Begin typing your search above and press return to search.

వడ్డే నవీన్ రీఎంట్రీ.. గ్యాప్ ఫిల్ చేసుకోవడం ఈజీనా?

ఒకప్పుడు ఫ్యామిలీ స్టోరీస్ తో రూపొందిన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో వడ్డే నవీన్ ఇప్పుడు మళ్లీ తన లక్ ని టెస్ట్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

By:  M Prashanth   |   19 Jun 2026 12:16 AM IST
వడ్డే నవీన్ రీఎంట్రీ.. గ్యాప్ ఫిల్ చేసుకోవడం ఈజీనా?
X

ఒకప్పుడు ఫ్యామిలీ స్టోరీస్ తో రూపొందిన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో వడ్డే నవీన్ ఇప్పుడు మళ్లీ తన లక్ ని టెస్ట్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు పదేళ్ల బ్రేక్ తర్వాత ఆయన నటించిన ట్రాన్స్‌ ఫర్ త్రిమూర్తులు మూవీ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో నవీన్ రీఎంట్రీపై ఆసక్తికర చర్చ సాగుతోంది. నవీన్ తీసుకున్న లాంగ్ గ్యాప్ చేసుకోవడం ఈజీనా అనే డిస్కషన్ నడుస్తోంది.

అయితే నవీన్ కెరీర్‌ చూసుకుంటే.. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో మంచి విజయాలు అందుకున్న ఆయనకు లేడీ ఆడియన్స్ సపోర్ట్ కూడా గట్టిగానే ఉండేది. వరుస విజయాలతో స్టార్ హీరోల సరసన నిలిచిన నవీన్ తర్వాత కాలంలో సరైన విజయాలు అందుకోలేకపోయారు. కొన్ని సినిమాలు ఆశించిన రిజల్ట్స్ ఇవ్వకపోవడంతో ఆయన కెరీర్ స్లో అయింది.

మధ్యలో కొన్ని సినిమాల్లో కనిపించినప్పటికీ మళ్లీ తన పాత రేంజ్ కు చేరుకోలేకపోయారు. దీంతో కొంత కాలం సినిమాలకు దూరమయ్యారు. ఆ బ్రేక్ పదేళ్లకు చేరుకోవడం విశేషం. ఇప్పుడు అదే గ్యాప్ తర్వాత ఆయన ట్రాన్స్‌ ఫర్ త్రిమూర్తులు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ కమల్ తేజ నార్ల దర్శకత్వం వహించారు. నవీన్ సరసన రాశీ సింగ్ హీరోయిన్‌ గా నటించింది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌, ట్రైలర్ సినిమాపై కొంత ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా నవీన్ లుక్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకాలం తర్వాత కూడా ఆయన లుక్ లో పెద్దగా ఛేంజ్ కనిపించకపోవడం అట్రాక్ట్ చేస్తోంది. సినిమా ప్రమోషన్లలో కూడా నవీన్ చురుకుగా పాల్గొన్నారు. వరుస ఇంటర్వ్యూల ద్వారా ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యేలా చూస్తున్నారు. సినిమా కోసం ఎంతో కష్టపడ్డామని, అందరికీ నచ్చేలా చిత్రాన్ని రూపొందించామని చెబుతున్నారు.

అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గత పదేళ్లలో కొత్త తరం హీరోలు, దర్శకులు, కథల సెలక్షన్, ప్రేక్షకుల టేస్ట్ అన్నీ వేరే దిశలో ఉన్నాయి. సోషల్ మీడియా ప్రభావం పెరిగింది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కారణంగా ప్రేక్షకుల అభిరుచుల్లో కూడా చాలా మార్పు వచ్చింది. ఈ నేపథ్యంలో అప్పటి జనరేషన్ కు చెందిన హీరోగా నవీన్ మళ్లీ తన ప్లేస్ ను సంపాదించుకోవడం సవాల్‌ గా మారిందనే చెప్పాలి.

వచ్చిన గ్యాప్ ఫిల్ చేసుకోవడం కూడా అంత ఈజీ కాదని అభిప్రాయం వినిపిస్తోంది. అయితే రీ ఎంట్రీ సక్సెస్ కావాలంటే కేవలం గుర్తింపు సరిపోదు. ప్రేక్షకులను ఆకట్టుకునే కథలు, స్ట్రాంగ్ రోల్స్, వరుసగా మంచి సినిమాలు అవసరం. ఒక సినిమా విజయం వచ్చినా దాన్ని కొనసాగించడం కూడా అంతే కీలకం. అందుకే ట్రాన్స్‌ ఫర్ త్రిమూర్తులు రిజల్ట్ నవీన్ కెరీర్‌ కు కీలకంగా మారనుంది.

ఏదేమైనా వడ్డే నవీన్ తిరిగి సినిమాల్లోకి రావడం ఆయన అభిమానులకు హ్యపీనే. అయితే పదేళ్ల గ్యాప్‌ ను పూర్తిగా ఫిల్ చేసి మళ్లీ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలంటే ప్రేక్షకుల నుంచి స్ట్రాంగ్ రెస్పాన్స్ దక్కాల్సిందే. మరి ట్రాన్స్‌ ఫర్ త్రిమూర్తులు ఆ జర్నీకి ఫస్ట్ సక్సెస్ ఫుల్ స్టెప్ గా నిలుస్తుందా లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.