Begin typing your search above and press return to search.

దెబ్బ మీద దెబ్బ... పెద్ద హీరోకి తప్పని తిప్పలు

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు, స్టార్‌డం ఉన్న హీరో కార్తీ. ఈ ఏడాదిలో కార్తీ హీరోగా నటించిన ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు.

By:  Ramesh Palla   |   18 Nov 2025 4:00 PM IST
దెబ్బ మీద దెబ్బ... పెద్ద హీరోకి తప్పని తిప్పలు
X

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు, స్టార్‌డం ఉన్న హీరో కార్తీ. ఈ ఏడాదిలో కార్తీ హీరోగా నటించిన ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. గత ఏడాదిలో కార్తీ హీరోగా వచ్చిన మెయ్యజగన్ సినిమా తర్వాత అభిమానులు బ్యాక్‌ టు బ్యాక్ సినిమాల కోసం వెయిట్‌ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు హీరోగా నటించిన సినిమాను విడుదల చేయడంలో కార్తీ సఫలం కాలేదు. సాధారణంగానే కార్తీ సినిమాలు స్లోగా చేస్తాడు అనే టాక్‌ ఉంది. ఆయన నుంచి ఏడాదికి ఒకటి రెండు సినిమాలు వచ్చినా అభిమానులు అసంతృప్తిగానే ఉంటారు. అలాంటి కార్తీ సినిమా ఈ ఏడాదిలో ఒక్కటి కూడా విడుదల కాకపోవడంతో అభిమానులు తీవ్రంగా నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రారంభం అయి షూటింగ్‌ సైతం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న వా వాతియర్‌ సినిమా విడుదల విషయంలో గందరగోళం నెలకొంది.

కార్తీ హీరోగా కృతి శెట్టి హీరోయిన్‌గా మూవీ...

నలన్ కుమారస్వామి దర్శకత్వంలో రూపొందిన వా వాతియర్‌ సినిమాలో హీరోయిన్‌గా కృతి శెట్టి నటించింది. ఈ సినిమా ఆమెకు కూడా చాలా ముఖ్యమైనది. ఇప్పటికే టాలీవుడ్‌లో ఆమెకు ద్వారాలు మూసుకు పోయాయి. ఇలాంటి సమయంలో ఈమె తమిళ సినిమాలపై ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే కోలీవుడ్‌లో మూడు నాలుగు సినిమాలు వస్తాయని ఆమె ఆశ పడుతుంది. కానీ సినిమా మాత్రం విడుదలకు నోచుకోకుండా వాయిదా పడుతూ వస్తుంది. కార్తీ సినిమా అనగానే బయ్యర్లు ఆసక్తి చూపిస్తారు. మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయం ఉంటుంది. అయినా కూడా ఈ సినిమా ఓటీటీ ఇష్యూ కారణంగా వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. నిర్మాతకు, ఓటీటీ పాట్నర్‌ కి మధ్య ఒప్పందం విషయంలో విభేదాలు ఉన్నాయట, దానికి తోడు రేటు విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు.

వా వాతియర్‌ మూవీ రిలీజ్ ఎప్పుడు...

కార్తీ గత చిత్రాల ఫలితాలు, ఓటీటీలో ఆయన సినిమాలు ఆడిన తీరు నేపథ్యంలో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ పై వా వాతియర్ మూవీ ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనే విషయం లో క్లారిటీ లేదు. అందుకే సినిమాను కొనుగోలు చేసేందుకు ఒకటి రెండు ఓటీటీలు మినహా ఇతర ఓటీటీలు ఆసక్తి చూపించలేదట. ముందుకు వచ్చిన ఓటీటీలు సైతం చాలా తక్కువ మొత్తంను కోట్‌ చేస్తున్నాయని, ముఖ్యంగా నిర్మాత జ్ఞానవేల్‌ రాజా చెప్పిన డేట్‌ కు విడుదల చేస్తే మరీ తక్కువ అమౌంట్‌ను ఇస్తామని అంటున్నారట. దాంతో తప్పని పరిస్థితుల్లో సినిమాను ఓటీటీ మార్కెట్‌ కి అనుగుణంగా వాయిదా వేస్తు వస్తున్నట్లు తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి సినిమా యొక్క హడావిడి ఏమీ లేదు. దాంతో 2025 లో ఈ సినిమా ఉండక పోవచ్చు అనే అభిప్రాయం ఇప్పటికే వ్యక్తం అవుతోంది.

నలన్ కుమారస్వామి దర్శకత్వంలో సంతోష్‌ నారాయణన్‌ సంగీతం..

సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నలన్‌ కుమారస్వామి విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందించారని తెలుస్తోంది. కార్తీ అభిమానులతో పాటు, రెగ్యులర్‌ ప్రేక్షకులు సైతం వా వాతియర్‌ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో సినిమా గురించి పోస్ట్‌ లు పెడుతూ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం సినిమా పూర్తి అయ్యి చాలా రోజులు అవుతున్నా ఇప్పటి వరకు కనీసం విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి అనుకున్నప్పటికీ తీవ్రమైన పోటీ కారణంగా, ఓటీటీ సంస్థల సూచన మేరకు ఫిబ్రవరి కి రిలీజ్ డేట్‌ ను షిప్ట్‌ చేశారని తెలుస్తోంది. అందులో ఏ మాత్రం నిజం ఉంది అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే. ఈ సినిమాలో కార్తీ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు.