Begin typing your search above and press return to search.

మ‌ల‌యాళ మూవీ తెలుగులోనూ మ్యాజిక్ చేస్తుందా?

గ‌త కొంత కాలంగా మల‌యాళ చిత్రాలు తెలుగులోనూ సూప‌ర్ హిట్‌లుగా నిలుస్తూ మంచి వ‌సూళ్ల‌ని రాబడుతున్నాయి.

By:  Ravindar Gorantla   |   21 April 2026 3:12 PM IST
మ‌ల‌యాళ మూవీ తెలుగులోనూ మ్యాజిక్ చేస్తుందా?
X

గ‌త కొంత కాలంగా మల‌యాళ చిత్రాలు తెలుగులోనూ సూప‌ర్ హిట్‌లుగా నిలుస్తూ మంచి వ‌సూళ్ల‌ని రాబడుతున్నాయి. ఆ మ‌ధ్య యూత్ కంటెంట్‌తో రూపొంది సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న మూవీ `ప్రేమ‌లు`. హైద‌రాబాద్‌లోనే అత్య‌ధిక భాగం షూటింగ్ చేసిన ఈ సినిమా మ‌ల‌యాళంతో పాటు తెలుగులోనూ బాక్సాఫీస్ వద్ద మంచి విజ‌యాన్ని సాధించి రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ఆ త‌రువాత వ‌చ్చిన మ‌ల‌యాళ సినిమాలు మంచి ఆద‌రణ పొంది సూప‌ర్ హిట్‌లు అనిపించుకున్నాయి.

2024లో విడుద‌లైన ఈ సినిమా రూ.3 కోట్ల‌తో తీస్తే రూ.136 క‌ట్లు రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది. ఆ త‌రువాత మ‌ల‌యాళం నుంచి వ‌చ్చిన `మంజిమ‌ల్ బాయ్స్‌` త‌దిత‌ర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజ‌యాల్ని సొంతం చేసుకున్నాయి. ఆ త‌రువాత మ‌ల‌యాళ చిత్రాలు తెలుగులో అనుకున్న‌ స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయాయి. ఈ నేప‌థ్యంలోనే విఉద‌ల‌వుతున్న యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ `వాలా 2`.

2024లో విడుద‌లైన `వాలా` అక్క‌డ సూప‌ర్ హిట్‌గా నిలిచి ద‌ర్శ‌కుడికి, ఇందులో న‌టించిన వారికి మంచి పేరు తెచ్చి పెట్టింది. దీనికి సీక్వెల్‌గా రూపొందిన సినిమా `వాలా 2`. ఏప్రిల్ 2న మ‌ల‌యాళంలో విడుద‌లైన ఈ సినిమా అక్క‌డి బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. అంతా కొత్త వాళ్ల‌తో విపిన్ షా నిర్మాణంలో స‌విన్ స రూపొందించిన ఈ సినిమా ప్ర‌స్తుతం మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో రికార్డులు సృష్టిస్తోంది. ఇప్ప‌టికే రూ.210 కోట్లు రాబ‌ట్టి చిన్న సినిమాల్లో పెద్ద విజయంగా మారింది.

ఇదే మూవీని తెలుగులో అదే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్‌కు ముందు నుంచే ఆస‌క్తిని రేకెత్తించిన ఈ సినిమా తెలుగులో ఏప్రిల్ 24న భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. ట్రైల‌ర్‌ని హీరో నాని విడుద‌ల చేయ‌గా అది ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. న‌లుగురు స్నేహితుల నేప‌థ్యంలో సాగు యూత్ ఫుల్ డ్రామా. యూత్ ఫుల్ ఫీల్ గుడ్ రొమాంటిక్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా తెలుగులో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌లుగా నిలిచిన `ప్రేమ‌లు, మంజిమ‌ల్ బ్యాయ్స్‌` వంటి చిత్రాలు విజ‌యం సాధించిన‌ట్టే స‌క్సెస్ అవుతుందా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇటీవ‌ల కాలేజీ వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో రూపొంది త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో విడుద‌లై విజ‌యం సాధించిన మూవీ `యూత్‌`. దీని త‌ర‌హాలోనే ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్న `వాలా 2` మ‌ల‌యాళంలో విజ‌యాన్ని సొంతం చేసుకుని రూ.200 కోట్లకు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన‌ట్టు తెలుగులోనూ మ్యాజిక్ చేస్తుందా? అన్న‌ది వేచి చూడాల్సిందే.