ఆ ఛాన్స్ తీసుకుంది పవన్ కళ్యాణ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన `ఉస్తాద్ భగత్ సింగ్` రిలీజ్ కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 16 March 2026 9:52 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన `ఉస్తాద్ భగత్ సింగ్` రిలీజ్ కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు, పాటలతో ఉస్తాద్ మార్కెట్ ని ఊపేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు ఇద్దరు సంగీత దర్శకులు పని చేసిన విషయం విధితమే. పాటలకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, సినిమాకు నేపథ్య సంగీతాన్ని థమన్ అందించారు. అలా ఈ సినిమాలో థమన్-దేవి భాగస్వాములు అయ్యారు. అయితే ఒకే సినిమాకు ఇద్దరు పనిచేయడం అన్నది బాలీవుడ్ ఇండస్ట్రీలో లో అమలులో ఉంది కానీ టాలీవుడ్ లో లేదు.
ఇక్కడ అలాంటి సయోధ్యలు కుదరవు. అయితే థమన్ ఎంట్రీ వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరు? అన్నది ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. సాధారణంగా సినిమాకు సంబంధించిన సాంకేతిక విషయాలను దర్శకులే చూసుకుంటాడు. కానీ ఈ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌కు నేపథ్య సంగీతం బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. నిజానికి ఒక భారీ కమర్షియల్ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనేది వెన్నెముఖ లాంటిది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో సినిమాలో ఎలివేషన్ సీన్లు పండాలంటే మ్యూజిక్ అదిరిపోవాలి.
అందుకే థమన్‌తో గతంలో ఉన్న సాన్నిహిత్యం , ఆయన పనితీరుపై నమ్మకంతో పవన్ నేరుగా ఈ బాధ్యతను ఆయనకు అప్పగించారట. ఏయే సన్నివేశాల్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉండాలో పవన్ స్వయంగా తన విజన్‌ను థమన్‌కు వివరించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో దర్శకుడు హరీష్ శంకర్ ప్రమేయం లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సాధారణంగా హరీష్ శంకర్ సినిమాల్లో సంగీతం , నేపథ్య సంగీతం విషయంలో ఆయన మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ `ఉస్తాద్ భగత్ సింగ్` విషయంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక సినిమాను మరింత పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేయాలనే ఉద్దేశం ఉంది.
హీరోనే స్వయంగా ఆర్ ఆర్ బాధ్యతలు అప్పగించడంతో థమన్ కూడా రెట్టింపు ఉత్సాహంతో పని చేసారు.పవన్ కళ్యాణ్ గత చిత్రాలైన `వకీల్ సాబ్`, `భీమ్లా నాయక్` సినిమాలకు థమన్ అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించారు. ఆ నమ్మకంతోనే పవన్ ఈ ఛాన్స్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో మ్యూజిక్ అదిరిపోవడంతో, పూర్తి సినిమాలో ఆర్ ఆర్ ఏ రేంజ్‌లో ఉండబోతుందోనని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. పవన్ మార్క్ మాస్ ఎలివేషన్లకు థమన్ మార్క్ డ్రమ్స్ తోడైతే థియేటర్లలో రచ్చ ఖాయమే. పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ ఇమేజ్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని చేసిన ప్రాజెక్ట్ ఇది. అందుకే ప్రతి చిన్న విషయంలోనూ ఆయన శ్రద్ధ తీసుకుంటున్నారు. సినిమాలో ఐటం పాట లేని సంగతి తెలిసిందే.
