వాళ్లతో యమా డేంజర్ అనేసిన నటి!
వాబిజ్ దొరబ్జీ పరిచయం అవసరంలేని పేరు. బుల్లి తెరపై అమ్మడు ఎంతో ఫేమస్. కానీ అమ్మడి వ్యక్తిగత జీవితం మాత్రం గందరగోళంగా ఉంది.
By: Srikanth Kontham | 15 Nov 2025 8:00 PM ISTవాబిజ్ దొరబ్జీ పరిచయం అవసరంలేని పేరు. బుల్లి తెరపై అమ్మడు ఎంతో ఫేమస్. కానీ అమ్మడి వ్యక్తిగత జీవితం మాత్రం గందరగోళంగా ఉంది. కొంత కాలంగా సింగిల్ గానే ఉంటుంది. 2013 లో నటుడు వివియన్ డిసేనతో పెళ్లయింది. కానీ ఆ కాపురం ఎంతో కాలం నిలవలేదు. విడాకుల అనంతరం ట్రోలింగ్ బారిన పడింది. డబ్బు కోసమే విడాకులు తీసుకుంటుందని నెట్టింట టార్గెట్ అయింది. ఇప్పటికీ ఆ కామెంట్లు ఎదుర్కుంటూనే ఉంది. ఈ విమర్శల నేపథ్యంలో వాబిజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `వివాహం తర్వాత ఏ నటి అయినా తన భర్త వద్ద ఆర్దిక భద్రత ఉందా? లేదా? అన్నది చూస్తుంది.
అంత మాత్రాన తాను గోల్డ్ డిగ్గర్ అని ఎలా విమర్శిస్తారంది. గోల్డ్ డిగ్గర్ అంటే ఎలా? (డబ్బు కోసమే పురుషులతో సంబంధం పెట్టుకోవడం). నిజానికి ఇప్పుడు మగవాళ్లు చాలా అదృష్టవంతులు. మహిళలు కూడా ఇప్పుడు బాగా సంపాదిస్తున్నారు. మగాడితో సమానంగా జీతభత్యాలు అందుకుంటున్నారు. అందులో ఎలాంటి చెడు కనిపంచలేదు. లైఫ్ పార్టనర్ వద్ద స్థిరత్వాన్ని, ఆర్దిక భద్రత కోరుకోవడం తప్పేం కాదు. గోల్డ్ డిగ్గర్ అంటున్నారంటే ఆ పదం అర్దం తెలియకనే అనుకుంటున్నా. ఈరోజుల్లో చాలా మంది మగవాళ్లు ఆడవారి గురించి తెలుసుకుని చక్కగా మసులుకుంటున్నారు.
వారికి అవసరమైనప్పుడల్లా బాగా మాట్లాడి తెలివిగా డబ్బు లాగుతున్నారు. వాళ్లే అసలైన గోల్డ్ డిగ్గర్స్. వాళ్లతో మహిళలు జాగ్రత్తగా లేకపోతే మంచిగా మాట్లాడి నిలువు దోపిడీ చేసేస్తారు. ఇలాంటి వాళ్లను నేను చాలా మందిని చూసాను. నా దగ్గర డబ్బు కొట్టేయాలని చాలా మంది చూసారు. కానీ అలాంటి వారిని కనిపెట్టగలిగే సత్తా ఉన్న దాన్ని. నా దగ్గర నుంచి డబ్బు కొట్టాలంటే నన్ను మించిన తెలివి తేటలుండాలి. ఒకరు నాతో ఎమోషనల్ డ్రామా ఆడి డబ్బు కాజేయాలని చూసాడు. నా ఇంటిని కూడా లాక్కోవాలని చూసాడు. కానీ అతని వద్ద నుంచి తెలివిగా తప్పించుకోగలిగాను అంది.
వాబిజ్ దొరబ్జి `ప్యార్ కీ యే ఏక్ కహానీ`, `సావిత్రి`, `సరస్వతిచంద్ర`, `బాహు మహారీ రజనీకాంత్`, `దివానియత్` వంటి సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్ లో ఛాన్సుల కోసం ఎదురు చూస్తోంది. కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తోంది గానీ పనవ్వడం లేదు. దీంతో ఈ మధ్య కాలంలో తెలుగు ప్రయత్నాలు కూడా మొ దలు పెట్టినట్లు ప్రచారంలోకి వచ్చింది. కానీ ఇక్కడ అమ్మడు అంత సీరియస్ గా అయితే ట్రయల్స్ వేసినట్లు కనిపించలేదు.
