200 కోట్లు కొట్టిన సినిమా.. ఇలా షాక్ ఇచ్చిదేంటి
మలయాళంలో సంచలన విజయాన్ని సాధించిన వాజా 2 సినిమా రీసెంట్ గా తెలుగులో వాలా 2 పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
By: M Prashanth | 27 April 2026 7:49 PM ISTమలయాళంలో సంచలన విజయాన్ని సాధించిన వాజా 2 సినిమా రీసెంట్ గా తెలుగులో వాలా 2 పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కడ ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజైన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. న్యూ ఏజ్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఆ సినిమా మాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ నేపథ్యంలోనే అదే చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి విడుదల చేశారు నిర్మాత సాహు గారపాటి. హషీర్, అలెన్, అజిన్, వినాయక్ లీడ్ రోల్స్ లో నటించగా, సావిన్ ఎస్.ఏ దర్శకత్వం వహించారు. మలయాళంలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పటినుంచో ఆదరిస్తున్న నేపథ్యంలో వాలా 2 కూడా అదే స్థాయిలో సక్సెస్ అవుతుందని నిర్మాతలు భావించారు.
అయితే పరిస్థితి మాత్రం వేరేగా కనిపిస్తోంది. మలయాళంలో ఇంకా ఆ సినిమా సూపర్ రన్ కొనసాగిస్తుండగా, తెలుగులో మాత్రం రెస్పాన్స్ నెమ్మదిగా ఉంది. ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. వీకెండ్ లో కూడా కలెక్షన్లు పెరుగుతాయన్న అంచనాలు నిజం కాలేదు. దీంతో ఎందుకు ఆ సినిమా తెలుగులో క్లిక్ అవ్వడం లేదని చర్చ జరుగుతోంది.
కొంతమంది మూవీ లవర్స్ ఐపీఎల్ ప్రభావమే కారణమని చెబుతున్నారు. మ్యాచ్లు ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిందని అభిప్రాయపడుతున్నారు. కానీ మ్యాచ్లు ఎక్కువగా సాయంత్రం వేళల్లో జరుగుతుండగా, మార్నింగ్ షోలకు కూడా పెద్దగా ప్రేక్షకులు రాకపోవడం గమనార్హం. కాబట్టి ఇది పూర్తిగా ఐపీఎల్ కారణం మాత్రమే కాదనే భావన వ్యక్తమవుతోంది.
ఇంకా ఒక ముఖ్య కారణం సినిమా రీచ్ అవ్వకపోవడమేనని మరికొందరు చెబుతున్నారు. వాలా 2 ఒక సీక్వెల్ కాగా, మొదటి భాగం తెలుగులో థియేటర్లలో విడుదల కాలేదు. అది ఓటీటీలో అందుబాటులో ఉన్నప్పటికీ, చాలా మందికి ఆ విషయం తెలియదు. దీంతో కథపై అవగాహన లేకుండా సీక్వెల్ చూడాలన్న ఆసక్తి ప్రేక్షకుల్లో తక్కువగా ఉంది. కానీ మలయాళ ప్రేక్షకులు కంటెంట్ ను బాగా ఆదరిస్తారని తెలిసిందే.
అక్కడ సినిమా సక్సెస్ అవ్వడం చూస్తే కచ్చితంగా స్ట్రాంగ్ కంటెంట్ ఉన్నట్టే. అయితే అదే కంటెంట్ తెలుగులో సరైన విధంగా చేరకపోవడం సమస్యగా మారింది. ప్రమోషన్స్ కూడా పెద్దగా హైప్ సృష్టించలేకపోయాయని చెప్పాలి. టైటిల్ కూడా కొంత మైనస్ అయ్యిందనే అభిప్రాయం వినిపిస్తోంది. వాలా 2 కన్నా ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టి ఉంటే బాగుండేదని పలువురు అంటున్నారు. ఏదేమైనా మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆ సినిమా తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన రాబట్టలేకపోతోంది. సరైన రీచ్ లేకపోవడం, ఫస్ట్ పార్ట్ పై అవగాహన లేకపోవడం వంటి అంశాలు మెయిన్ రీజన్స్ గా తెలుస్తోంది.
