Begin typing your search above and press return to search.

హ‌రీష్ శంక‌ర్‌ని ఫాలో అవుతున్న స్టైలిష్ డైరెక్ట‌ర్‌!

సైరా న‌ర‌సింహారెడ్డి, ఏజెంట్ సినిమాల‌తో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్ని ఎదుర్కొన్న సురేంద‌ర్‌రెడ్డి గ‌త రెండు మూడేళ్లుగా ఈ ప్రాజెక్ట్ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాడు.

By:  Ravindar Gorantla   |   21 Feb 2026 7:00 AM IST
హ‌రీష్ శంక‌ర్‌ని ఫాలో అవుతున్న స్టైలిష్ డైరెక్ట‌ర్‌!
X

ప‌వ‌ర్‌స్టార్ ని ప‌వ‌ర్ ఫుల్ క్యారెక్ట‌ర్‌లో చూపించ‌డ‌మే కాకుండా క్యారెక్ట‌ర్ డ్రైవెన్ సినిమాగా `గ‌బ్బ‌ర్‌సింగ్‌`ని రూపొందించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని అందించ‌డం తెలిసిందే. దాదాపు ప‌దేళ్ల విరామం త‌రువాత ప‌వ‌న్ కు ఈ మూవీ ద్వారా బ్లాక్ బ‌స్ట‌ర్ ద‌క్క‌డంతో ఫ్యాన్స్ పండ‌గ చేసుకున్నారు. హ‌రీష్ శంక‌ర్‌పై ప్ర‌త్యేక అభిమానాన్ని చాటుకున్నారు. మ‌ళ్లీ ఇన్నేళ్ల విరామం త‌రువాత ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో మ‌రోసారి హ‌రీష్ శంక‌ర్ `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` మూవీని చేస్తున్న విష‌యం తెలిసిందే. `గ‌బ్బ‌ర్‌సింగ్‌`ని `ద‌బాంగ్‌`కు రీమేక్‌గా తెర‌కెక్కించి త‌న దైన స్టైల్లో బ్లాక్ బ‌స్ట‌ర్‌గా మార్యాడు హ‌రీష్ శంక‌ర్‌.

ఇప్పుడు కూడా త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ `థేరీ`ని `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌`గా రీమేక్ చేస్తున్నాడు. త‌న స్టైల్లో మార్పులు చేసి ఒరిజిన‌ల్ ఫీల్ వ‌చ్చేలా దీన్ని రూపొందిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి ఇది `థేరి` రీమేక్ కాద‌ని చెబుతూనే రీమేక్ చేస్తున్నాడు. శ్రీ‌లీల‌, రాశిఖ‌న్నా హీరోయిన్‌లుగా న‌టించిన ఈ మూవీ కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 26న భారీ స్థాయిలో ఇది ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి క్రేజీ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్‌ని ఫాలో అవుతున్నాడనే వార్త‌లు వినిపిస్తున్నాయి.

ప‌వ‌న్‌ని `గ‌బ్బ‌ర్‌సింగ్‌`తో స‌రికొత్త‌గా ప్ర‌జెంట్ చేసి బ్లాక్ బ‌స్ట‌ర్‌ని అందించ‌డ‌మే కాకుండా ఫ్యాన్స్‌ని ఖుషీ చేసిశాడు హ‌రీష్‌శంక‌ర్. ఇప్పుడు ఇదే ఫార్ములాని సురేంద‌ర్‌రెడ్డి ఫాలో అవుతున్నాడ‌ట‌. హ‌రీష్ త‌ర‌హాలోనే ప‌వ‌న్‌ని స‌రికొత్త క్యారెక్ట‌ర్‌లో చూపిస్తూ ఫ్యాన్స్ మెచ్చే విధంగా సినిమా చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` త‌రువాత ప‌వ‌న్ స్టైలిష్‌ డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డి డైరెక్ష‌న్‌లో ఓ భారీ మూవీకి శ్రీ‌కారం చుడుతున్న విషయం తెలిసిందే. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ య‌మ స్పీడుగా జరుగుతోంది.

సైరా న‌ర‌సింహారెడ్డి, ఏజెంట్ సినిమాల‌తో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్ని ఎదుర్కొన్న సురేంద‌ర్‌రెడ్డి గ‌త రెండు మూడేళ్లుగా ఈ ప్రాజెక్ట్ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాడు. ఇంత‌కీ ఇది ఏ జోన‌ర్ మూవీ? ..ప‌వ‌న్ క్యారెక్ట‌ర్ ఇందులో ఎలా ఉండ‌బోతోంది?.. ప‌వ‌న్‌ని సురేంద‌ర్‌రెడ్డి ఎలా చూపించ‌బోతున్నాడు? అని అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేఫ‌థ్యంలోనే దీనికి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఒక‌టి తాజాగా బ‌య‌టికొచ్చింది.

ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎలా చూడాల‌నుకుంటున్నారో అదే స్థాయిలో సురేంద‌ర్‌రెడ్డి చూపించ‌బోతున్నాడ‌ట‌. నెవ‌ర్ బిఫోర్ క్యారెక్ట‌ర్‌లో ప‌వ‌న్ ఇందులో క‌నిపిస్తాడ‌ని తెలుస్తోంది. అంతే కాకుండా క్యారెక్ట‌ర్ డ్రైవెన్ స్టోరీగా ఓ కొత్త పంథాలో ఈ మూవీ ఉంటుంద‌ని, ఈ సినిమాతో ప‌వ‌న్ అభిమానుల‌కు నెవ‌ర్ బిఫోర్ ఎక్స్‌పీరియ‌న్స్‌ని సురేంద‌ర్‌రెడ్డి అందించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఇందులో ప‌వ‌న్‌కు జోడీగా న‌టించే హీరోయిన్ ఎవ‌రు? ఎప్పుడు సెట్స్ పైకి వ‌స్తుంద‌నే విష‌యాల‌ని టీమ్‌ త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించ‌నుంది.