Begin typing your search above and press return to search.

వారణాసి కూడా రెండా.. అందుకేనా ఈ మార్పు!

ప్రపంచ సినిమా వేదికపై ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగుతోంది.. అదే 'వారణాసి'.

By:  M Prashanth   |   31 Jan 2026 12:03 PM IST
వారణాసి కూడా రెండా.. అందుకేనా ఈ మార్పు!
X

ప్రపంచ సినిమా వేదికపై ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగుతోంది.. అదే 'వారణాసి'. దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఈ పాన్ వరల్డ్ మూవీ గురించి వచ్చే ప్రతి చిన్న లీక్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లు అనేది ఈ సినిమాకు చాలా చిన్న నంబర్ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ గ్లోబల్ అడ్వెంచర్ కోసం మేకర్స్ ప్లాన్ చేస్తున్న ప్లానింగ్ చూస్తుంటే జక్కన్న మరోసారి ఇండియన్ సినిమా రూపురేఖలు మార్చబోతున్నారని స్పష్టమవుతోంది.

సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి దీని కథాంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక గతంలో రిలీజ్ చేసిన థీమ్ ట్రైలర్ తో ఒక క్లారిటీ వచ్చేసింది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్ డ్రామాలో రామాయణంకు సంబంధించిన సంబంధించిన ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పడంతో అంచనాలు హై లెవెల్ లో పెరిగాయి. అయితే రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ లో 'వారణాసి' రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి వినిపిస్తున్న ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఫిలిం నగర్ లో హాట్ టాపిక్‌గా మారింది.

అసలు విషయం ఏంటంటే వారణాసి సినిమాను రాజమౌళి రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. అంతేకాకుండా ఈ రెండు భాగాలకు రెండు వేర్వేరు టైటిల్స్ కూడా లాక్ చేసినట్లు సమాచారం. పార్ట్ 1 కి ‘వారణాసి: గ్లోబ్ ట్రాటర్’ అని, పార్ట్ 2 కి ‘వారణాసి: టైం ట్రాటర్’ అని పేర్లు పెట్టినట్లు ఒక వెర్షన్ వైరల్ అవుతోంది. గతంలో బాహుబలి సినిమాను కూడా రెండు భాగాలుగా తీసి సక్సెస్ కొట్టిన రాజమౌళి, ఇప్పుడు మహేష్ సినిమాకు కూడా అదే ఫార్ములా అప్లై చేస్తున్నట్లు తెలుస్తోంది.

మొన్న వచ్చిన అఫీషియల్ పోస్టర్ లో కేవలం 'వారణాసి: గ్లోబ్ ట్రాటర్' అని మాత్రమే ఉండటంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే దీనికంటే ముందు వచ్చిన టైటిల్ గ్లింప్స్ లో గ్లోబ్ ట్రాటర్ తో పాటు టైం ట్రాటర్ అనే పదాలు కూడా వినిపించాయి. దీంతో మొదటి భాగంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చే అడ్వెంచర్ చూపిస్తూ, రెండో భాగంలో కాల ప్రయాణం నేపథ్యంలో కథను నడిపించబోతున్నారని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గ్లోబ్ ట్రాటర్ నుండి టైం ట్రాటర్ గా కథ ఎలా మారుతుందనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్.

రాజమౌళి సినిమాల్లో ఎప్పుడూ ఒక ఎమోషనల్ కనెక్ట్ తో పాటు విజువల్ వండర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు టైటిల్స్ చూస్తుంటే వారణాసి ప్రాజెక్ట్ ఏ రేంజ్ లో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. టైం ట్రావెల్ ఎలిమెంట్ కనుక ఉంటే మహేష్ బాబును జక్కన్న రకరకాల కాలాల్లో ఎలా చూపిస్తారో అని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బడ్జెట్ పరంగా కూడా రెండు భాగాలకు కలిపి దాదాపు 1500 కోట్ల పైనే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇది నిజమైతే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం పక్కా.

ఏదేమైనా 'వారణాసి' చుట్టూ జరుగుతున్న ఈ టైటిల్స్ చర్చ సినిమాపై క్యూరియాసిటీని పీక్స్‌కి తీసుకెళ్లింది. మేకర్స్ నుండి దీనిపై ఇంకా అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉన్నా, లీక్ అయిన ఈ పేర్లు మాత్రం ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తున్నాయి. మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ కి రాజమౌళి విజన్ తోడైతే వెండితెరపై ఒక అద్భుతాన్ని చూడబోతున్నామని చెప్పడంలో సందేహం లేదు. ఈ 'గ్లోబ్ ట్రాటర్', 'టైం ట్రాటర్' మ్యాజిక్ ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.