Begin typing your search above and press return to search.

ఉస్తాద్ Vs ధురంధర్.. అమెరికా టికెట్ రేట్లపై చర్చేంటి?

రెండు సినిమాలు మార్చి 19వ తేదీ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి.

By:  M Prashanth   |   7 March 2026 12:15 PM IST
ఉస్తాద్ Vs ధురంధర్.. అమెరికా టికెట్ రేట్లపై చర్చేంటి?
X

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్, బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ యాక్ట్ చేసిన ధురంధర్ 2 చిత్రాలు.. బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. రెండు సినిమాలు మార్చి 19వ తేదీ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. దీంతో టికెట్ రేట్ల విషయంపై చర్చ సాగుతోంది.

అయితే ధురంధర్ 2 సినిమా టికెట్ కాస్ట్.. అమెరికాలో సుమారు 9 డాలర్లుగా ఉందని తెలుస్తోంది. అదే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు కొన్ని ప్రాంతాల్లో టికెట్ ధరలు దాదాపు 25 డాలర్ల వరకు ఉన్నట్లు సమాచారం. దీంతో రెండు సినిమాల టికెట రేట్ల మధ్య ఉన్న భారీ ధర తేడా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీయగా.. ఒక్కొక్కరు ఒక్కోలా అభిప్రాయపడుతున్నారు.

ఓవర్సీస్ లో పెద్ద స్టార్ హీరోల సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లు ఎప్పుడూ ఎక్కువ ధరలు నిర్ణయిస్తారని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు అభిమానులు ఎలాంటి ధర ఉన్నా థియేటర్లకు వెళ్లి చూస్తారనే నమ్మకంతోనే టికెట్ ధరలు ఎక్కువగా పెంచుతున్నారని అంటున్నారు. అయితే ఆ విధానం కొందరికి భారంగా మారుతోందని విమర్శిస్తున్నారు.

సినిమాను కుటుంబంతో కలిసి థియేటర్‌లో చూడాలనుకునే వారికి అధిక ధరలు కష్టంగా మారుతున్నాయని వారు చెబుతున్నారు. సినిమా అంటే అందరికీ అందుబాటులో ఉండే ఎంటర్టైన్మెంట్ కావాలి గానీ, అధిక ఖర్చుతో కూడిన ఎక్స్పీరియన్స్ మారకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంకా కొందరు ప్రేక్షకులు మాత్రం మరో యాంగిల్ ను కూడా ప్రస్తావిస్తున్నారు.

విదేశాల్లో సినిమాను విడుదల చేయడానికి డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు, థియేటర్ అద్దెలు, ప్రమోషన్ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయని పలువురు చెబుతున్నారు. అందుకే ఖర్చులను దృష్టిలో పెట్టుకుని టికెట్ ధరలు నిర్ణయించాల్సి వస్తుందని వారు పేర్కొంటున్నారు. అయితే ప్రతి సినిమా విడుదల సమయంలో టికెట్ ధరలు భారీగా పెంచుతూ పోతే భవిష్యత్తులో సాధారణ ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోతుందని వారు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా అప్పుడప్పుడు సినిమాలు చూసే సాధారణ ప్రేక్షకులు ధరల కారణంగా వెనకడుగు వేసే అవకాశం ఉందని అంటున్నారు. ఏదేమైనా చాలా మంది అభిమానులు ఒకటే మాట చెబుతున్నారు. సినిమా వ్యాపారం లాభాలతో నడిచే ఇండస్ట్రీ అయినప్పటికీ, ప్రేక్షకుల కంఫర్ట్ కూడా పరిగణనలోకి తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉంటేనే ఎక్కువ మంది థియేటర్లకు వస్తారని అంటున్నారు. మొత్తానికి అమెరికాలో తెలుగు సినిమాల టికెట్ ధరలపై పెద్ద చర్చే జరుగుతోంది.