ఓజీ కాదు ఉస్తాద్ తో ట్రిబ్యూట్.. బాబోయ్ ఏంటా ధైర్యం..!
ఐతే స్టార్ సినిమాకైన ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేసే ఇలాంటి కామెంట్స్ చేయకపోతే కష్టమని భావించే ప్రొడ్యూసర్ రవి శంకర్ ఇలా ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఎక్స్ పెక్టేషన్స్ పెంచి ఉండొచ్చని అంటున్నారు.
By: Ramesh Boddu | 23 Nov 2025 9:19 AM ISTటాలీవుడ్ లో నెంబర్ 1 ప్రొడక్షన్ గా దూసుకెళ్తుంది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. శ్రీమంతుడుతో మొదలైన ఈ నిర్మాణ సంస్థ ఓ పక్క భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే టాలెంటెడ్ పీపుల్ కి ఛాన్స్ ఇచ్చి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నారు. హీరోని బట్టి బడ్జెట్, స్టోరీని బట్టి కాస్టింగ్ ఇలా మైత్రి మూవీ మేకర్స్ టాలీవుడ్ లో ఉన్న ప్రతి హీరోతో సినిమా చేస్తుంది. లేటెస్ట్ గా ఎనర్జిటిక్ స్టార్ రాం తో ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా చేసింది మైత్రి. ఈ సినిమాను ఈ నెల 27న రిలీజ్ చేస్తున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచే కామెంట్స్..
ఈ సినిమా మ్యూజిక్ కాన్సర్ట్ వైజాగ్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో నిర్మాత రవి శంకర్ తమ బ్యానర్ లో వస్తున్న ప్రతి సినిమా గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచే కామెంట్స్ చేశారు రవి శంకర్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పవర్ స్టార్ ట్రిబ్యూట్ గా ఉంటుందని. హరీష్ శంకర్ ఈ సినిమాకు చాలా ఇష్టంతో పనిచేస్తున్నారని అన్నారు రవి శంకర్. అంతేకాదు ఓజీని మించి ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటుందని.. ప్రతి ఏరియాలో ఉస్తాద్ రికార్డులు క్రియేట్ చేస్తుందని అన్నారు రవి శంకర్.
పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఓజీ ఒక క్రేజీ మూవీ అయ్యింది. సుజీత్ డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమా చూసి పవర్ స్టార్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. అలాంటి ఓజీ సినిమాను కూడా ఉస్తాద్ దాటేస్తుంది అని చెప్పడం ఫ్యాన్స్ ని మరింత ఖుషి చేసింది. ఐతే స్టార్ సినిమాకైన ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేసే ఇలాంటి కామెంట్స్ చేయకపోతే కష్టమని భావించే ప్రొడ్యూసర్ రవి శంకర్ ఇలా ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఎక్స్ పెక్టేషన్స్ పెంచి ఉండొచ్చని అంటున్నారు.
గబ్బర్ సింగ్ తో మర్చిపోలేని ట్రీట్..
అంతేకాదు ఈ సినిమా ఏప్రిల్ ఫస్ట్ లేదా సెకండ్ వీక్ లో రిలీజ్ ఉంటుందని అన్నారు. ఆంధ్రా కింగ్ తాలూకా ఈవెంట్ లో వారి ప్రొడక్షన్ లో వస్తున్న ప్రతి సినిమా గురించి డిస్కస్ చేసి అందరి హీరోల ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశారు నిర్మాత రవి శంకర్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోలీవుడ్ తెరి మూల కథతో దశరథ్, హరీష్ శంకర్ స్క్రీన్ ప్లే అందిన్స్తున్నారు.
గబ్బర్ సింగ్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మర్చిపోలేని ట్రీట్ ఇచ్చిన హరీష్ శంకర్ ఈసారి ఉస్తాద్ భగత్ సింగ్ తో మరోసారి పవర్ స్టార్ ఫ్యాన్స్ కి డబుల్ కిక్ ఇవ్వాలని వస్తున్నాడు. ఉస్తాద్ నుంచి అంతకుముందు రిలీజైన గాజు గ్లాస్ టీజర్ కి అప్పట్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. మరి ఉస్తాద్ రికార్డులు నిజంగానే నిర్మాత రవి శంకర్ చెప్పినట్టుగా సృష్టిస్తుందా లేదా అన్నది చూడాలి.
