Begin typing your search above and press return to search.

కాలర్ ఎత్తేలా 'ఉస్తాద్ భగత్ సింగ్'.. పవన్ కళ్యాణ్ మార్క్ మాస్ వైబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ అనగానే అభిమానుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.

By:  M Prashanth   |   12 March 2026 8:49 PM IST
కాలర్ ఎత్తేలా ఉస్తాద్ భగత్ సింగ్.. పవన్ కళ్యాణ్ మార్క్ మాస్ వైబ్
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ అనగానే అభిమానుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. 'గబ్బర్ సింగ్' మ్యాజిక్‌ను మళ్ళీ రిపీట్ చేసేందుకు ఈ జోడీ సిద్ధమైంది. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా నుండి లేటెస్ట్ గా విడుదలైన 'కాలరే ఎత్తరా' లిరికల్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ తనదైన మార్క్ ఎనర్జిటిక్ ట్యూన్‌తో పవన్ ఫ్యాన్స్‌కు పక్కా విజువల్ ట్రీట్ ఇచ్చారని చెప్పాలి.





ఈ పాటలో పవన్ కళ్యాణ్ ఎనర్జీ మరో లెవల్లో ఉంది. రామ్ మిరియాల గాత్రం ఈ మాస్ సాంగ్‌కు పక్కాగా సెట్ అయ్యింది. కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యం పవన్ రియల్ లైఫ్ యాటిట్యూడ్‌కు దగ్గరగా ఉండటం విశేషం. కొన్ని లైన్లు అభిమానులతో విజిల్స్ వేయించేలా ఉన్నాయి. హరీష్ శంకర్ పవన్‌ను ఎలా చూడాలనుకుంటున్నారో ఈ సాంగ్ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. పవన్ స్టెప్పులు కూడా చాలా సింపుల్‌గా, గ్రేస్‌ఫుల్‌గా ఉన్నాయి.

కేవలం సాంగ్ మాత్రమే కాకుండా, ఈ వీడియోలో చూపించిన మేకింగ్ షాట్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్‌లో పవర్‌ఫుల్‌గా కనిపిస్తుండగా, రాశి ఖన్నా తన డాన్స్‌తో సాంగ్‌కు మరింత కలర్ యాడ్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ హరీష్ శంకర్ మధ్య ఉన్న సింక్ ఈ పాటలో స్పష్టంగా కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు కూడా చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈ మాస్ బీట్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయి.

సినిమా విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా తనదైన శైలిలో సమాజంలోని అరాచకాలను ఎలా అడ్డుకున్నాడనే కోణంలో ఉండబోతోంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 19న ఉగాది కానుకగా గ్రాండ్‌గా విడుదల కానుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే క్లీన్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాలో గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ఆడియన్స్‌ను కూడా ఈ సినిమా మెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక 'కాలర్ ఎత్తేస్తా' సాంగ్‌తో 'ఉస్తాద్' ప్రమోషన్స్ పీక్స్‌కు చేరుకున్నాయి. చాలా కాలం తర్వాత పవన్ కంప్లీట్ మాస్ ఎంటర్‌టైనర్ చేస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. ఈ వేసవిలో మెగా అభిమానులకు ఇది ఒక పెద్ద పండుగ లాంటిదని చెప్పవచ్చు. మరి థియేటర్లలో భగత్ సింగ్ అరాచకం ఎలా ఉంటుందో చూడాలంటే మార్చి 19 వరకు ఆగాల్సిందే.