Begin typing your search above and press return to search.

పవన్ 'ఉస్తాద్'.. AP బిజినెస్ సంగతేంటి?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

By:  M Prashanth   |   25 Feb 2026 12:11 PM IST
పవన్ ఉస్తాద్.. AP బిజినెస్ సంగతేంటి?
X

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్‌ గా రూపొందుతున్న ఆ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై బజ్ రోజురోజుకూ పెరుగుతోంది. అదే సమయంలో ప్రీ రిలీజ్ బిజినెస్ పై చర్చ జరుగుతోంది.

అయితే ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌ తో కమర్షియల్ ఎలిమెంట్స్ కు ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోంది. నైజాం ఏరియాలో సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. దీంతో అక్కడ డిస్ట్రిబ్యూషన్ విషయంలో పెద్దగా డౌట్స్ లేవు.

కానీ ఆంధ్ర, సీడెడ్ ప్రాంతాల్లో బిజినెస్ ఎలా ఉండబోతుందన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే మేకర్స్ ఆంధ్ర ఏరియా రైట్స్ దాదాపు రూ.70 కోట్ల వరకు కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం ఇండస్ట్రీలోనే పెద్ద డీల్‌ గా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సినిమాపై మంచి బజ్ ఉన్నప్పటికీ, ఇంత భారీ రేటుకు కోట్ చేయడం డేరింగ్ డెసిషన్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అయితే పవన్ కళ్యాణ్‌ కు ఉన్న ఫ్యాన్ బేస్, మాస్ క్రేజ్‌ ను దృష్టిలో ఉంచుకుని ఆ రేట్ ను మేకర్స్ కోట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఓపెనింగ్స్ గ్యారెంటీ అన్న ఫీలింగ్ అందరిలో ఉంది. మొదటి వారం కలెక్షన్లు స్ట్రాంగ్ గా ఉంటే పెట్టుబడులు ఈజీగా రికవరీ అయ్యే అవకాశముంది. ఇక కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే మాత్రం వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

అదే సమయంలో మౌత్ టాక్ పాజిటివ్‌ గా వస్తే రికార్డులు బద్దలు కావడం ఖాయమని చెప్పాలి. ఇక దర్శకుడు హరీష్ శంకర్- పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌ కు ఇప్పటికే మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచి పవన్ కెరీర్‌ లో మైల్ స్టోన్ గా నిలిచింది. ఆ మ్యాజిక్‌ ను మళ్లీ రిపీట్ చేస్తారన్న హోప్స్ అభిమానుల్లో కనిపిస్తున్నాయి.

అదే ఎనర్జీ, అదే మాస్ టచ్‌ తో ఈసారి మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా ఉస్తాద్ భగత్ సింగ్ భారీ అంచనాలతో వచ్చేందుకు రెడీ అవుతోంది. థియేటర్స్ లో రిలీజ్ సమయానికి మరిన్ని డీల్స్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. ఏదేమైనా అభిమానులు మాత్రం మార్చి 26వ తేదీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.