Begin typing your search above and press return to search.

పవన్‌ పేరు... అది వినకుండానే రాశి ఓకే!

హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్‌ కళ్యాణ్ తదుపరి సినిమా ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌తో వచ్చేందుకు మొత్తం రెడీగా ఉంది.

By:  Ramesh Palla   |   19 Oct 2025 4:00 PM IST
పవన్‌ పేరు... అది వినకుండానే రాశి ఓకే!
X

హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్‌ కళ్యాణ్ తదుపరి సినిమా ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌తో వచ్చేందుకు మొత్తం రెడీగా ఉంది. హరీష్ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మూవీలో ఇద్దరు ముద్దుగుమ్మలు నటిస్తున్న విషయం తెల్సిందే. మొదట హీరోయిన్‌గా శ్రీలీల అంటూ ప్రచారం జరిగింది. షూటింగ్‌ ప్రారంభం అయిన తర్వాత కొన్నాళ్లకు రాశి ఖన్నా సైతం ఈ సినిమాలో ఉందంటూ వార్తలు వచ్చాయి. రాశి ఖన్నా సైతం ఒకటి రెండు సందర్భాల్లో సినిమాలో తాను ఉన్నట్లుగా పేర్కొంది. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాలో రాశి ఖన్నా మెయిన్ లీడ్‌గా నటిస్తున్న మాట వాస్తవం, అయితే ఆమె పాత్ర ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సమయంలో స్వయంగా ఆమె నుంచి ఆసక్తికర ప్రకటన వచ్చింది.

తెలుసు కదా సినిమాలో రాశి ఖన్నా

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమా షూటింగ్‌లో ఇప్పటికే పాల్గొన్నట్లుగా రాశి ఖన్నా ప్రకటించింది. తాజాగా రాశి ఖన్నా నటించిన తెలుసు కదా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన తెలుసు కదా సినిమాలో రాశి ఖన్నా ఒక హీరోయిన్‌గా నటించగా, మరో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటించిన విషయం తెల్సిందే. ఇద్దరి పాత్రలకు మంచి ప్రాధాన్యత ఉంది. అయితే ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌లో ఈమె పాత్రకు ఏ మేరకు ప్రాధాన్యత ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ లో మీ పాత్ర ఏంటి అంటూ ప్రశ్నించిన సమయంలో తప్పకుండా ప్రతి ఒక్కరిని మెప్పించే విధంగా ఉంటుంది, తన కెరీర్‌కి బిగ్‌ టర్నింగ్‌ పాయింట్‌ను తీసుకు వచ్చే విధంగా ఉంటుంది అన్నట్లుగా రాశి ఖన్నా తాజా ఇంటర్వ్యూలో చెప్పడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడ్డట్లు అయింది.

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల..

రాశి ఖన్నా తాజాగా ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ గురించి మాట్లాడుతూ... చాలా కాలం నుంచి పవన్‌ కళ్యాణ్‌ గారితో ఒక్క సినిమా అయినా చేయాలని కోరుకున్నాను. ఆయన సినిమాలో చిన్న పాత్ర వచ్చినా చాలు, ఆయనతో ఒక్కసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటే చాలు అన్నట్లుగా ఎదురు చూస్తున్నాను. అలాంటి సమయంలో హరీష్ శంకర్‌ గారు నాకు ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ లో ఒక పాత్రను ఆఫర్‌ చేసినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. పవన్‌ కళ్యాణ్ గారి సినిమా అనగానే నేను మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నారు. నా కెరీర్‌లో ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశాను, కానీ ఏ ఒక్కటి కూడా స్క్రిప్ట్‌ వినకుండా, పాత్ర గురించి తెలుసుకోకుండా కమిట్‌ కాలేదు. కానీ మొదటి సారి పవన్‌ కళ్యాణ్‌ గారి పేరు చెప్పిన వెంటనే స్క్రిప్ట్‌ గురించి కూడా అడగకుండానే సినిమాకు ఓకే చెప్పాను అని రాశిఖన్నా చెప్పుకొచ్చింది.

పవన్‌ కళ్యాణ్ కంప్లీట్‌ మ్యాన్‌

పవన్‌ కళ్యాణ్‌ గురించి మాట్లాడుతూ.. ఆయన గొప్ప శక్తివంతుడు, ఆయన ఎప్పుడూ సామాన్యుల గురించి ఆలోచించడం నేను చూశాను. ఆయన పూర్తి స్థాయిలో మానవత్వం కలిగిన వ్యక్తి. ఆయన ఇది అది అని కాకుండా ప్రతి ఒక్క విషయంలో అవగాహణ కలిగి ఉన్నాడు. అలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలితో ఈ సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం అంటూ రాశి ఖన్నా పేర్కొంది. పవన్‌ కళ్యాణ్‌తో వర్క్ చేసే అవకాశం వస్తే ఎంత పెద్ద స్టార్స్ అయినా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయనతో వర్క్‌ చేయాలని చాలా మంది హీరోయిన్స్ కోరుకుంటారు. అలాంటి అదృష్టం ఇప్పుడు రాశి ఖన్నాకు రావడం, ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసి, విడుదలకు ఎదురు చూడటం జరుగుతుంది. ఈ సమయంలో ఆమె మైండ్‌ సెట్‌ ఎలా ఉంటుంది, ఆమె ఎంత ఉత్సాహంగా సినిమా కోసం ఎదురు చూస్తుందో అర్థం చేసుకోవచ్చు.