Begin typing your search above and press return to search.

'దురంధర్-2'ను తక్కువ అంచనా వేశారా?

ముందు అనుకున్న ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను మార్చి 26న రిలీజ్ చేయాలి.

By:  Garuda Media   |   23 March 2026 10:55 PM IST
దురంధర్-2ను తక్కువ అంచనా వేశారా?
X

ముందు అనుకున్న ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను మార్చి 26న రిలీజ్ చేయాలి. కానీ మార్చి 19 నుంచి ‘టాక్సిక్’ సినిమా వాయిదా పడడంతో ఆ డేట్‌ను ఈ మూవీ తీసేసుకుంది. ఉగాది, రంజాన్ పండుగలు కలిసొస్తుండడంతో టీం టెంప్ట్ అయింది. అదే 19నే ‘దురంధర్: ది రివెంజ్’ రాబతోందని తెలిసినా టీం లైట్ తీసుకుంది. బ్లాక్ బస్టర్ అయిన ‘దురంధర్’కు సీక్వెల్ అయినప్పటికీ.. అది హిందీ సినిమా కావడంతో తెలుగు రాష్ట్రాల్లో మరీ ప్రభావం ఏమీ ఉండదని అనుకున్నారు. ప్రి రిలీజ్ ప్రెస్ మీట్లో ‘దురంధర్-2’తో పోటీ గురించి అడిగితే.. నిర్మాత నవీన్ యెర్నేని అదేం పెద్ద విషయం కాదన్నట్లే మాట్లాడారు. తమది పాన్ ఇండియా మూవీ కాదు కాబట్టి.. ఆ చిత్రంతో పోటీగా భావించట్లేదని, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువమంది ప్రేక్షకులు హిందీలోనే చూడాలనుకుంటారని, కాబట్టి ‘ఉస్తాద్’కు దాంతో ఇబ్బంది లేదని వ్యాఖ్యానించారు. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే మాత్రం భిన్నంగా ఉంది. ‘ఉస్తాద్..’ టీం ‘దురంధర్-2’ ప్రభావాన్ని తక్కువ అంచనా వేసిందని, ఈ సినిమాను ముందుకు తీసుకురావడం కాస్ట్లీ మిస్టేక్ అని స్పష్టంగా తెలిసిపోతోంది.

ఓవైపు ‘దురంధర్-2’ బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇంకోవైపు ‘ఉస్తాద్..’ టాక్ ఏమంత గొప్పగా లేదు. పైగా ‘దురంధర్’ చూసిన ప్రేక్షకులందరూ సీక్వెల్ కోసం ఉత్కంఠగా ఎదురు చూసిన పరిస్థితి. పైగా ఏపీలో ‘ఉస్తాద్’ టికెట్ల రేట్లు ఎక్కువ. ‘దురంధర్-2’ నార్మల్ రేట్లతో రిలీజైంది. ఇంకేముంది.. పవన్ సినిమా ఉన్నా సరే, హిందీ చిత్రానికే ప్రాధాన్యం ఇస్తున్న పరిస్థితి. ఓవైపు హిందీలో చూసేవాళ్లు చూస్తున్నారు. రెండు రోజుల తర్వాత తెలుగు వెర్షన్ అందుబాటులోకి రావడంతో వీకెండ్లో ఆ వెర్షన్ ఎగబడి చూశారు. ఆదివారం ‘ఉస్తాద్’ కంటే ‘దురంధర్-2’ తెలుగు వెర్షన్‌కు ఎక్కువ ఆక్యుపెన్సీలు ఉండడం.. ఆ సినిమా ఏ స్థాయిలో ప్రభావం చూపుతోందో చెప్పడానికి ఉదాహరణ. నాలుగ్గంటల నిడివి అయినా సరే జనాలు ఆ సినిమాను ప్రిఫర్ చేస్తున్నారు. ఫుల్ రన్లో ‘దురంధర్-2’ తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు ఊహించని స్థాయిలో ఉండబోతున్నాయి. వీకెండ్ అయ్యాక ‘ఉస్తాద్’ బాగా స్లో అయిన సంకేతాలు కనిపిస్తుండగా.. సోమవారం కూడా ‘దురంధర్-2’కు మంచి ఆక్యుపెన్సీలు ఉండడాన్ని బట్టి ఆ సినిమా ఏ స్థాయిలో పవన్ సినిమాను డ్యామేజ్ చేస్తోందో అర్థం చేసుకోవచ్చు.