిట్ కావాల్సి ఉంది. అంతే కాకుండా నిర్మాత నిరంజన్ రెడ్డి సైతం పంతంతో ఈ సీక్వెల్‌ను చేస్తున్నాడు. కనుక ఈ సినిమా అందరికీ అత్యంత కీలకంగా మారింది. కనుక దర్శకుడు వీఐ ఆనంద్ ఎలా తెరకెక్కిస్తాడు, ఏ రేంజ్‌లో సినిమా ఉంటుంది అనేది చూడాలి.
జై హనుమాన్ సినిమా షూటింగ్..
ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ అనుసారం ఈ హనుమాన్ సీక్వెల్‌కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను వచ్చే ఏడాది ప్రారంభించి, 2028లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. వీఐ ఆనంద్ ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమా దేనికి అదే అన్నట్టుగా విభిన్నంగా ఉంటూ వచ్చింది. మొదటి పార్ట్ కథతో సంబంధం లేకుండా, ప్రశాంత్ వర్మతో కాపీరైట్ ఇష్యూ లేకుండా వానర జాతి ఉత్థానం కాన్సెప్ట్‌తో సినిమాను రూపొందించబోతున్నాడు. కాన్సెప్ట్ చాలా విభిన్నంగా ఉంటుందని, వైష్ణవ్ తేజ్ అందరినీ సర్‌ప్రైజ్ చేసే విధంగా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సీక్వెల్‌లో తేజ సజ్జా నటించే అవకాశం ఉందా అంటే అనుమానమే అంటున్నారు. జై హనుమాన్ విడుదల తర్వాత చాలా కాలంకు విడుదల కాబోతున్న హనుమాన్ 2 ఎలాంటి రచ్చ చేస్తుంది, ఏది నిజమైన సీక్వెల్‌గా నిలుస్తుంది అనేది కాలమే నిర్ణయించాలి.
