Begin typing your search above and press return to search.

ఉస్తాద్ లో స్పెషల్ సాంగ్.. థియేటర్లలో బిగ్ సర్ప్రైజ్ అంట..

అయితే ఆ పాటను ముందుగానే విడుదల చేయబోమని స్పష్టం చేశారు. అది థియేటర్లలో సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్‌ గా ఉంటుందని తెలిపారు.

By:  M Prashanth   |   14 March 2026 11:00 PM IST
ఉస్తాద్ లో స్పెషల్ సాంగ్.. థియేటర్లలో బిగ్ సర్ప్రైజ్ అంట..
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ సినిమా గురించి తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాలో ఉండే పాటలు, సర్ప్రైజ్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

'ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి రెండు పాటలు ఇప్పటికే విడుదలయ్యాయి. మరో పాట త్వరలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమాలో ఇంకా ఏమైనా సాంగ్స్ ఉన్నాయా?' అని ఇంటర్వ్యూలో హోస్ట్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన హరీష్ శంకర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. మూవీలో ఒక ప్రత్యేకమైన మాంటేజ్ సాంగ్ ఉందని ఆయన వెల్లడించారు.

అయితే ఆ పాటను ముందుగానే విడుదల చేయబోమని స్పష్టం చేశారు. అది థియేటర్లలో సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్‌ గా ఉంటుందని తెలిపారు. ఆ సాంగ్ సినిమాకు హైలైట్ అవుతుందని హరీష్ శంకర్ చెప్పారు. 'ఆ మాంటేజ్ సాంగ్‌ ను ప్రేక్షకులు డైరెక్ట్ గా సిల్వర్ స్క్రీన్ పై చూస్తారు. అది సినిమాకే పెద్ద సర్ప్రైజ్‌ గా ఉంటుంది' అని తెలిపారు.

'సినిమాలో మాక్సిమమ్ సర్ప్రైజ్ ఎలిమెంట్ అదే. ఇప్పుడే దాని గురించి ఎక్కువగా చెప్పలేను' అని ఆయన పేర్కొన్నారు. దీంతో ఆ పాట గురించి అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. అంతేకాకుండా ఆ సాంగ్ డ్యాన్స్ ఓరియెంటెడ్‌ గా ఉంటుందా? లేక కథకు సంబంధించిన భావోద్వేగ సన్నివేశాలపై ఆధారపడి ఉంటుందా? అనే విషయాన్ని ఇప్పుడే వెల్లడించలేనని హరీష్ శంకర్ తెలిపారు.

అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో ఆ సాంగ్ గురించి చిన్న హింట్ ఇస్తానని మాత్రం చెప్పారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి కూడా హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. ఆ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తప్పకుండా హాజరవుతారని చెప్పారు. దీంతో ఆ ఈవెంట్‌ పై కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్ పాల్గొనే ఈవెంట్ కావడంతో భారీ స్థాయిలో అభిమానులు హాజరవుతారని భావిస్తున్నారు.

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఇప్పటికే అనేక చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సినిమా కథ, యాక్షన్ సీక్వెన్సులు, పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉండబోతున్నాయోనని ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. దానికి తోడు దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌ లో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ మంచి విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఉస్తాద్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో హరీష్ శంకర్ చెప్పిన మాంటేజ్ సర్ప్రైజ్ సాంగ్ విషయం చర్చనీయాంశంగా మారింది. మరి థియేటర్స్ లో సినిమా విడుదలయ్యాక ఆ పాట ఎలా ఉండబోతుందో చూడాలి.