Begin typing your search above and press return to search.

100 కోట్ల హిట్టు కొట్టినా.. ఇంత గ్యాప్ ఎందుకు?

హీరోగా మొదటి సినిమాతోనే రూ.100 కోట్ల రేంజ్ హిట్ వస్తే కెరీర్ సెట్ అయిపోయినట్టే అనిపిస్తుంది. పైగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అయితే అవకాశాలకు కూడా కొదవ ఉండదు.

By:  M Prashanth   |   1 Oct 2026 9:00 PM IST
100 కోట్ల హిట్టు కొట్టినా.. ఇంత గ్యాప్ ఎందుకు?
X

హీరోగా మొదటి సినిమాతోనే రూ.100 కోట్ల రేంజ్ హిట్ వస్తే కెరీర్ సెట్ అయిపోయినట్టే అనిపిస్తుంది. పైగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అయితే అవకాశాలకు కూడా కొదవ ఉండదు. కానీ వైష్ణవ్ తేజ్ విషయంలో మాత్రం మూమెంట్ మరోలా తిరిగింది. ఉప్పెనతో భారీ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఇప్పుడు కొత్త సినిమా లేక మూడేళ్ల గ్యాప్ తీసుకునే పరిస్థితికి వచ్చారు.

ఉప్పెన తర్వాత వచ్చిన కొండపొలం పూర్తిగా వేరే ప్రయత్నం. ఆ తర్వాత రంగ రంగ వైభవంగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చింది. ఆదికేశవతో మాస్ యాక్షన్ వైపు వెళ్లారు. మూడు సినిమాలు మూడు రకాలుగా చేసినా ఒక్కటీ ఉప్పెన తర్వాత వచ్చిన అంచనాలకు దగ్గరగా వెళ్లలేదు. మ్యాటర్ అవకాశాలు లేకపోవడం కాదు.. ఏ కథ తనకు సెట్ అవుతుందన్నదే ఆలస్యంగా మారింది.

మెగా బ్రాండ్ వల్ల దర్శకులు, నిర్మాతలు కథలు తీసుకురావచ్చు. కానీ ఇప్పుడు ఆ ఒక్క ట్యాగ్‌తో ఆడియన్స్ థియేటర్‌కు వచ్చే పరిస్థితి లేదు. పెద్ద స్టార్ హీరోల సినిమాలకే టాక్ తేడా కొడితే రెండో రోజు నుంచే డ్రాప్స్ కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు నాలుగు సినిమాల అనుభవం ఉన్న హీరోకు కేవలం కాంబినేషన్ చూసి సినిమా ఓకే చేయడం ఇంకా పెద్ద రిస్క్.

అందుకే ఆదికేశవ తర్వాత వైష్ణవ్ స్పీడ్ తగ్గించినట్లు కనిపిస్తోంది. ఒక సినిమా త్వరగా మొదలుపెట్టి మళ్లీ అదే ఫలితం ఎదుర్కోవడం కంటే, తనకు సెట్ అయ్యే కథ కోసం వెయిట్ చేయడమే బెటర్ అనుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ ఉంది. పరశురామ్, ప్రవీణ్ సత్తారు కథలు కూడా ఈ క్రమంలోనే ఆయన దగ్గరకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక్కడ ఉప్పెన హిట్ కూడా ఒకరకంగా వైష్ణవ్‌కు ప్రెషర్ పెంచింది. మొదటి సినిమాతోనే వచ్చిన నెంబర్ తర్వాత ప్రతి సినిమాను అదే స్థాయితో పోల్చారు. కొత్త హీరోగా నెమ్మదిగా మార్కెట్ పెంచుకునే టైమ్ కూడా దొరకలేదు. రెండో సినిమా నుంచే “ఉప్పెన తర్వాత ఏం చేశాడు?” అనే ప్రశ్న వెంటపడింది. ఇప్పుడు వైష్ణవ్‌కు మరో సినిమా చేయడం కంటే, సరైన సినిమా చేయడమే ముఖ్యం. మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత వచ్చే ప్రాజెక్ట్ కూడా పని చేయకపోతే మళ్లీ మొదటి నుంచి మార్కెట్ పట్టుకోవాల్సి ఉంటుంది.