Begin typing your search above and press return to search.

ఉస్తాద్ ప‌వ‌ర్ ప్యాక్డ్ ట్రైల‌ర్ వ‌చ్చేస్తోంది!

మెగా అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కాంబినేష‌న్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, డ్యాషింగ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్‌.

By:  Ravindar Gorantla   |   26 Feb 2026 2:45 PM IST
ఉస్తాద్ ప‌వ‌ర్ ప్యాక్డ్ ట్రైల‌ర్ వ‌చ్చేస్తోంది!
X

మెగా అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కాంబినేష‌న్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, డ్యాషింగ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో రూపొందిన `గ‌బ్బ‌ర్‌సింగ్‌` ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టించిందో, మెగా అభిమానుల‌కు ఎలాంటి ఐఫీస్ట్‌ని అందించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ప‌వ‌న్‌కు చాలా రోజుల త‌రువాత బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని అందించ‌డంతో మెగా ఫ్యాన్స్ హ‌రీష్ శంక‌ర్‌కు ఫిదా అయిపోయారు. అప్ప‌టి నుంచి మ‌రోసారి వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఎప్పుడొస్తుందా? అని కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు.

ఇప్ప‌టికి అది సెట్ట‌యింది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, హ‌రీష్ శంక‌ర్‌ల కాంబినేష‌న్‌లో రూపొందుతున్న యాక్ష‌న్ డ్రామా `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌`. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. శ్రీ‌లీల‌, రాశీఖ‌న్నా క‌థానాయిక‌లు. మార్చి 26న భారీ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. టాలెంటెడ్ హీరో స‌త్య‌దేవ్‌, అశుతోష్‌రాణా, త‌మిళ న‌టుడు ఆర్ పార్తీబ‌న్‌, గౌత‌మి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన `దేఖ్‌లేంగే సాలా.., ఆరా ఆఫ్ ఉస్తాద్ పాట‌లు సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో పొలిటిక‌ల్ పంచ్‌లు ఉంటాయంటూ జ‌రుగుతున్న ప్ర‌చారంపై డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ఇప్ప‌టికే క్లారిటీ ఇచ్చేశారు. సినిమాలోని డైలాగ్స్‌, స‌న్నివేశాలు ఏ ఒక్క‌రినీ ఉద్దేశించిన‌వి కాద‌ని, అలాంటివి చూయ‌కూడ‌ద‌ని, పూర్తి స్థాయి వినోదాన్ని పంచ‌డ‌మే మా అక్ష్య‌మ‌ని క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే రెండు పాట‌ల‌ని రిలీజ్ చేయ‌డం, వాటికి మంచి స్పంద‌న ల‌భించ‌డంతో మ‌రో రెండు పాట‌ల‌ని కూడా రిలీజ్ చేయ‌డానికి రెడీ చేస్తున్నారు. అయితే దీనికి ముందు ఈ సినిమా ట్రైల‌ర్‌ని రిలీజ్ చేయాల‌ని డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ట్రైల‌ర్ ని క‌ట్ చేసే ప‌నిలో హ‌రీష్ శంక‌ర్ బిజీగా ఉన్నారు. ఈ సారి ప‌వ‌ర్ ఫ్యాక్డ్ ట్రైల‌ర్ రాబోతోంది. సింగిల్ లైన‌ర్స్‌ని రాయ‌డంలో హ‌రీష్ శంక‌ర్ దిట్ట‌. దీంతో త్వ‌ర‌లో రిలీజ్ కానున్న ట్రైల‌ర్‌లో సింగిల్ లైన‌ర్స్ ఓరేంజ్‌లో పేల‌నున్నాయ‌ని ఇన్ సైడ్ టాక్‌. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన ప‌నుల్ని మొద‌లు పెట్టిన టీమ్ మార్చి 9 త‌రువాత అంటే రెండ‌వ వారంలో ట్రైల‌ర్‌ని రిలీజ్ చేయ‌బోతున్నార‌ని తెలిసింది. దీనికి ముందు ఓ గ్లింప్స్‌ని కూడా రిలీజ్ చేసి `ఉస్తాద్ హంగామా షురూ చేయాల‌ని హ‌రీష్ శంక‌ర్ ప్లాన్ చేస్తున్నాడు.

ఇక మిగిలిన రెండు పాట‌ల‌ని ట్రైల‌ర్ రిలీజ్ త‌రువాతే వ‌ద‌లబోతున్నార‌ట‌. ఇందులో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌వర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. `గ‌బ్బ‌ర్‌సింగ్‌` త‌రువాత మ‌రోసారి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, హ‌రీష్‌ల క‌ల‌యిక‌లో రానున్న సినిమా కావ‌డంతో `ఉస్తాద్‌..పై అభిమానులు భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ పెట్టుకున్నారు. ఆ అంచ‌నాల్ని హ‌రీష్ ఎంత వ‌ర‌కు చేరుకున్నాడు? ..ఫ్యాన్స్‌కి `ఉస్తాద్‌..తో ట్రీట్ ఇస్తాడా? అన్న‌ది తెలియాలంటే మార్చి 26 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.