నేటితరానికి కూడా 'మహానాయక్' ఎందుకు మోస్ట్ రిలవెంట్?
1930లు, 40ల నాటి బెంగాలీ సినిమాను తన అద్భుతమైన నటన, హుందా అయిన రూపంతో శాసించిన ఉత్తమ్ కుమార్.. నేటి డిజిటల్ యుగంలోని యువతను కూడా ఆకట్టుకోగలరా?
By: Srikanth Kontham | 1 Oct 2026 2:00 PM ISTభారతీయ చలనచిత్ర చరిత్ర పుటల్లో చెరగని ముద్రతో `మహానాయక్` గా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న బెంగాలీ దిగ్గజ నటుడు ఉత్తమ్ కుమార్ శతజయంతి సందర్భం ఇటు సినీ పరిశ్రమలో, అటు అభిమానుల్లో ప్రత్యేక చర్చకు దారితీసింది. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ, సోషల్ మీడియా ట్రెండ్స్ మారుతున్నా నేటి జెన్-జీ యువతను ఈ లెజెండరీ నటుడు ఏ విధంగా ఆకట్టుకుంటున్నారు? ఆధునిక కాలంలోనూ ఆయన చిత్రాలు ఎందుకు అంతగా ప్రాసంగికత సంతరించుకుంటున్నాయి అనే కోణంలో ఓ కథనం సినీ ప్రియులను ఎంతగానో ఆలోచింపజేస్తోంది. తరాలు మారుతున్నా? అభిరుచులు మారుతున్నా? ఉత్తమ్ నటనలో సహజత్వం, అభినయంలోని జీవకళ ఏమాత్రం వాడిపోలేదు.
1930లు, 40ల నాటి బెంగాలీ సినిమాను తన అద్భుతమైన నటన, హుందా అయిన రూపంతో శాసించిన ఉత్తమ్ కుమార్.. నేటి డిజిటల్ యుగంలోని యువతను కూడా ఆకట్టుకోగలరా? అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పింది. సోషల్ మీడియా రీల్స్, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లోనూ ఆయన క్లాసిక్ సినిమాలు, నాటి రొమాంటిక్ సీన్లు నేటి తరానికి కొత్త అనుభూతిని పంచుతున్నాయి. ఆయన తెరపై ప్రదర్శించిన హావభావాలు, సహజమైన అభినయం నేటికీ సినిమా విద్యార్థులకు ఒక పాఠ్యపుస్తకంలా నిలుస్తున్నాయి.
నటి సుచిత్రా సేన్‌తో ఉత్తమ్ కుమార్ జోడీ బెంగాలీ తెరపై సృష్టించిన మ్యాజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ నాటి ప్రేక్షకులను ఏవిధంగా ఉర్రూతలూగించిందో? అదే స్థాయిలో నేటి యువతను కూడా కట్టిపడేస్తోంది. ప్రేమ, భావోద్వేగాలు, విరహం వంటి సున్నితమైన అంశాలను ఆయన పండించిన తీరు కాలంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. అందుకే నాటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు నేటికీ యూట్యూబ్ , డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో వీక్షిస్తున్నారు.
కేవలం రొమాంటిక్ హీరోగానే కాకుండా అన్ని రకాల పాత్రల్లోనూ ప్రతిభను చాటుకున్నారు ఉత్తమ్ కుమార్. `నాయక్` చిత్రంలో సత్యజిత్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రంలో ఆయన నటన ఒక సినిమా నటుడి అంతరంగాన్ని, భయాలను అద్దం పట్టింది. ఆ సినిమాలో ఉత్తమ్ కుమార్ పోషించిన సూపర్‌స్టార్ పాత్ర నేటి కాలంలోని సెలబ్రిటీలు ఎదుర్కొనే మానసిక ఒత్తిళ్లకు సరిగ్గా సరిపోతుంది. ఈ అంశమే నేటి జెన్-జీ ప్రేక్షకులను సైతం ఆ చిత్రంతో కనెక్ట్ అయ్యేలా చేస్తోంది.
పరిశ్రమలో బాక్సాఫీస్ విజయాలకు, స్టార్‌డమ్‌కు ఆద్యుడిగా నిలిచిన ఉత్తమ్ కుమార్ జీవనశైలి, ఆయన నటనపై చూపిన అంకితభావం నేటి యువ నటులకు ఆదర్శప్రాయం. ఎంతటి కష్టకాలంలోనైనా? కెమెరా ముందుకు వస్తే చాలు సమస్తాన్ని మరచిపోయి పాత్రలో లీనమయ్యే నిబద్ధత నేటితరం కళాకారులకు ఎప్పటికీ స్ఫూర్తిని ఇస్తుంది. అందుకే ఉత్తమ కుమార్ శతజయంతి వేడుకలు ఒక జ్ఞాపకంలా కాకుండా ఒక నటనాయుగానికి నివాళిగా ఘనంగా జరుగుతున్నాయి.
కాలం మారుతున్న కొద్దీ ఎంతోమంది నటులు వచ్చిపోతుంటారు. కానీ కొద్దిమంది మాత్రమే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఉత్తమ్ కుమార్ కేవలం నటుడు మాత్రమే కాదు. బెంగాలీ సంస్కృతికి, సినిమా కళకు ప్రతీక అని ఈ శతజయంతి సందర్భం మరోసారి నిరూపించింది. జెన్-జీ వంటి ఆధునిక తరాలు కూడా ఆయన సినిమాలను ఆస్వాదిస్తుండటం చూస్తుంటే.. `మహానాయక్` కీర్తికి ఎప్పటికీ మరణం లేదని స్పష్టమవుతోంది.
