Begin typing your search above and press return to search.

అఫీషియల్: ఉస్తాద్ భగత్ సింగ్.. వచ్చేది ఎప్పుడంటే..

ఈ సినిమాను వచ్చే నెల మార్చి 26న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

By:  M Prashanth   |   4 Feb 2026 6:06 PM IST
అఫీషియల్: ఉస్తాద్ భగత్ సింగ్.. వచ్చేది ఎప్పుడంటే..
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా ఎంత బిజీగా ఉన్నా, తన ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. లేటెస్ట్ గా ఆయన నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' కి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. చాలా కాలంగా షూటింగ్ అప్‌డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్ ఒక పక్కా ప్లాన్ తో సర్ ప్రైజ్ ఇచ్చింది.

రిలీజ్ డేట్ విషయంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న సస్పెన్స్‌కు ఎట్టకేలకూ తెరపడింది. ఈ సినిమాను వచ్చే నెల మార్చి 26న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యే టైమ్ కాబట్టి, బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వేట మొదలుపెట్టడానికి ఇది పర్ఫెక్ట్ డేట్ అని చెప్పవచ్చు. ఈ అనౌన్స్‌మెంట్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో హడావుడి మొదలైంది.

సినిమా రిలీజ్ పోస్టర్ చూస్తే పవన్ కళ్యాణ్ స్వాగ్ వేరే లెవల్ లో కనిపిస్తోంది. వందలాది మంది ప్రజల మధ్య ఒక టేబుల్ మీద నిలబడి ఉన్న పవన్ కళ్యాణ్ లుక్ చూస్తుంటే, ఇందులో ఆయన క్యారెక్టరైజేషన్ ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతోందో అర్థమవుతోంది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో గతంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అదే క్రేజీ కాంబో రిపీట్ అవుతుండటంతో అంచనాలు పీక్స్‌కు చేరాయి.

ఇప్పటికే విడుదలైన 'దేక్ లేంగే సాలా' సాంగ్ ఒక డ్యాన్స్ బస్టర్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ తనదైన గ్రేస్ తో వేసిన స్టెప్స్ కి యూత్ అంతా ఫిదా అయిపోయారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎక్కడా క్వాలిటీ తగ్గకుండా చాలా గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ప్రతి ఫ్రేమ్ లోనూ పవర్ స్టార్ ఇమేజ్ ను ఎలివేట్ చేసేలా హరీష్ శంకర్ జాగ్రత్తలు తీసుకున్నారట.

శ్రీలీల, రాశీ ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాకు మరో పెద్ద బూస్ట్ ఇవ్వనుంది. కేవలం మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, ఈ సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉండబోతోందని టాక్. థియేటర్లలో విజిళ్లు వేయించే సీన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునేలా ఈ కథను సిద్ధం చేశారట. రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వడంతో ఇకపై ప్రమోషన్స్ లో కూడా స్పీడ్ పెంచబోతున్నారని చిత్ర బృందం హింట్ ఇచ్చింది. ఇక సమ్మర్ సీజన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తాడో చూడాలి.